వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్చువల్‌ విధానంలో తేనె పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


రాజా భోజ్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియం, హనీ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 20 MAY 2023 6:35PM by PIB Hyderabad

 ప్రపంచ తేనెటీగ దినోత్సవాన్ని మధ్యప్రదేశ్‌లోని వారసోని బాలాఘాట్‌లోని రాజా భోజ్ వ్యవసాయ కళాశాలలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2023 మే 20న ఘనంగా నిర్వహించింది.  

కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ ఓబీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్, ఎన్ డిడిబి ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  “10,000 ఎస్ పి ఓ  పథకం” కింద తేనెటీగల పెంపకం దారుల సంక్షేమం, అభివృద్ధి కోసం వ్యవస్థీకృత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడని శ్రీ తోమర్ తెలిపారు. జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ కింద 100  పెంపకందారులు/తేనె ఉత్పత్తిదారుల ఎస్ పి ఓ లను ఎంపిక చేసి ట్రిఫెడ్ నాఫెడ్ పరిశీలనకు పంపామని శ్రీ తోమర్ తెలిపారు.80 పెంపకందారులు/తేనె ఉత్పత్తిదారుల ఎస్ పి ఓ లు రిజిస్టర్ అయ్యాయన్నారు. రైతుల ఆదాయం పెంచడానికి ఈ ప్రాంతంలో తేనె ఉత్పత్తి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. 

ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా, తేనెటీగల పెంపకంలో వివిధ రకాల తేనెటీగలు,  వివిధ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ  తేనెటీగల పెంపకందారులు, ప్రాసెసర్లు మరియు తేనెటీగల పెంపకం రంగంతో సంబంధం ఉన్న వర్గాలు 100 స్టాల్స్‌తో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా రైతులు, తేనెటీగల పెంపకం దారులు, ప్రాసెసర్లు, వ్యవస్థాపకులు, తేనె ఉత్పత్తి రంగంతో సంబంధం ఉన్న వర్గాలకు చెందిన ప్రతినిధులు కి హాజరయ్యారు.

వివిధ అంశాలపై మూడు సాంకేతిక సదస్సులతో ఒక  వర్క్ షాప్ నిర్వహించారు. ఆదాయం ఎక్కువ చేయడానికి  శాస్త్రీయ విధానంలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి పరిశోధన,అభివృద్ధి అంశాలకు ప్రోత్సాహం,జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మకాలు ఎక్కువ చేయడానికి అమలు చేయాల్సిన ప్రణాళిక, ఉత్పత్తి విధానాలు, శాస్త్రీయ తేనెటీగలపెంపకాన్ని ప్రోత్సహించడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం, వివిధ రంగాల భాగస్వామ్యం, ఉత్పత్తిలో ఎదురవుతున్న మరియు సవాళ్లు. తేనే ఉత్పత్తిలో పరిశ్రమలతో కలిసి పనిచేయడం,   మార్కెటింగ్ సవాళ్లు మరియు పరిష్కారాలు (జాతీయ/అంతర్జాతీయ).తదితర అంశాలపై చర్చలు జరిగాయి.

దేశంలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (NBHM) ను అమలు చేస్తోంది. ఆత్మ-నిర్భర్ భారత్ సాధన కోసం పథకం ఉపయోగపడుతుంది.  చిన్న, సన్న కారు రైతులు  శాస్త్రీయ విధానంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టేలా చూసేందుకు అవసరమైన సహాయ సహకారాలు మిషన్ ద్వారా అందిస్తున్నారు.జాతీయ బీ బోర్డు అమలు చేస్తున్న మిషన్  మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధికి సహకారం అందిస్తూ  "తీపి విప్లవం" లక్ష్యాన్ని సాధించడం కోసం అమలు జరుగుతోంది. 

కార్యక్రమంలో భాగంగా తేనె ఉత్పత్తిలో సాధించిన విజయాలు వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ రంగంలో గణనీయమైన కృషి చేసిన వారిని సన్మానించారు.  తేనెటీగల పెంపకం పై వివిధ తేనె ఉత్పత్తులు అంకుర సంస్థలు /రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రచురించిన  ప్రచురణలను ఆవిష్కరించారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా హనీ టెస్టింగ్ ల్యాబ్‌లను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించారు. కర్ణాటక లోని  బెంగళూరు, పూసా న్యూ ఢిల్లీ, మినీ హనీ టెస్టింగ్ ల్యాబ్ SKUAST కాశ్మీర్  కుప్వారా, మధ్యప్రదేశ్ లోని దామోహ్, గుజరాత్ లోని పాలన్‌పూర్, అరుణాచల్ ప్రదేశ్ లోని పాషిఘాట్, హర్యానాలోని సోనిపట్, తెలంగాణాలో హైదరాబాద్ లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

 ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ , ఉత్తరప్రదేశ్‌లో తేనెటీగ పెట్టె తయారీ యూనిట్లు- తేనె ఇతర బీహైవ్ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, ట్రేడింగ్, బ్రాండింగ్మార్కెటింగ్ యూనిట్లను కూడామంత్రి ప్రారంభించారు.

 విభిన్న వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు ఉన్న దేశంలో తేనెటీగల పెంపకం/తేనె ఉత్పత్తి కి అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయి.  2021-22- 3వ అంచనాల ప్రకారం భారతదేశంలో దాదాపు 1,33,200 మెట్రిక్ టన్నుల తేనెను ఉత్పత్తి అవుతోంది. 2020-21లో భారతదేశం నుంచి 1221 కోట్ల రూపాయల (యూఎస్  $ 164.835 మిలియన్లు) విలువ చేసే 74413 మెట్రిక్ టన్నుల T సహజ తేనె ఎగుమతి అయింది.  జాతీయ , అంతర్జాతీయ మార్కెట్‌లలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం, తేనెటీగ పుప్పొడి, బీస్ వాక్స్ , రాయల్ జెల్లీ, పుప్పొడి, తేనెటీగ విషం లాంటి ఇతర తేనెటీగ ఉత్పత్తుల ఉత్పత్తి ప్రోత్సహించడం, ఆధునిక శాస్త్రీయ విధానాల ద్వారా   తేనె ఉత్పత్తి చేయడం లాంటి చర్యల ద్వారా  తేనెటీగల పెంపకందారుల  ఆదాయాన్ని పెంచడానికి జాతీయ అంతర్జాతీయమార్కెట్‌లలో తేనె, తేనెటీగ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 

 ఆరోగ్య సంరక్షణ,ఇతర రంగాలలో నాణ్యమైన ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులను అందించడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తేనెటీగల పెంపకం శ్రమతో కూడుకున్న పని.  ప్రపంచంలోని 90% ఆహారాన్ని ఉత్పత్తి చేసే దాదాపు మూడు వంతుల మొక్కల పరాగసంపర్కంలో తేనెటీగలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.  ప్రభావవంతమైన పరాగసంపర్కం వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, నాణ్యతను మెరుగుపరుస్తుంది. భారతదేశంలో తేనెటీగల పెంపకం ఒక ముఖ్యమైన వ్యవసాయ-వ్యాపార కార్యకలాపంగా గుర్తింపు పొందింది. తేనెటీగల పెంపకం వల్ల  రైతుల ఆదాయం పెరగడమే కాకుండా దేశంలో  ఆహారం, పోషక భద్రతకు సహాయ పడే  వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. 

***


(Release ID: 1926064) Visitor Counter : 271


Read this release in: English , Urdu , Hindi