సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మాల్దీవులు మరియు బంగ్లాదేశ్‌లోని 95 మంది సివిల్‌ సర్వెంట్లకు 2 వారాల సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి)


పౌర సేవకులు తమ దేశాల్లో అభివృద్ధికి మార్గాన్ని రూపొందించాలని తన ప్రసంగంలో కోరిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్

'వసుధైవ కుటుంబం' ద్వారా నడిచే మన సమిష్టి నిబద్ధత సమ్మిళిత అభివృద్ధిలో ఉందని తెలిపిన ఎన్‌సిజిజి డీజీ శ్రీ భరత్ లాల్

సివిల్ సర్వెంట్ల పరిపూర్ణత మరియు అంకితభావంతో ప్రజలకు సేవ చేయడం వల్ల జీవన నాణ్యతలో మార్పు వస్తుందని చెప్పిన భరత్ లాల్

21వ శతాబ్దాన్ని ‘ఆసియా శతాబ్దం’గా మార్చేందుకు దక్షిణాసియాలోని పౌర సేవకులు సివిల్ సర్వెంట్లు ఏక దృష్టితో పని చేయాలి

Posted On: 20 MAY 2023 1:18PM by PIB Hyderabad

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మాల్దీవులు మరియు బంగ్లాదేశ్‌లోని మూడు బ్యాచ్‌ల సివిల్ సర్వెంట్ల కోసం 2-వారాల సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని 19 మే, 2022న న్యూఢిల్లీలో ముగించింది.
 

image.png

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 'వసుధైవ కుటుంబం' మరియు 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానానికి అనుగుణంగా నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా పొరుగు దేశాల నుండి పౌర సేవకుల మధ్య జ్ఞాన మార్పిడి మరియు సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది.ఎన్‌సిజిజి కార్యక్రమాల్లో పౌర కేంద్రీకృత విధానాలను ప్రోత్సహించడం, సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడం మరియు  నాణ్యతను మెరుగుపరచడం. పౌరుల జీవితానికి భరోసాను అందించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. బంగ్లాదేశ్, మాల్దీవులు మరియు భారతదేశం మధ్య భాగస్వామ్య చరిత్ర, సంస్కృతి మరియు విలువలను ఆయన హైలైట్ చేశారు. భాగస్వామ్య సరిహద్దులు మరియు తీరాల కారణంగా వారి పరస్పర అనుసంధానాన్ని నొక్కి చెప్పాడు. డాక్టర్ వి.కె. పాల్ 2047కు సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టిని నొక్కిచెప్పారు. ఇది సంపన్నమైన, అందరినీ కలుపుకొని మరియు స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడం చుట్టూ తిరుగుతుంది. 2047లో ప్రధాని మోదీ విజన్ సూత్రాలు మరియు లక్ష్యాలను స్వీకరించడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి, అధిక ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, పట్టణీకరణ నిర్వహణ, పర్యావరణ సుస్థిరత మరియు ప్రపంచ సహకారం కోసం ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా మార్గాలను రూపొందించాలని ఆయన పౌర సేవకులను కోరారు. విజన్@2047 దీర్ఘకాలిక పురోగతిని సాధించడానికి రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది మరియు దేశాలు తమ పౌరులకు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నించేలా ప్రేరేపించగలదని ఆయన అన్నారు. ఈ లక్ష్యాల కోసం చురుకుగా పని చేయడం ద్వారా, పౌర సేవకులు కూడా విస్తృత ప్రపంచ దృష్టికి దోహదం చేయగలరని మరియు అందరికీ మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడతారని ఆయన పేర్కొన్నారు.

 

image.png


జీ20 ఫ్రేమ్‌వర్క్‌లో 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే భావనగా రూపుదిద్దుకున్న 'వసుధైవ కుటుంబం' తత్వాన్ని ఆయన పంచుకున్నారు. సమ్మిళిత అభివృద్ధికి పేదరికం, అసమానత, వాతావరణ మార్పు మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి సాధారణ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం అవసరమని చెప్పారు. వసుధైవ కుటుంబకం సూత్రాలను అవలంబించడం ద్వారా ఈ సవాళ్లకు వినూత్నమైన మరియు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడానికి దేశాలు తమ ప్రయత్నాలు, వనరులు మరియు నైపుణ్యాన్ని ఏకం చేయగలవని ఆయన అన్నారు. ఈ సహకార విధానం ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యం, జ్ఞాన మార్పిడి మరియు సామూహిక సమస్య-పరిష్కారాన్ని అనుమతిస్తుంది. చివరికి మరింత ప్రభావవంతమైన మరియు సమగ్ర అభివృద్ధి ఫలితాలకు దారి తీస్తుంది. మహాత్మా గాంధీ అందించిన శక్తివంతమైన కోట్‌ను కూడా ఆయన పంచుకున్నాడు. ఇది పౌర సేవకులకు అంతిమ మంత్రంగా పనిచేస్తుంది - 'నేను టాలిస్మాన్ ఇస్తాను. మీకు అనుమానం వచ్చినప్పుడల్లా లేదా మీతో స్వయం విపరీతంగా మారినప్పుడు ఈ క్రింది పరీక్షను అనుసరించండి. మీరు చూసిన అత్యంత పేద మరియు బలహీనమైన వ్యక్తి లేదా స్త్రీ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఆలోచించిన అడుగు అతనికి లేదా
ఆమెకు ఏదైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దాని ద్వారా అతడు/ఆమె ఏమైనా పొందుతాడా? అతని/ ఆమె స్వంత జీవితం మరియు విధిపై నియంత్రణ సాధించడానికి ఇది అతనిని/ఆమెను పునరుద్ధరిస్తుందా? మరో మాటలో చెప్పాలంటే ఆకలితో ఉన్న మరియు ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్న లక్షలాది మందికి స్వరాజ్యం దారి తీస్తుంది.' అని చెప్పారు.

డా. పాల్ యొక్క ప్రశంసా ప్రసంగం తీవ్ర ప్రభావాన్ని మిగిల్చింది, సివిల్ సర్వెంట్లు కరుణ మరియు అంకితభావంతో పని చేయాలని కోరారు. వారు అందరికీ మంచి భవిష్యత్తును సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అత్యంత బలహీనుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోమని చెప్పారు.

 

image.png


ఎన్‌సిజిజి డైరెక్టర్ జనరల్ శ్రీ భరత్ లాల్ తన ముఖ్య ప్రసంగంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి వారి లక్ష్యాలను కొనసాగించడంలో పౌర సేవకుల పాత్రను హైలైట్ చేశారు. సివిల్ సర్వెంట్లు తమ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను ఉపయోగించుకుని సానుకూల మార్పును మరియు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి వీలు కల్పించేలా వ్యవహరించాలని ఆయన నొక్కి చెప్పారు. తమ సంస్థలలో అంతర్గతంగానూ, ప్రజలకు సేవ చేస్తూ బాహ్యంగానూ శ్రేష్ఠత కోసం కృషి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఖచ్చితత్వంతో పని చేయడం ద్వారా పరిపూర్ణతను వెంబడించడం మరియు వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలలో అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా, పౌర సేవకులు సమగ్ర అభివృద్ధికి దోహదపడతారని ఆయన అన్నారు.

కరువుకు గురయ్యే ప్రాంతంలో స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడం వంటి పౌర కేంద్రీకృత విధానాలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని ఆయన అన్నారు. 1999-2000లో జిఎస్‌డిపి వృద్ధి రేటు కేవలం 1.09% మరియు 2000-2001లో మైనస్ (-) 4.89% మాత్రమే ఉన్న గుజరాత్ ఉదాహరణను తీసుకుంటే తర్వాతి రెండు దశాబ్దాల్లో రెండంకెల వృద్ధిని సాధించింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాలు మరియు సివిల్ సర్వెంట్ల అవిశ్రాంత కృషి వల్ల ఇది సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే అచంచలమైన నిబద్ధత మరియు దానిని జీవితంలో ఒక లక్ష్యం చేసుకోవడం సమాజంలో పరివర్తనకు ఉపకరిస్తుంది. మరియు, అటువంటి మార్గాలను అనుసరించడం ద్వారా గొప్ప సమాజాలను తయారు చేయవచ్చని తెలిపారు.

 

image.png


ఈ శతాబ్దాన్ని ‘ఆసియా శతాబ్దం’గా మార్చేందుకు సర్వతోముఖాభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, అందరికీ శ్రేయస్సును తీసుకురావడానికి మరియు పేదరికం  తొలగించడానికి మనం కృషి చేయాలి. వివిధ డొమైన్‌లలో నాయకత్వం వహించడానికి, అభివృద్ధి మరియు వాతావరణ అజెండాలను రూపొందించడానికి, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి మరియు మానవాళి యొక్క పురోగతి మరియు అభివృద్ధికి దోహదపడటానికి ప్రత్యేకమైన అవకాశాలను అందిస్తుంది. మన దేశాలలో ఇలాంటి పురోగతి మరియు అభివృద్ధిని సాధించడానికి మరియు ప్రపంచ వ్యవహారాల భవిష్యత్తు పథాన్ని రూపొందించడానికి కృషి చేయడం మన సమిష్టి బాధ్యత అని ఆయన ఉద్బోధించారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) భాగస్వామ్యంతో ఎన్‌సిజిజి అభివృద్ధి చెందుతున్న దేశాల పౌర సేవకుల సామర్థ్యాలను పెంపొందించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటివరకు, మాల్దీవుల సివిల్ సర్వీస్‌కు చెందిన 685 మంది అధికారులు & బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ నుండి 2100 మంది అధికారులు ఇక్కడ శిక్షణ పొందారు. ఇది 15 దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణ కూడా ఇచ్చింది. వాటిలో బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్, నేపాల్ మరియు కంబోడియా వంటి దేశాలున్నాయి. ఈ శిక్షణల్లో పాల్గొన్న వివిధ దేశాల అధికారులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎన్‌సిజిజి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడంలో పాలుపంచుకుంది. డిమాండ్ పెరుగుతున్నందున మరిన్ని దేశాల నుండి అధిక సంఖ్యలో పౌర సేవకులకు వసతి కల్పించడానికి ఎంఈఏ మద్దతుతో ఎన్‌సిజిజి తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తద్వారా ఎన్‌సిజిజి 7 రెట్లు పెరుగుదలను ప్రభావితం చేసింది. అంటే 2021-22లో 236 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడం నుండి 2023-24లో 2,200 కంటే ఎక్కువ మంది ఈ అత్యంత డిమాండ్ ఉన్న కార్యక్రమాలలో ఉన్నారు.

ఎన్‌సిజిజి ఈ కార్యక్రమంలో దేశంలో చేపట్టిన పాలన యొక్క నమూనాను మార్చడం, గంగా నదికి ప్రత్యేక సూచనలతో నదుల పునరుజ్జీవనం, డిజిటల్ టెక్నాలజీని పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, భారతదేశంలో భూ పరిపాలన, రాజ్యాంగ పునాది భారతదేశంలో విధాన రూపకల్పన మరియు వికేంద్రీకరణ, పబ్లిక్ కాంట్రాక్ట్‌లు మరియు విధానాలు, పబ్లిక్ పాలసీ & అమలు, ఎన్నికల నిర్వహణ, ఆధార్: సుపరిపాలన సాధనం, డిజిటల్ గవర్నెన్స్: పాస్‌పోర్ట్ సేవా & మడాడ్  కేస్ స్టడీస్, ఇ-గవర్నెన్స్ మరియు డిజిటల్ ఇండియా ఉమాంగ్, విపత్తు నిర్వహణతో తీరప్రాంతానికి ప్రత్యేక సూచన, పరిపాలనలో నీతి, ప్రాజెక్ట్ ప్రణాళిక, అమలు మరియు పర్యవేక్షణ – జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకం: గ్రామీణ భారతదేశానికి ఆస్తి ధ్రువీకరణ, విజిలెన్స్ పరిపాలన, అవినీతి నిరోధక వ్యూహాలు వంటి వివిధ కార్యక్రమాలను పంచుకుంది:

కార్యక్రమంలో పాల్గొన్నవారిని భారత పార్లమెంటు, ప్రధాన మంత్రి సంగ్రహాలయ మరియు పరిపాలనను చూడటానికి కొన్ని నగరాలకు ఎక్స్‌పోజర్ సందర్శనలకు కూడా తీసుకెళ్లారు. కోర్స్ కోఆర్డినేటర్ (బంగ్లాదేశ్) డాక్టర్ ఎ. పి. సింగ్ మరియు డాక్టర్ సంజీవ్ శర్మ కోర్సు కోఆర్డినేటర్ (మాల్దీవులు) మరియు  కో-కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ బి. ఎస్. బిష్త్ ఈ కోర్సులను నిర్వహించారు. ఎన్‌సిజిజికు చెందిమ మొత్తం సిబిపి బృందం కార్యక్రమాలు సజావుగా సాగేలా చూసింది.

 

image.png

 

  <><><><><>



(Release ID: 1925946) Visitor Counter : 236


Read this release in: English , Urdu , Hindi , Tamil