ఆయుష్
పిసిఐఎం&హెచ్ ఇ-ఆఫీస్ & ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు ఫార్మాకోపియా మోనోగ్రాఫ్‌లను అవాంతరాలు లేకుండా అందుబాటులోకి తేవడాన్ని ఆన్‌లైన్ పోర్టల్ ప్రోత్సహిస్తుంది
Posted On:
24 MAY 2023 7:31PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఘజియాబాద్‌లోని ఫార్మాకొపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎం &హెచ్ - భారతీయ వైద్యచికిత్స & హోమియోపతి ఔషధ కోశం కమిషన్)ను సందర్శించి, పిసిఐఎం&హెచ్ ఇ- ఆఫీస్ పోర్టల్‌ను, ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఔషధ కోశ వ్యాసాలను, ఏకవిషయిక రచనల సాఫ్ట్ కాపీలను విక్రయించేందుకు ఆన్‌లైన్ పోర్టల్ ను ఉద్దేశించారు..
మంత్రి ఫార్మకోగ్నసీ (ఔషధ ప్రకృతి విజ్ఞానం), ఫైటో కెమిస్ట్రీ (ఉద్భిజ్జములకు సంబంధించిన రసాయనశాస్త్రం), మైక్రోబయాలజీ (సూక్ష్మజీవశాస్త్రం) ప్రయోగశాలలను, మూలికా వనాన్ని, ఎఎస్‌యు& హెచ్ ఔషధాల ముడి ఔషధ కోశాగారాన్నితనిఖీ చేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనిఫార్మాకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసన్ & హోమియోపతి (పిసిఎం&హెచ్) ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి (ఎఎస్‌యు&హెచ్) ఔషధాల ప్రమాణీకరణ, నాణ్యతా నియంత్రణలో చురుకుగా నిమగ్నమై, ఔషధ కోశం రూపంలో ప్రమాణాలను ప్రచురిస్తోంది.
ఎఎస్‌యు&హెచ్ ఔషధాల నాణ్యతను నిర్వహించడంలో పిసిఐఎం&హెచ్ ప్రశంసనీయమైన రీతిలో పని చేస్తోందని శ్రీ సర్బానంద సోనోవాల్ తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. పిసిఐఎం&హెచ్‌లో విద్వత్తుగల శాస్త్రవేత్తల బృందం, సాంకేతిక సిబ్బంది పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించారని, జీవనశైలి వ్యాధుల నిర్వహణలో, వ్యాధులను నివారించడంలో యోగ సాధన తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి పిసిఐఎం&హెచ్ సందర్శన సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు ((ఆయుర్వేద) డాక్టర్ కౌస్తుభ ఉపాధ్యాయ, పిసిఐఎం&హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు.
పిసిఐఎం&హెచ్ ఇ-ఆఫీస్ పోర్టల్‌ను, ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఫార్మకోపియల్ మోనోగ్రాఫ్‌ల సాఫ్ట్ కాపీలను ఆన్‌లైన్ పోర్టల్‌ను విక్రయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు ఫార్మకోపియా మోనోగ్రాఫ్‌లు ఎటువంటి అవాంతరాలు లేకుండా అందుబాటులోకి తేవడాన్ని ఆన్‌లైన్ పోర్టల్ ప్రోత్సహిస్తుంది.
పిసిఐఎం&హెచ్ మాసపత్రిక (న్యూస్‌లెటర్‌ను) కూడా మంత్రి విడుదల చేశారు. పిసిఐఎం&హెచ్ చేపట్టే కార్యకలాపాలను వెలుగులోకి తేవడమే కాక, ఎఎస్ఎయు&హెచ్ మందుల నాణ్యత నియంత్రణ, ప్రమాణీకరణ క్షేత్రంలో వస్తున్న నూతన పరిణామాల గురించి భాగస్వాములను న్యూస్‌లెటర్ తాజా పరుస్తుంది.
***
(Release ID: 1927141)
Visitor Counter : 218