ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతం నూతన వృద్ధి కేంద్రంగా ఎదిగే శక్తి కలిగిఉందని తెలిపిన కేంద్ర డిఒఎన్ఇఆర్ శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి.


ఇందుకు అంతర్జాతీయ కొలాబరేషన్కు రాయబారుల సమావేశంలో పిలుపునిచ్చిన మంత్రి.

Posted On: 24 MAY 2023 8:46PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, డి.ఒఎన్ఇఆర్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన, ఈశాన్య గ్లోబల్ ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సమ్మేళనం ముందస్తు ఏర్పాట్ల సమావేశంలో వివిధ దేశాల రాయబారులనుద్దేశించి ప్రసంగించారు.
ఈశాన్య ప్రాంతంలో గల అవకాశాలు, ఏర్పడనున్న అవకాశాల పై ఈ సమావేశంలో దృష్టిపెట్టారు. అలాగే అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టేందేకు , కొలాబరేషన్ కుగల అవకాశాల గురించి ఇందులో చర్చించారు.
ఈశాన్య ప్రాంతానికి గల సామర్ధ్యాన్ని గమనించినపుడు ఇది ఒక కొత్త అభివృద్ధి ఇంజిన్గా రూపుదిద్దుకోగలదని ఆయన నొక్కి చెప్పారు. ఈ దిశగా ఈ పెట్టుబడలు శిఖరాగ్ర సమ్మేళనం చెప్పుకోదగిన మైలురాయిగా పేర్కొన్నారు.
గ్లొబల్ ఇన్వెస్టర్లకు అద్భుత వకాశాలున్నాయని, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన సానుకూల విధానాలను తీసుకువచ్చేందుకు మంత్రిత్వశాఖ కృషి   చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలో ఉన్న అపార సహజవనరుల గురించి, వ్యవసాయరంగం సామర్థ్యం, వివిధ రకాల ఖనిజసంపద, పునరుత్పాదక ఇంధన వనరుల అందుబాటు గురించి మంత్రి ప్రస్తావించారు.  సాంస్కృతిక వైవిధ్యత,
ఈశాన్యప్రాంతం వ్యూహాత్మక ప్రాంతంగాఉండడంతో దీనిని ప్రత్యేకించి దక్షిణాసియ వ్యాపార వాణిజ్యానికి ముఖద్వారంగా తీర్చిదిద్దడం జరుగుతోందని మంత్రి చెప్పారు.
పర్యాటకరంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రత్యేక పర్యాటక అవకాశాల అభివృద్ధి వంటి వాటిలో కొలాబరేషన్ను  ప్రోత్సహిస్తున్నట్టు శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
గత 9 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సాధించిన ప్రగతి గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. చెప్పుకోదగిన పెట్టుబడులతో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలైన విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వేల అభివృద్ధి సుమారు 5 లక్షల కోట్ల రూపాయలతో విలువగల పెట్టుబడులతో చేపట్టినట్టు ఆయన తెలిపారు.


ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తద్వారా ఎంటర్ ప్రెన్యుయర్ షిప్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈశాన్య ప్రాంత సుసంపన్న జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు
సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను మంత్రి నొక్కి చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో గల వైవిధ్యతతో కూడిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా వివిధ దేశాల రాయబారులకు మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈశాన్య ప్రాంతంలో గల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాయబారులు ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకు పెట్టుబడుల శిఖరాగ్ర సమ్మేళనం ఒక వేదిక కాగలదని వారు తెలిపారు.
టూరిజం, వ్యవసాయం, టెక్స్టైల్ రంగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇది వీలు కల్పించగలదన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.
వాణిజ్య శాఖ సహాయమంత్రి శ్రీ సోమ్ ప్రకాశ్, ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ రాజ్ కుమార్ రంజన్,  డి.ఒ.ఎన్.ఇ.ఆర్ శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్.వర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1927150) Visitor Counter : 103