కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2022-23 ఆర్థిక సంవత్సరంలో నికరంగా 1.39 కోట్ల మంది సభ్యులను చేర్చుకున్న ఈపీఎఫ్‌వో
2023 మార్చి నెలలో నికరంగా 13.40 లక్షల మంది చేరిక
Posted On:
20 MAY 2023 5:01PM by PIB Hyderabad
2023 మార్చి నెలలో ఈపీఎఫ్‌వోలో నికరంగా 13.40 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈ నెల 20న విడుదల చేసిన ఈపీఎఫ్‌వో తాత్కాలిక ఉపాధి సమాచారం వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈపీఎఫ్‌వోలో 13.22% పెరుగుదలతో దాదాపు 1.39 కోట్ల మంది నికర సభ్యులు నమోదయ్యారు. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో సుమారు 1.22 కోట్ల నికర సభ్యులను ఈపీఎఫ్‌వో జోడించింది.
మార్చి నెలలో జోడించిన 13.40 లక్షల మంది సభ్యుల్లో దాదాపు 7.58 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. కొత్తగా చేరిన వారిలో 18-21 సంవత్సరాల వయస్సు గలవారు అత్యధికంగా 2.35 లక్షల మంది నమోదు అయ్యారు. 22-25 సంవత్సరాల వయస్సు గలవారు 1.94 లక్షల సంఖ్యతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ నెలలో నమోదైన మొత్తం కొత్త సభ్యుల్లో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 56.60%. దేశంలోని వ్యవస్థీకృత రంగ ఉద్యోగులుగా చేరినవాళ్లలో ఎక్కువ మంది తొలిసారి ఉద్యోగం సాధింనవాళ్లేనని ఉపాధి సమాచారం సూచిస్తోంది.
దాదాపు 10.09 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌వో సభ్యులుగా తిరిగి చేరారని కూడా ఆ సమాచారం వెల్లడిస్తోంది. ఈ సభ్యులు ఉద్యోగాలు మారి, ఈపీఎఫ్‌వో కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరారు. పూర్వ ఉద్యోగం భవిష్య నిధి మొత్తాన్ని వెనక్కు తీసుకోకుండా కొత్త ఉద్యోగానికి బదిలీని ఎంచుకున్నారు.
ఉపాధి సమాచారం లింగవారీ విశ్లేషణ ప్రకారం, 2023 మార్చిలో నికర మహిళ సభ్యుల సంఖ్య 2.57 లక్షలు. ఆ నెలలోని మొత్తం నికర సభ్యుల చేరికలో ఇది 19.21%. వీరిలో 1.91 లక్షల మంది మహిళలు కొత్తగా చేరారు. కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో ఇది 25.16%కు సమానం.
హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము&కశ్మీర్, మిజోరం రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుదను సూచించింది. నికర సభ్యుల చేరిక పరంగా మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హరియాణా, గుజరాత్. మొత్తం నికర సభ్యుల్లో ఈ రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లు 58.68%. అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే, 20.63% నికర సభ్యులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. 10.83%తో తమిళనాడు తర్వాతి స్థానంలో ఉంది.
పరిశ్రమల వారీగా సమాచారాన్ని విశ్లేషిస్తే, మార్చి నెలలో చేరిన మొత్తం సభ్యుల్లో 43.72% మంది 'నిపుణుల సేవలు' (కార్మికశక్తి సరఫరాదార్లు, సాధారణ గుత్తేదార్లు, భద్రత సేవలు, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) విభాగంలో ఉన్నారు. అత్యధికులు చేరిన రంగాలు వరుసగా 'నిపుణుల సేవలు', 'హోటళ్లు', 'వైద్య సాధకులు', 'జాతీయీకరించిన బ్యాంకులు కాకుండా ఇతర బ్యాంకులు'.
ఉద్యోగుల సమాచారాన్ని నవీకరించడం నిరంతర ప్రక్రియ కాబట్టి ఉపాధి సమాచారం ఎప్పుడూ తాత్కాలిక సమాచారంగానే ఉంటుంది. ప్రతి నెలా ఈ సమాచారం మారుతూ ఉంటుంది. 2017 సెప్టెంబర్ నుంచి ఉన్న ఉపాధి సమాచారాన్ని 2018 ఏప్రిల్ నెల నుంచి ఈపీఎఫ్‌వో చేస్తోంది. నెలవారీ సమాచారంలో, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా మొదటిసారి ఈపీఎఫ్‌వోలో చేరిన సభ్యులు, ఈపీఎఫ్‌వో నుంచి నిష్క్రమిచి తిరిగి సభ్యులుగా చేరినవాళ్ల సంఖ్యను నెలవారీ నికర ఉపాధి సమాచారంలోకి తీసుకుంటారు.
ఈపీఎఫ్‌వో మన దేశంలో ఒక ముఖ్యమైన సంస్థ. ఈపీఎఫ్ & ఎంపీ చట్టం, 1952 చట్టం పరిధిలోకి వచ్చే సంఘటిత/పాక్షిక వ్యవస్థీకృత రంగ శ్రామిక శక్తికి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించేందుకు బాధ్యత వహించే సంస్థ ఇది.
*****
(Release ID: 1926072)
Visitor Counter : 158