రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు
‘కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్: సస్టైనబుల్ ట్రాన్సిషన్స్ త్రూ గ్రీన్ టెక్నాలజీస్ అండ్ డిజిటలైజేషన్’ అనే అంశంపై సదస్సు
Posted On:
24 MAY 2023 7:33PM by PIB Hyderabad
రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ డిపార్ట్‌మెంట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో 'కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్: సస్టైనబుల్ ట్రాన్సిషన్స్ త్రూ గ్రీన్ టెక్నాలజీస్ అండ్ డిజిటలైజేషన్' అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో బీ20 అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వర్చువల్ గా ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సదస్సులో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కెమికల్ మరియు పెట్రో కెమికల్ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్‌ను తీర్చడానికి ఈ విభాగంలో సంవత్సరానికి దాదాపు 1.2 లక్షల మందికి నైపుణ్యాన్ని అందించడానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీ, విద్య, ఇంధన పరివర్తనలు, పర్యావరణం & వాతావరణ సుస్థిరత అనేవి ప్రభుత్వం యొక్క నాలుగు ప్రధాన ప్రాధాన్యత రంగాలని ఆయన ప్రధానంగా తెలియజేశారు.
భారత్ మెరుగైన స్థానంలో ఉంది..
రసాయనాలు & ఎరువులు మరియు కొత్త & పునరుత్పాదక శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా మాట్లాడుతూ గత 9 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వేగవంతమైన వృద్ధిని హైలైట్ చేశారు. ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎగబాకిందని అన్నారు. ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న అవరోధాలను దాటుకురావడంలో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందనే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ కూడా గుర్తించిందని అన్నారు. అంతేకాకుండా, గత 9 సంవత్సరాలలో ఒక్కొక్కటి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 9 యూరియా ప్లాంట్‌లను ఏర్పాటు చేశామని, త్వరలో భారతదేశం యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించేలా సులభ విధానాలు..
కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ పర్యావరణ సమ్మతి మినహా రసాయన రంగం లైసెన్స్ రద్దు చేయబడిందని విధానం క్రమబద్ధీకరించబడదని ఉద్ఘాటించారు. దేశంలో పరిశ్రమ వృద్ధిలో గణనీయమైన సహకారం అందించడానికి ప్రైవేట్ రంగం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. “2070 నాటికి నికర జీరో” అనే క్లారియన్ కాల్ను సాధించడానికి, కెమికల్స్ & పెట్రోకెమికల్స్ డిపార్ట్మెంట్ ఈ రంగంలో అందుబాటులో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి శ్రద్ధగా పని చేస్తోందని అన్నారు. ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించడానికి సులభతర విధానాలను రూపొందించడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. (i) కెమికల్స్ & పెట్రోకెమికల్స్ పరిశ్రమలో సుస్థిరత, (ii) కెమికల్స్ & పెట్రోకెమికల్స్ పరిశ్రమలో నికర జీరో/ సుస్థిరతను సాధించే మార్గాలు, (iii) రసాయనాలు & పెట్రోకెమికల్స్ పరిశ్రమలో ఆర్&డి, సాంకేతికత మరియు డిజిటల్ పరివర్తనపై కాన్ఫరెన్స్ చర్చలు జరిగాయి. iv) స్థిరమైన పర్యావరణ వ్యవస్థ కోసం కలుపుకొని & అనుకూల నైపుణ్యాలు అనే అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగాయి. బీ20 దేశాలలో భారతదేశం మరియు విదేశాల నుండి పరిశ్రమ/ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సదస్సుకు 500 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. జర్మనీ, మెక్సికో, రష్యా, హంగరీ, అమెరికా, బెల్జియం, సింగపూర్, యూఏఈ, దక్షిణ కొరియా దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
********
(Release ID: 1927138)
Visitor Counter : 188