బొగ్గు మంత్రిత్వ శాఖ

వాణిజ్య బొగ్గు గనుల 7వ దఫా వేలం కోసం బిడ్‌ల సమర్పణ తేదీని జూన్ 27 వరకు పొడిగించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 24 MAY 2023 5:02PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య బొగ్గు గనుల 7వ దఫా వేలం కోసం బిడ్‌ల సమర్పణ చివరి తేదీని జూన్ 27, 2023 వరకు బొగ్గు మంత్రిత్వ శాఖ పొడిగించింది.

బిడ్డర్‌ల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని, మంత్రిత్వ శాఖ బిడ్ సమర్పణకు చివరి తేదీని 28 రోజులు పొడిగించింది. దీంతో, 7వ దఫా వేలం కోసం బిడ్‌ల సమర్పణకు చివరి తేదీ 30.5.2023 నుంచి 27.06.2023కు మారింది.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశ్యంతో, సంవత్సరానికి 540 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) మొత్తం పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్‌సీ) కలిగిన 133 గనులను బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు కేటాయించింది లేదా వేలం వేసింది. వీటిలో 48 బొగ్గు గనులు మొత్తం 195 ఎంటీపీఏ పీఆర్‌సీతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే 22 వరకు, సొంత/వాణిజ్య గనుల నుంచి ఉత్పత్తి 16.25 ఎంటీలకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే సమయంలోని ఉత్పత్తి 14.75 ఎంటీలతో పోలిస్తే 10.2% వృద్ధి సాధ్యమైంది.

బొగ్గు గనుల అభివృద్ధిలో ప్రైవేట్ కంపెనీలు నిశ్చింతగా పాల్గొనేలా చూడడానికి, భూమి లభ్యత, పర్యావరణం/అటవీ అనుమతులు, ఆర్థిక సంస్థల నుంచి సాయం, సంబంధిత సంస్థల పరంగా అవసరమైన సహాయాన్ని మంత్రిత్వ శాఖ అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత/వాణిజ్య గనుల నుంచి 162 ఎంటీల ఉత్పత్తిని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

****



(Release ID: 1927147) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Hindi