సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
రేపు నర్మదాలోని కెవాడియాలో మూడు రోజుల 'చింతన్ శిబిర్' ముగింపు సమావేశంలో రాష్ట్ర మొట్టమొదటి "డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్"ను విడుదల చేయనున్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్
వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తరువాత తయారు అయిన డిజిజిఐ జిల్లా స్థాయిలో బెంచ్ మార్క్ గవర్నెన్స్ లో తదుపరి తరం పరిపాలనా సంస్కరణకు ప్రాతినిధ్యం వహిస్తుంది
భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలలో డిజిజిఐ గుజరాత్ మొదటిది; గుజరాత్ లోని మొత్తం 33 జిల్లాలలో పది రంగాల కింద 65 ఇండికేటర్ లపై పాలనను బెంచ్ మార్క్ చేయనున్న ఇండెక్స్
ప్రస్తుతం ఉన్న అంతరాలను పరిష్కరించడానికి జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడానికి, ఈ అంతరాలను పూడ్చడానికి, ప్రణాళికను రూపొందించడానికి , నిర్ణయం తీసుకునే సాధనంగా సహాయపడటానికి దోహదపడనున్న ర్యాంకింగ్స్
Posted On:
20 MAY 2023 1:22PM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్ర మొట్టమొదటి "డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్"ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ 2023 మే 21 న గుజరాత్ లోని నర్మదా జిల్లా కెవాడియ లో
జరిగే గుజరాత్ సీనియర్, జూనియర్ ప్రభుత్వ అధికారుల మేధోమథన సెషన్ మూడు రోజుల '10వ చింతన్ శివిర్ ' ముగింపు సమావేశంలో విడుదల చేస్తారు. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు , ప్రజా ఫిర్యాదుల విభాగం (డి ఎ ఆర్ పి జి), గుజరాత్ ప్రభుత్వ సహకారంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్ నాలెడ్జ్ పార్టనర్ గా ఈ ‘‘ఇండెక్స్"ను రూపొందించాయి.
జిజిఐ 2021 లో జిజిఐ 2019 కంటే 12.3% పెరుగుదలతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. డిజిజిఐ గుజరాత్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ లోతైన అధ్యయనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది గుజరాత్ విజయగాథలను డాక్యుమెంట్ చేస్తుంది, దీనిని దేశంలోని ఇతర జిల్లాలు స్వీకరించగలవు.
2019-2023 సంవత్సరాలలో, గుజరాత్ జిల్లాలు , రాష్ట్ర సంస్థలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్సలెన్స్ కోసం నాలుగుప్రధాన మంత్రి పురస్కారాలను అందుకున్నాయి. (i) స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)-2020 కోసం మహేసన; (ii) ఇన్నోవేషన్ స్టేట్ కేటగిరీ కింద విద్యాశాఖకు చెందిన విద్యా సమిక్ష కేంద్రం - 2021; (iii) ఇన్నోవేషన్ స్టేట్ కేటగిరీ కింద స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ఆర్గనైజేషన్ (ఎస్ఓటీఓ)- (iv) సమగ్ర శిక్ష -2022 సంవత్సరానికి గాను మహేసన, నాలుగు జాతీయ ఈ-గోవ్ అవార్డులు అందుకున్నాయి.
గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ డిజిజిఐ గుజరాత్ రూపకల్పనకు మార్గనిర్దేశం చేశారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్, డి ఎ ఆర్ పి జి కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ , డి.ఎ.ఆర్.పి.జి సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్.బి.ఎస్.రాజ్ పుత్ లతో కలిసి గుజరాత్‌లోని పాలనా నమూనా వైవిధ్యాన్ని కొలిచే సూచిక భావనను, సూత్రీకరణను ప్రారంభించడానికి కలిసి పనిచేశారు. భాగస్వాముల సంప్రదింపులకు భారత ప్రభుత్వ స్థాయిలో 12 రౌండ్ల సమావేశాలు అవసరమయ్యాయి, వీటిలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి ఎఆర్ తదితరులతో సమావేశాలు ఉన్నాయి, వీటిని హైదరాబాద్ సిజిజి సమన్వయం చేసింది.
జిల్లా స్థాయిలో బెంచ్ మార్కింగ్ గవర్నెన్స్ లో తదుపరి జనరేషన్ అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణకు డీజీజీఐ ప్రాతినిధ్యం వహిస్తుంది. గుజరాత్ లోని మొత్తం 33 జిల్లాల్లోని 10 రంగాల్లోని 65 సూచికల కింద 126 డేటా పాయింట్లపై ఈ సూచీ పాలనను బెంచ్ మార్క్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చర్యల వల్ల పాలనా స్థితిగతులు, ప్రభావాన్ని అంచనా వేయడానికి గుజరాత్ జిల్లాల అంతటా ఇది ఒక ఏకరీతి సాధనం. ఇప్పటికే ఉన్న అంతరాలను పరిష్కరించడానికి, ఈ అంతరాలను పూడ్చే ప్రణాళిక రూపొందించడానికి, నిర్ణయం తీసుకునే సాధనంగా సహాయపడటానికి ఇది రాష్ట్ర , జిల్లా యంత్రాంగానికి మార్గదర్శకత్వం ఇస్తుందని భావిస్తున్నారు. పౌర కేంద్రీకృత పరిపాలన, పాలనను అందించాలనే తపనలో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఈ ర్యాంకులు తీసుకువస్తాయి.
డిజిజిఐ గుజరాత్ -కొన్ని ముఖ్యాంశాలు:
వరస నెం.
|
రంగాలు
మొత్తంగా
డి జి జి ఐ ర్యాంక్
|
టాప్ రాంకింగ్ జిల్లాలు
1
నావ్ సారి
|
2
రాజ్ కోట్
|
3
అహమ్మదాబాద్
|
1.
|
వ్యవసాయం - అనుబంధ
|
పోర్ బందర్
|
జునాగఢ్
|
దేవభూమి ద్వారకా
|
2.
|
వాణిజ్యం - పరిశ్రమ
|
పంచమహల్
|
భరూచ్
|
వడోదర
|
3.
|
మానవ వనరుల అభివృద్ధి
|
బోటడ్
|
పంచమహల్
|
భావ్ నగర్
|
4.
|
ప్రజారోగ్యం
|
అహ్మదాబాద్
|
దహోడ్
|
మహిసాగర్
|
5.
|
పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - యుటిలిటీస్
|
సూరత్
|
అహ్మదాబాద్
|
వల్సాడ్
|
6.
|
సాంఘిక సంక్షేమం - అభివృద్ధి
|
భరూచ్
|
అహ్మదాబాద్
|
నవ సారి
|
7.
|
ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ - ఎంపవర్ మెంట్
|
దహొడ్
|
నర్మద
|
వడోదర
|
8.
|
న్యాయవ్యవస్థ - ప్రజా భద్రత
|
మోర్బి
|
దేవభూమి ద్వారకా
|
గాంధీనగర్
|
9.
10.
|
పర్యావరణం
సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్
|
భావ్ నగర్
జునాగఢ్
|
బోటడ్
ఖేడా
|
రాజ్ కోట్
బోటడ్
|
*మొత్తం 33 జిల్లాలు పాల ఉత్పత్తిలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. 2/3 వంతు కంటే ఎక్కువ జిల్లాలు ఆహార ధాన్యాలు . ఉద్యాన ఉత్పత్తిలో సానుకూల వృద్ధిని నివేదించాయి.
*అన్ని జిల్లాల్లో 100 శాతానికి పైగా పంట విస్తృతి నమోదైంది.
*డిస్ట్రిక్ట్ లెవల్ ఫెసిలిటేషన్ కమిటీ (డీఎల్ ఎఫ్ సీ) ఇండెక్స్ లో 22 జిల్లాలు 90కి పైగా కాంపోజిట్ స్కోర్ ను నమోదు చేశాయి.
*29 జిల్లాలు పారిశ్రామికోత్పత్తిలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
*రాష్ట్రం లోని అహ్మదాబాద్, వడోదర, సూరత్ జిల్లాలు స్టార్టప్ ల సంఖ్యలో ముందంజలో ఉన్నాయి.
*నవ్సారి జిల్లాలో అప్పర్ ప్రైమరీ నుండి సెకండరీకి అత్యధిక మార్పు రేటు నమోదైంది.
*రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఐటీఐల్లో 90 శాతానికి పైగా శిక్షణ పొందినట్లు నివేదించాయి.
*మొత్తం 25 జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 60 శాతానికి పైగా ప్లేస్ మెంట్ నిష్పత్తి నమోదైంది.
*27 జిల్లాల్లో 80 శాతానికి పైగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు పనిచేస్తున్నాయి.
*31 జిల్లాల్లో 85% కంటే ఎక్కువ సంస్థాగత ప్రసవాలు నమోదయ్యాయి.
*అహ్మదాబాద్ జిల్లాలో యుఎల్ బిలు జిపిల స్వంత వనరుల నుండి అత్యధిక తలసరి ఆదాయం నమోదైంది.
*పీఎంఏవై గ్రామీణ, పట్టణ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంలో గాంధీనగర్, సూరత్, భరూచ్ జిల్లాలు అత్యధిక శాతం నమోదు చేశాయి.
*మొత్తం 33 జిల్లాల్లో ఆధార్ అనుసంధానిత రేషన్ కార్డుల శాతం 99 శాతానికి పైగా నమోదైంది.
*25 జిల్లాల్లో 95 శాతానికి పైగా విద్యార్థుల మధ్యాహ్న భోజనం శాతం నమోదైంది.
*29 జిల్లాల్లో 85 శాతానికి పైగా నీటి నమూనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నివేదించారు.
*బనస్కాంత, సబర్ కాంత, జామ్ నగర్ జిల్లాల్లో ఐపీసీ నేరాల్లో చార్జిషీట్లు దాఖలు చేయడానికి అతి తక్కువ రోజులు పట్టింది.
*మొత్తం తొమ్మిది జిల్లాల్లో 100 శాతం ఫిర్యాదుల పరిష్కారం స్వాగత్ పోర్టల్ లో నమోదైంది.
''ప్రజా కేంద్రీకృత పాలన ఉన్నప్పుడు, అభివృద్ధి ఆధారిత పాలన ఉన్నప్పుడు, అది సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మెరుగైన ఫలితాలను ఇస్తుంది. సుపరిపాలనలో ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటుంది. ఒకే రాష్ట్రంలో ఒక జిల్లా బాగా పనిచేస్తే, మరో జిల్లా బాగా పనిచేయకపోతే, దీనికి అసలు కారణం సుపరిపాలనలో తేడా‘‘
అని ప్రధాన మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2019, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021, ఎన్ఈఎస్ డి ఎ 2019, ఎన్ఈఎస్ డి ఎ 2021, డిజిజిఐ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు డిజిజిఐ గుజరాత్ లను విడుదల చేయడం ద్వారా బెంచ్ మార్కింగ్ పాలనలో తదుపరి తరం సంస్కరణలను డి ఎ ఆర్ పి జి విజయవంతంగా ప్రారంభించింది.
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన సందేశంలో "మొట్టమొదటి డిజిజిఐ గుజరాత్ ప్రచురణ ఒక మైలురాయి విజయం. జిల్లా అనేది పరిపాలనా వ్యవస్థ మూల కేంద్రం కావడం చేత పౌరులు, పరిపాలన మధ్య అనుసంధానానికి కీలకమైన అంశం. అవి అభివృద్ధికి, సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి, పౌరుల సమగ్ర శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అందువల్ల, అభివృద్ధిని ధృవీకరించడానికి , జిల్లాల మధ్య పోటీ స్ఫూర్తిని తీసుకురావడానికి , వాటి పనితీరును కొలవాలి. గుజరాత్ లోని 33 జిల్లాలు దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా జిల్లాల స్థాయికి ఎదగడానికి డిజిజిఐ దోహదపడుతుంది" అని అన్నారు.
ఈ సందర్భంగా డి ఎ ఆర్ పి జి ఈ డాక్యుమెంట్ ను రూపొందించి దేశ పాలనా నమూనా 'గరిష్ట పాలన - కనీస ప్రభుత్వం'ను ముందుకు తీసుకు వెడుతున్న ప్రతి అధికారికి కృతజ్ఞతలు తెలిపింది.
<><><><>
(Release ID: 1925952)
Visitor Counter : 204