ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎల్ఆర్ఎస్ కింద డెబిట్ / క్రెడిట్ కార్డు లావాదేవీలపై మూలస్థానంలో పన్ను వసూలుకు సంబంధించిన నిబంధనపై వివరణ
Posted On:
19 MAY 2023 7:11PM by PIB Hyderabad
సరళీకరించిన రెమిటెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 2023 జూలై ఒకటో తేదీ నుంచి చిన్న లావాదేవీలపై మూలస్థానంలో పన్ను వసూళ్లకు (టిసిఎస్) సంబంధించి అమలులోకి రానున్న నిబంధనలపై ఆవేదనలు చెలరేగాయి. పన్ను వసూళ్లలో విధానపరమైన గందరగోళాన్ని నివారించేందుకు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులపై ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత వినియోగదారులు రూ.7 లక్షల వరకు చేసే చెల్లింపులను టిసిఎస్ నుంచి మినహాయింపు ఇచ్చారని, వాటిపై ఎలాంటి టిసిఎస్ వర్తించదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
అలాగే టిసిఎస్ విషయంలో విద్య, ఆరోగ్యపరమైన చెల్లింపులకు సంబంధించిన ప్రస్తుత ప్రయోజనాలు యథాప్రకారం కొనసాగుతాయి.
ఇందుకు సంబంధించిన నిబంధనల్లో (విదేశీ మారక నిర్వహణ (కరెంట్ ఖాతా లావాదేవీ నిబంధనలు), 2000) అవసరమైన మార్పులను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్టు తెలిపింది.
-----
(Release ID: 1925824)
Visitor Counter : 231