బొగ్గు మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరియు రైల్వే అధికారులతో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా సమీక్షా సమావేశం
ఎస్ఈసీఎల్ ఛల్ రైల్ సైడింగ్‌ను ప్రారంభం మరియు రైలు ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష
వేగవంతమైన & పర్యావరణ అనుకూలమైన బొగ్గు రవాణాపై దృష్టి పెట్టండి: శ్రీ అమృత్ లాల్ మీనా
గెవ్రా బొగ్గు గని ఆసియాలో అతిపెద్దదిగా అభివృద్ధి చేయబడుతుంది; లక్ష్యం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తని వెల్లడి
Posted On:
20 MAY 2023 12:09PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా తన రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ రాయ్‌పూర్ నగరంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బిలాస్‌పూర్‌లోని ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈఆర్సీ) అధికారులతో ఈస్ట్ రైల్వే లిమిటెడ్ (సీఈఆర్ఎల్) మరియు ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ వెస్ట్ రైల్వే లిమిటెడ్ (సీఈడబ్ల్యుఆర్ఎల్) రైలు ప్రాజెక్టులను గురించి సమీక్షించారు. రాయగఢ్ ప్రాంతంలోని ఎస్ఈసీఎల్ లో ‘ఛల్’ రైల్ సైడింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో స్పెషల్ పర్పస్ వెహిక్ లీ (ఎస్పీవీ) మోడల్‌లో అభివృద్ధి చేస్తున్న రెండు రైల్ కారిడార్ల పురోగతిని కూడా సమీక్షించారు.రాయ్‌పూర్‌లోని మంత్రాలయ మహానంది భవన్‌లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ అమితాబ్ జైన్‌తో సమావేశం తరువాత శ్రీ అమృత్ లాల్ మీనా తన పర్యటనను ప్రారంభించారు. ఎస్ఈసీఎల్ యొక్క కొనసాగుతున్న మైనింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడానికి మరియు గనుల మరింత సమర్థవంతమైన నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడానికి ఈ సమావేశం జరిగింది. శ్రీ మీనాతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి. విస్మిత తేజ్ ఎస్ఈసీఎల్ సీఎండీ డా. ప్రేమ్ సాగర్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు, భూసేకరణ, పునరావాసం, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారంతో సహా ఎస్ఈసీఎల్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగాయి, ముఖ్యంగా ఎస్ఈసీఎల్ యొక్క మెగా ప్రాజెక్ట్‌లైన గెవ్రా, డిప్కా మరియు కుస్ముండాకు సంబంధించి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం, ఇతర వాటాదారులతో సమర్థవంతమైన సమన్వయంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని నొక్కి చెప్పారు. ఎస్ఈసీఎల్ యొక్క గెవ్రా మెగా ప్రాజెక్ట్ ఇటీవల 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిన దేశంలోనే మొదటి గనిగా నిలిచింది. ఇది ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడానికి విస్తరించబడుతోంది, ఇది ఆసియాలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే గనిగా మారనుంది. డైరెక్టర్ టెక్నికల్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ కె పాల్, డైరెక్టర్ టెక్నికల్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) శ్రీ ఎస్ ఎన్ కప్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ CMD డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా సమక్షంలో ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్) జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్‌తో బొగ్గు కార్యదర్శి సమావేశం నిర్వహించారు. కోర్బా మరియు మాండ్-రాయ్‌గఢ్ బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు తరలింపుపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. ఎస్ఈసీఎల్ యొక్క బొగ్గు పంపిణీ, రైల్వే రేకుల లభ్యత, ఎస్ఈసీఎల్ యొక్క రైలు ప్రాజెక్టులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు వివరంగా చర్చించబడ్డాయి. చర్చల సమయంలో ఎస్ఈసీఆర్ మరియు ఎస్ఈసీఎల్ యొక్క సీనియర్ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎస్ఈసీఎల్ సీఎండీ డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా సమక్షంలో ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్) జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్‌తో కూడా బొగ్గు కార్యదర్శి సమావేశం కూడా నిర్వహించారు.
కోర్బా మరియు మాండ్-రాయ్‌గఢ్ బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు తరలింపుపై సమావేశం దృష్టి సారించింది. ఎస్ఈసీఎల్ బొగ్గు పంపిణీ, రైల్వే ర్యాకుల లభ్యత, ఎస్ఈసీఎల్ యొక్క రైలు ప్రాజెక్టులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు సవివరంగా ఈ సమావేశంలో చర్చించబడ్డాయి. చర్చల సమయంలో ఎస్ఈసీఆర్ మరియు ఎస్ఈసీఎల్ సీనియర్ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
రెండో రోజు పర్యటనలో..
ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా రెండో రోజు బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ మీనా ఛల్ సైడింగ్‌ను, రైలు ర్యాకులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీఎల్, సీఎండీ డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా మరియు సంస్థ ఫంక్షనల్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి గతి శక్తి యోజన కింద దేశంలో బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయంలో కొత్త రైలు కారిడార్ ఒక మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. దేశం యొక్క ఇంధన అవసరాలను తీర్చడంలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించాలని శ్రీ మీనా స్థానిక పరిపాలన మరియు నివాసితులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ రైల్వే లిమిటెడ్ (సీఈఆర్ఎల్) ఫేజ్ 1 ప్రాజెక్ట్ కింద ఛల్ సైడింగ్ నిర్మించబడింది మరియు రాయ్‌ఘర్ ప్రాంతంలోని ఛల్ గనిని నేరుగా రైలు మార్గానికి కలుపుతుంది మరియు రైలు ద్వారా బొగ్గు పంపడం ఇక్కడ నుండి నేరుగా జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ రైల్వే లిమిటెడ్ (సీఈఆర్ఎల్) ఫేజ్ 1 ప్రాజెక్ట్, రూ. 3000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించబడుతోంది, మాండ్-రాయ్‌గఢ్ బొగ్గు క్షేత్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానించడం లక్ష్యంగా ఇది సాగుతోంది. ఈ 124 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట్ కింద, ఖర్సియా నుండి ధరమ్‌జయ్‌గర్ వరకు 74 కిలోమీటర్ల పొడవైన మెయిల్ లైన్ ఇప్పటికే ప్రారంభించబడింది. ఇది ఘర్ఘోడా నుండి పెల్మా వరకు స్పర్ లైన్లు మరియు ఛల్, బరోద్ మరియు దుర్గాపూర్ నుండి ఫీడర్ లైన్లను కలిగి ఉంది. బొగ్గు నిల్వల పరంగా, కోర్బా కోల్‌ఫీల్డ్‌లను మాండ్-రాయ్‌ఘర్ బొగ్గు క్షేత్రాలు అనుసరిస్తాయి. బొగ్గు ఉత్పత్తి విస్తరిస్తున్నందున, రాబోయే కాలంలో మరింత ఎక్కువ బొగ్గును పంపడంలో ఈ రైలు ప్రాజెక్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎస్ఈసీఎల్ యొక్క కోర్బా కోల్‌ఫీల్డ్స్‌లో ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ వెస్ట్ రైల్వే లిమిటెడ్ (సీఈడబ్ల్యుఆర్ఎల్) ప్రాజెక్ట్ కింద గేవ్రా రోడ్ నుండి పెండ్రా రోడ్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌ను బొగ్గు కార్యదర్శి తన పర్యటనలో రెండు రోజున పరిశీలించారు. ఆయన ఎస్ఈసీఎల్ సీఎండీ డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా మరియు ఎస్ఈసీఎల్ ఫంక్షనల్ డైరెక్టర్లతో కలిసి ఉర్గా కుస్ముండా కనెక్టివిటీ లైన్ యొక్క బ్రిడ్జి నెం. 3ను పరిశీలించారు. కోర్బా కోల్‌ఫీల్డ్‌లో పనిచేస్తున్న SECL యొక్క మెగా ప్రాజెక్ట్‌ల నుండి బొగ్గు రవాణాలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్ట్ 191 కి.మీ పొడవు, ఇందులో 135.3 కి.మీ మెయిన్ లైన్ పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో గేవరా రోడ్, సురకాచర్, డిప్కా, కత్ఘోరా రోడ్, బిఝారా, పుటువా, మతీన్, సెందూర్‌ఘర్, పుట్టిపఖానా, భాడి, ధంగవాన్ మరియు పెండ్రా రోడ్ స్టేషన్‌లు ఉన్నాయి. మొత్తం కారిడార్‌లో రైల్వే లైన్‌తో పాటు ఈ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తారు. సీఈడబ్ల్యుఆర్ఎల్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.4970 కోట్లు. ప్రధాన లైను కోసం భూసేకరణ మరియు అటవీ క్లియరెన్స్ పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
*****
(Release ID: 1925954)
Visitor Counter : 157