సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఆర్థిక నేరస్థులపై చర్యల విషయంలో తన సంకల్పాన్నిరుషీకేష్లో జరిగే జి20 ఎసిడబ్ల్యుజి సమావేశంలో పునరుద్ఘాటించనున్న ఇండియా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి.


ఉత్తరాఖండ్లోని రుషీకేష్ లో 2023 మే 25 నుంచి 27 మధ్య జి 20 దేశాలకు చెందిన ,
అవినీతి వ్యతిరేక రెండో వర్కింగ్ గ్రూప్ సమావేశం (ఎసిడబ్ల్యుజి) ను నిర్వహించనున్న డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్,

ఆర్ధిక నేరస్థులు దేశం విడిచి పారిపోయి, సరళతర చట్టాలున్న ఇతర దేశాలలో తలదాచుకోకుండా
నిరోధించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో
ఇండియా,గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్.
(డిఒపిటి) .

Posted On: 24 MAY 2023 5:06PM by PIB Hyderabad

 ఆర్థిక నేరస్థుల పట్ల ఏమాత్రం ఉపేక్షచూపబోమన్న సంకల్పాన్ని ,ఉత్తరాఖండ్లోని రుషీకేష్ లో జరగనున్న జి20 సమావేశంలో పునరుద్ఘాటించనున్న ఇండియా.
ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈవిషయాన్ని తెలిపారు.
ఉత్తరాఖండ్ లోని రుషీకేష్లో మే 25న ప్రారంభమవుతున్న అవినీతి వ్యతిరేక వర్కింగ్ గ్రూప్ (ఎసిడబ్ల్యుజి) రెండో సమావేశంలో,
అంతర్జాతీయంగా అవినీతిని ఎదుర్కొనేందుకు జి20దేశాల మరింత కట్టుబాటుకు ఇండియా ప్రయత్నించనుంది.
ఈ రెండో వర్కింగ్ గ్రూప్ సమావేశానికి పూర్వరంగంగా, నేషనల్ మీడియా సెంటర్ లో డాక్టర్ జితేంద్ర సింగ్
 ఈవిషయం వెల్లడించారు.
 ఆర్ధిక నేరస్థులు దేశం నుంచి పారిపోయి, సులభతర చట్టాలున్న ఇతర దేశాలలో
తలదాచుకోకుండా చూసేందుకు ఇండియా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

2018లో అర్జెంటీనా అధ్యక్షతన జరిగిన జి20 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ధిక నేరస్థులపై చర్యలకు 9 సూత్రాల
అజెండా ఫర్ యాక్షన్ ను ప్రకటించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశంవిడిచి పారిపోయి ఇతర దేశాలలో తలదాచుకునే ఆర్థిక నేరస్థుల
ఆస్తులను జి20 దేశాలు స్వాధీనం చేసుకునేందుకు 9 సూత్రాలను ప్రధానమంత్రి అప్పట్లో ప్రకటించారు.

ఆర్థిక నేరస్థులు పరారై ఇతర దేశాలలో తలదాచుకోకుండా చూసేందుకు , పరస్పరం బలమైన, క్రియాశీల సహకారానికి,
ఇండియా పిలుపునిచ్చింది. అలాగా ఈ విషయంలో అంతర్జాతీయ ఒప్పందాల అమలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో తగిన చర్యలకు
ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు, పరారైన ఆర్థిక నేరస్థుల విషయంలో తగిన నిర్వచనం ఇచ్చేందుకు,
పరారైన ఆర్ధిక నేరగాళ్ల విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కఫోర్స్ (ఎఫ్.ఎ.టి.ఎఫ్) నిర్దేశిత ప్రక్రియల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు,
ఆర్ధిక నేరగాళ్ల ఆస్తులు గుర్తించిన దానికి సంబంధించి చర్యలు ప్రారంభించేందుకు ఉమ్మడి ప్లాట్ఫారం  ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు పిలుపునిచ్చారు.
 పై అంశాల ఆధారంగా జి 20  సమావేశం, అవినీతి, ఇతర ఆర్థిక నేరాలతో గల సంబంధాలను అంచనావేయడంతోపాటు,
వాటిని ఎదుర్కొనేందుకు, ఈ విషయంలో పరస్పర సహకారానికి, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని తిరిగివారి వారి స్వదేశాలకు పంపేందుకు,
చోరీ సొత్తును జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం పై చర్చించనుంది.
అవినీతిపై పోరాటం విషయంలో వాస్తవిక సహకారం అందించడానికి జి20 దేశాలు తమ కట్టుబాటును ప్రకటించాయి.
అలాగే అవినీతికి పాల్పడిన వారు దాని ద్వారా సంపాదించిన సొమ్మును ఇతర దేశాలలో భద్రపరచడాన్ని అడ్డుకునేందుకు చర్యలు
 తీసుకునేందుకు జి 20 దేశాలు సంసిద్ధత తెలిపాయి.

భారతదేశపు ప్రస్తుత ప్రాధాన్యత, అవినీతిపై పోరాటంలో అంతర్జాతీయ సహకారన్ని, గత ఒప్పందాలను
ముందుకు తీసుకెళ్లడం, అవినీతికి పాల్పడి ఇతర దేశాలలో తలదాచుకుంటున్నవారిని వెనక్కు పంపడం,
ఇతర దేశాలలో దాచిపెట్టిన అవినీతి ఆస్తులను
తిరిగి ఆయా దేశాలకు అప్పగించడం వంటివి ఉన్నాయి. ఇది అన్ని జి 20 దేశాలను ప్రస్తుతం వేధిస్తున్న సమస్యగా ఉంది.
ఈ విషయంలో భారతదేశ ప్రతిపాదనకు అంగీకారం లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

జి 20, ఎసిడబ్ల్యుజి సమావేశం ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, జి 20 కి ఇండియా అధ్యక్షత,
జి 20 అవినీతి వ్యతిరేక వర్కింగ్ గ్రూప్లో 5 ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. అవి, అవినీతిపై పోరాటంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం,
ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల సమగ్రతను కాపాడడం, అవినీతిని నిరోధించడం, అవినీతిని ఎదుర్కోవడంలో అవి బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడడం
వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే అవినీతిని నిరోధించడంలో ఆడిట్సంస్థల పాత్ర, ప్రభుత్వ రంగంలో అవినీతిని ఎదుర్కోవడంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి)
ని ఉపయోగించుకోవడం,  వంటివి ఇందులో ఉన్నాయి.

జి 20 ఎసిడబ్ల్యుజిసమావేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్,
ఇండియా  అవినీతి వ్యతిరేక వ్యూహాలలో జెండర్ సెన్సిటివిటి గురించి కూడా  ఇండియా ఒక ప్రత్యేక ఈవెంటన్ ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
2023 మే 25 వ తేదీన, ఉత్తరాఖండ్ లోని రుషీకేష్ లో జరిగే ఎసిడబ్ల్యుజి జి20 రెండోసమావేశం సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో జి 20 దేశాలకు చెందిన ప్రభుత్వ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన వారు కీలకోపన్యాసం చేయనున్నట్టు తెలిపారు.
క్షేత్రస్థాయిలో భారతీయ గొంతుకను ఈ సందర్బంగా వినిపించడం జరుగుతుందన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఇండియా తన
స్వీయ అనుభవాలను ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించనున్నట్టు చెప్పారు. అవినీతి వ్యతిరేక చర్యలు మహిళాసాధికారతకు ఉపయోగపడినట్టు కూడా ఆయన తెలిపారు.

జి 20 ఎసిడబ్ల్యుజి సభ్యదేశాలు అనుసరించే ఉత్తమ విధానాలకు సంబంధించిన కాంపెండియంను ఇండియా తయారుచేస్తున్నట్టు ఆయన తెలిపారు.
అవినీతిని ఎదుర్కోవడంలో ఆడిటింగ్ పాత్రను ఇందులో ప్రస్తావించనున్నారు. ఇది కీలక ఆడిట్ ఆథారిటీలు, అవినీతి వ్యతిరేక సంస్థలు,
పారదర్శకతను పెంపొందించడానికి, జవాబుదారిత్వానికి, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా కట్టుబడి ఉండేల చూడడానికి,
పబ్లిక్ ఫైనాన్స్లలో సమర్ధతసాధించడానికి ఈ కాంపెండియం ఉపకరించనుంది. అవినీతి వ్యతిరేక పోరాటంలో
ఇండియాప్రాధాన్యతలను బలోపేతం చేయడానికి, దీనిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీనికితోడు, ఇండియా అకౌంటబులిటీ రిపోర్టును 2023 సంవత్సరానికి తయారు చేస్తోంది. పరస్పర న్యాయ సహాయం (ఎం.ఎల్.ఎ) విషయంలో
సమర్థత ప్రొసీజర్లు, ఇతర క్రిమినల్ నేరాలపైపై ప్రత్యేక విశ్లేషణను ఇది అందించనుంది. ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను అవగాహన చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
అవినీతిపై పోరాటంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, భారతదేశ ప్రాధాన్యతలను ముందుకు తీసుకువెళ్లేందుకు
ఇది ఒక సానుకూల ముందడుగుగా చెప్పవచ్చు.

జి 20 ఎసిడబ్ల్యు జి సమావేశం, ఇండియాకు ఇతర దేశాలతో ఈ విషయమై సంప్రదింపులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే,
తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, విధాన రూపకల్పనకు, అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి,
ఉపకరిస్తుంది. ఇది అంతా భారతదేశపు అవినీతి వ్యతిరేక ఫ్రేమ్వర్క్కు ఉపయోగపడనుంది. డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ (డిఒపిటి) కిచెందిన ఎస్.రాధా చౌహాన్ మాట్లాడుతూ,
జి 20 ఎసిడబ్ల్యుజి సమావేశం తొలి ఎసిడబ్ల్యుజి సమావేశానికి కొనసాగింపు అన్నారు. ఇది జి 20 దేశాలు ఆర్ధిక నేరగాళ్లు ఆయా దేశాలలోనేరాలకు పాల్పడి ఇతర దేశాలలో తలదాచుకోకుండా చూసేందుకు
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం సహకరించుకోవడం, అలాంటి వారిని నిరోధించడం, పరస్పర న్యాయ సమాచారాన్ని అందించుకోవడం
ఇందుకు సంబంధించి నెట్వర్కింగ్, నిర్వహణాపరమైన ఫ్రేమ్ వర్క్ను రూపొందించుకోవడం పై ఈ సమావేశంలో దృష్టిపెట్టనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశం అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆయా దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు, సభ్యదేశాలు తీసుకుంటున్న చొరవ
,సమన్వయం గురించి తెలుసుకునేందుకు ఒక వేదికగా ఉపకరించనుంది. దీనివల్ల సభ్యదేశాలు అవినీతి వ్యతిరేక పోరాటంలో మరింత
సమర్థతతో చురుకుగా పనిచేయడానికి వీలు ఏర్పడనుంది.

***



(Release ID: 1927157) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi