వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్ర‌జా సంక్షేమం, హితం కోసం తాజా ఆధునిక సాంకేతిక‌త‌ల పురోగ‌తుల‌ను ఉప‌యోగించుకోవాల‌న్న ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నేష‌న‌ల్ ఇ- విధాన్ అప్లికేష‌న్ (ఎన్ఇవిఎ) నిద‌ర్శ‌నంః శ్రీ పీయూష్ గోయ‌ల్


మ‌న ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సాధికార‌త‌ను ఇచ్చే ప్రాజెక్టు ఎన్ఇవిఎః శ్రీ గోయ‌ల్‌

విజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేందుకు, ఉత్త‌మ ఆచ‌ర‌ణ‌ల‌ను అందిపుచ్చుకునేందుకు ఎన్ఇవిఎ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా స‌మాచార ప్ర‌వాహానికి తోడ్ప‌డుతుందిః శ్రీ గోయ‌ల్‌

ఒక‌టే దేశం, ఒక‌టే ద‌ర‌ఖాస్తు అన్న ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించే ఏకీకృత‌, అంత‌ర్‌సంధానిత జాతీయ పోర్ట‌ల్ ఎన్ఇవిఎః శ్రీ గోయ‌ల్‌

Posted On: 24 MAY 2023 4:05PM by PIB Hyderabad

 పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం భార‌త దేశ అభివృద్ధి, భార‌త భ‌విష్య‌త్తుకు మూల స్తంభ‌మ‌ని, కేంద్ర వాణిజ్య & ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం& ప్ర‌జా పంపిణీ, జౌళి శాఖ‌ల మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్ పేర్కొన్నారు. ప్ర‌జా సంక్షేమం, హితం కోసం తాజా ఆధునిక సాంకేతిక‌త‌ల పురోగ‌తుల‌ను ఉప‌యోగించుకోవాల‌న్న ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు ఎన్ ఇ వి ఎ నిద‌ర్శ‌న‌మ‌ని, నేష‌న‌ల్ ఇ- విధాన్ అప్లికేష‌న్ (ఎన్ఇవిఎ)పై జాతీయ వ‌ర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ మంత్రి అన్నారు. 
దేశ‌వ్యాప్తంగా ఉన్న వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసి, సంస్థ‌ల‌లో పార‌ద‌ర్శిక‌త‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సాధికార‌త‌ను ఇచ్చే ప్రాజెక్టు ఎన్ఇవిఎ అని మంత్రి పేర్కొన్నారు. 
శాస‌న‌స‌భ్యుల‌కు త‌మ త‌మ‌ శాస‌న‌స‌భ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని, విజ్ఞానాన్ని అందించ‌డ‌మే కాక ఇత‌ర శాస‌న‌స‌భ‌లలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి కూడా స‌మాచారాన్ని ఎన్ఇవిఎ ఇస్తుంద‌ని శ్రీ గోయెల్ అన్నారు. ఎన్ఇవిఎ ద్వారా స‌మాచారం అటూ ఇటూ ప్ర‌వ‌హించ‌డం అన్న‌ది విజ్ఞానాన్ని పంచుకోవ‌డానికి, రాష్ట్రాల వ్యాప్తంగా ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించ‌డానికి దారి తీస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 
మ‌న భావిత‌రాల‌కు అభివృద్ధి చెందిన భార‌త‌దేశాన్ని సాధించేందుకు, ఈ అభివృద్ధి ప‌థంలో యువ‌త‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోడీ చేసిన పంచ్ ప్ర‌ణ్ ప్ర‌తిపాద‌న‌ను శ్రీ గోయ‌ల్ పున‌రుద్ఘాటించారు. దేశం కోసం డిజిట‌ల్ భ‌విష్య‌త్తును ప్ర‌ధాన మంత్రి ద‌ర్శించార‌ని, అంద‌రూ క‌లిసి క‌ర్త‌వ్య‌దీక్ష‌తో దాని దిశ‌గా ప‌ని చేసిన‌ప్పుడు ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌గల‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ క‌ర్త‌వ్య భావ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఎన్ఇవిఎ సృష్టించ‌డం జ‌రిగింద‌ని శ్రీ పీయూష్ గోయ‌ల్ పేర్కొన్నారు. 
వ‌న్ నేష‌న‌, వ‌న్ అప్లికేష‌న్ (ఒక‌టే దేశం, ఒక‌టే ద‌ర‌ఖాస్తు) ఎన్ఇవిఎ అన్న‌ది ఏకీకృత‌, ప‌ర‌స్ప‌రం అనుసంధానిత‌మైన‌ జాతీయ పోర్ట‌ల్  ఎన్ఇవిఎ అని మంత్రి అన్నారు. ఇది కేవ‌లం శాస‌న‌స‌భ్యుల‌కు మాత్ర‌మే కాక అందరికీ ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తుంద‌ని శ్రీ గోయ‌ల్ పేర్కొన్నారు. ఎన్ఇవిఎ అన్నది రాజ‌కీయ‌ల‌తో సంబంధం లేనిదే కాక రాజ‌కీయాల‌కు అతీత‌మైన‌ద‌ని ఆయ‌న అన్నారు. 
భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యాన్ని, శాస‌న‌భ‌ల‌, భార‌త పార్ల‌మెంటు ప‌నితీరును ఎన్ఇవిఎ నిజంగా విప్ల‌వాత్మ‌కంగా మారుస్తుంద‌ని మంత్రి అన్నారు. శాస‌నస‌భ కార్య‌క‌లాపాల కోసం కాగితాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల  చోటు చేసుకునే వ్య‌ర్ధ‌త‌ను, క‌ర్బ‌న పాద‌ముద్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎన్ఇవిఎ త‌గ్గిస్తుంద‌ని మంత‌రి తెలిపారు. దేశాభివృద్ధికి శాస‌న‌స‌భ్యులంద‌రూ స‌మిష్ఠిగా ప‌ని చేసేందుకు ఒక‌టే ఒక‌టే సాంకేతిక వెనుముక అన్న సూత్రాన్ని ఎన్ఇవిఎ ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని శ్రీ గోయ‌ల్ అన్నారు. 
ఎన్ఇవిఎను అత్యంత విజ‌య‌వంతం చేసేందుకు అంద‌రూ సామూహికంగా క‌లిసి ప‌ని చేయాల‌ని శ్రీ పీయూష్ గోయెల్ విజ్ఞ‌ప్తి చేశారు.
 స‌మ‌ర్ధ‌వంత‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐటి- స‌మాచార సాంకేతిక వ్య‌వ‌స్థ‌) ప‌ని తీరు ప్ర‌జ‌ల‌కు మ‌ర్ధ‌వంతంగా సేవ‌ల‌ను అందించేందుకు దారి తీస్తుంద‌ద‌ని, ఎన్ఇవిఎ మ‌రింత మెరుగ్గా సేవ‌ల‌ను అందించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. త‌న ఉప‌న్యాసంలో భాగంగా ఆయ‌న యుపిఐ, డిజిట‌ల్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌, స్టార్ట‌ప్ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, కోవిన్ యాప్‌, ఒక‌టే దేశం, ఒక‌టే రేష‌న్ కార్డ్‌, డిజిట‌ల్ వాణిజ్యానికి బ‌హిరంగ నెట్‌వ‌ర్క్‌, ప్ర‌భుత్వ ఇ- మార్కెట్ ప్ర‌దేశం, త‌దిత‌రాల ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ,  ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రుస్తున్న భార‌త‌దేశ‌పు సాంకేతిక‌త పురోగ‌తుల‌ను యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌శంసిస్తోంద‌ని  ఆయ‌న తెలిపారు. 
కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలు, బొగ్గు, గ‌నుల మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషిని కొనియాడుతూ, ఎన్ఇవిఎ ద్వారా ఆయ‌న మ‌నం తిర‌స్క‌రించ‌లేని ప్ర‌తిపాద‌న‌ను చేశార‌ని శ్రీ పీయూష్ గోయ‌ల్ అన్నారు. ఎన్ఇవిఎను అబివృద్ధి చేసిన బృందాన్ని, దానిని అంగీక‌రించి, ప్ర‌వేశించిన రాష్ట్రాల‌ను అభినందిస్తూ, మిగిలిన రాష్ట్రాలు కూడా ఎన్ఇవిఎలో ప్ర‌వేశించేందుకు శ్రీ గోయ‌ల్ ప్రోత్స‌హించారు. 

 

***



(Release ID: 1927065) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Marathi , Hindi