రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
భారతీయ ఫార్మా & భారతీయ వైద్య పరికరాలు అన్న అంశంపై మే 26-27, 2023న న్యూఢిల్లీలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్న ఫార్మస్యూటికల్స్ విభాగం
ఫార్మస్యూటికల్స్, వైద్యపరికరాల రంగంలో నాణ్యత కలిగిన వైద్య ఉత్పత్తుల ఉత్పాదక హబ్‌గా భారత్‌ను ప్రోత్సహించనున్న కార్యక్రమ 8వ ఎడిషన్
జాతీయ వైద్య పరికరాల విధానం, 2-23ను, వైద్య పరికరాల ఎగుమతి ప్రోత్సాహక మండలి, సామాన్య సౌకర్యాల కోసం వైద్య పరికరాల క్లస్టర్లకు తోడ్పాటు పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ప్రపంచ ఫార్మసీగా ప్రాచుర్యం పొందిన భారతీయ ఫార్మస్యూటికల్ రంగం రానున్న సంవత్సరాలలో దేశీయ అవసరాలకు, ప్రపంచ అవసరాలకు మరింతగా దోహదం చేస్తుందిః డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
20 MAY 2023 12:33PM by PIB Hyderabad
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఐసిసిఐ-ఫిక్కీ) సహకారంతో ఫార్మాస్యూటికల్స్ విభాగం న్యూఢిల్లీలో 26-27 మే 2023న భారత్ ఫార్మా & ఇండియన్ మెడికల్ డివైస్ 2023 అన్న అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు 8వ ఎడిషన్‌ను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రసాయనాలు &ఎరువుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కూడా పాల్గొంటారు. సమావేశంలో భాగంగా, జాతీయ వైద్య పరికరాల విధానం, 2023తో పాటు వైద్య పరికరాల ఎగుమతి ప్రోత్సాహక మండలిని డాక్టర్ మాండవీయ ప్రారంభిస్తారు. ప్రపంచపు ఫార్మా నగరంగా పిలవబడే భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం రాబోయే సంవత్సరాల్లో దేశీయ అవసరాలకు, ప్రపంచ అవసరాలకు మరింతగా దోహదపడుతుందని డాక్టర్ మాండవ్య విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉదయిస్తున్న రంగం 2030 నాటికి దాదాపు 50 బిలియన్ డాలర్ల కు పెరుగగల సంభావ్యత కలిగిన వైద్య పరికరాల రంగ ప్రాముఖ్యతను గ్రహించిన కేంద్ర మంత్రివర్గం ఇటీవలే పరిశ్రమలు, వాటాదారులతో విస్త్రత సంప్రదింపుల తర్వాత రూపొందించిన జాతీయ వైద్య పరికరాల విధానం, 2023కి ఆమోదం తెలిపింది.
వైద్య పరికరాల సమూహంలో సామాన్య మౌలిక సదుపాయ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదా బలోపేతం చేయడంతో పాటుగా వైద్య పరికరాల పరీక్ష కేంద్రాలను బలోపేతం లేదా ఏర్పాటు చేసే లక్ష్యంతో అసిస్టెన్స్ ఫర్ మెడికల్ డివైజెస్ క్లస్టర్స్ ఫర్ కామన్ ఫెసిలిటీస్ (ఎఎండి- సిఎఫ్ -వైద్య పరికరాల సమూహాలకు సామాన్య సౌకర్యాలకు తోడ్పాటు) అన్న నూతన పథకాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు.
వార్షికంగా జరిగే ఈ ప్రతిష్ఠాత్మక రెండు రోజుల సమావేశంలో 26 మే 2023ను సస్టైనబుల్ మెడ్ టెక్ 5.0ః స్కేలింగ్ అండ్ ఇన్నొవేటింగ్ ఇండియన్ మెడ్ టెక్ ( నిలకడైన వైద్య సాంకేతిక 5.0ః భారతీయ వైద్యసాంకేతిక వినూత్నత & పరిమాణం) అన్న ఇతివృత్తంపై భారత వైద్య పరికరాల రంగానికి అంకితం చేయగా, రెండవ రోజైన 27 మే 2023న ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీః డెలివరింగ్ వాల్యూ త్రూ ఇన్నొవేషన్ ( భారతీయ ఫార్మా పరిశ్రమః ఆవిష్కరణ ద్వారా విలువను అందించడం) అన్న ఇతివృత్తానికి అంకితం చేశారు.
దిగువన పేర్కొన్న కీలక కార్యకలాపాలు ఈ కార్యక్రమంలో చోటు చేసుకోనున్నాయిః
ప్రారంభ సెషన్ (26 మే, 2023)ః జాతీయ వైద్య పరికరాల విధానం, 2023, వైద్య పరికరాల క్లస్టర్లకు సామాన్య సౌకర్యాల కోసం తోడ్పాటు (ఎఎండి- సిఎఫ్), వైద్య పరికరాల ఎగుమతి ప్రోత్సహక మండలి అధికారిక ప్రారంభం, ఫార్మస్యూటికల్, వైద్య పరికరాల అధ్యయన నివేదికల విడుదల ప్రారంభ సెషన్ ప్రణాళికలో భాగం.
వైద్య పరికరాల రంగంపై సిఇఒల రౌండ్‌టేబుల్ &ఇతివృత్త సమావేశ సెషన్లు (26 మే, 2023)
ఫార్మస్యూటికల్స్ రంగంపై సిఇఒల రౌండ్‌టేబుల్ &ఇతివృత్త సమావేశ సెషన్లు (27 మే, 2023)
ఈ రెండురోజుల్లో ఫార్మస్యూటికల్, వైద్య పరికరాల పరిశ్రమల దాదాపు 100మంది సిఇఒలు వివిధ ఇతివృత్త సెషన్‌లో పాలుపంచుకుని, ఈ కార్యక్రమం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భాగస్వామ్యాన్ని తీసుకురానున్నారు. ఫార్మా, వైద్య పరికరాల రంగాల నుంచి దాదాపు 700మందికి పైగా ప్రతినిధులు ఈ రెండు రోజుల సమావేశానికి హాజరవుతారని అంచనా.
ప్రాక్టికల్ కమర్షియలైజేషన్ స్ట్రాటజీస్ ఫర్ మెడ్‌టెక్ః పైలెట్ స్కేల్ టు ప్రొడక్షన్ స్కేల్ (వైద్య సాంకేతికత కోసం ఆచరణాత్మక వాణిజ్యీకరణః ప్రయోగాత్మక స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి), ప్రొపెల్లింగ్ ది ఇన్నొవేషన్ అండ్ ఆర్&డి గ్రోత్ః ఎఫిషియంట్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ మెడ్‌టెక్ ( ఆవిష్కరణ, పరిశోధన అభివృద్ధి పెరుగుదలను ముందుకు తీసుకువెళ్ళడంః వైద్య సాంకేతికతలో సమర్ధవంతమైన నాణ్యత నిర్వహణ),మెడ్‌టెక్‌లో సామర్ధ్యాలు &నైపుణ్యాల నిర్మాణంః పరిశ్రమ -విద్య, సైద్ధాంతిక అనుసంధానం, భారత్ వృద్ధికి స్తంభంగా ఫార్మస్యూటికల్ పరిశ్రమ, వృద్ధి చోదక పునాదిగా నాణ్యత, ఫార్మస్యూటికల్ పరిశ్రమ విలువ లంకెను రూపుదిద్దేందుకు డిజిటల్ పరివర్తన, భారతీయ ఫార్మా భవిష్యత్తులోకి ముందుకు దూసుకుపోవడంః ప్రపంచ ఒకేరకమైన ఔషధాల అవకాశాన్ని పెట్టుబడిగా మార్చుకోవడం సహా పలు అంశాలపై అంతర్దృష్టిని కీలకోపన్యాసాలు, ప్యానెల్ చర్చలలో చూడవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ఫార్మ, వైద్య పరికరాల పరిశ్రమల కృషిని, పనితీరును గుర్తిస్తూ, పరిశ్రమ తమ పూర్తి సామర్ధ్యాన్ని సాధించేందుకు, సహజమైన, నిలకడైన వృద్ధిని సాధించేందుకు ఇటువంటి సమావేశాలు, చర్చలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా నీతీ ఆయోగ్, పరిశ్రమ, ఫార్మస్యూటికల్స్, ఆరోగ్యం, డిపిఐఐటి& ఉన్నత విద్య సభ్యులు, ఎన్‌పిపిఎ చైర్మన్, ఎంఇఐటివై, ఎంఒఇఎఫ్‌సిసి, బిఐఎస్, ఎఇఆర్‌బి, నేషనల్ బయో-ఫార్మా కమిషన్ ఉన్నతాధికారులు సహా పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఎన్ఐపిఇఆర్ మొహాలి, బిఐఆర్ఎసి, ఆరోగ్య సంరక్షణ రంగ స్కిల్ కౌన్సిల్ మరిన్ని సంబంధిత సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు.
***
(Release ID: 1925957)