వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జెమ్ వ్యవస్థాపక దినోత్సవం
Posted On:
18 MAY 2023 7:03PM by PIB Hyderabad
భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో వస్తువులు, సేవలను సేకరించడానికి క్రమపద్దతిలో పనిచేసే ప్రజా సేకరణ వ్యవస్థ అవసరమని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) సభ్యుడు శ్రీ బినోయ్ కుమార్ అన్నారు.సమర్థవంతమైన, పారదర్శకమైన సమ్మిళిత ప్రక్రియ ద్వారా వస్తువులు, సేవల సేకరణ జరగాలని ఆయన అన్నారు.
లాభాపేక్ష లేని సంస్థగా ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్) పనిచేయడం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి శ్రీ బినోయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2017 మే 17 న లాభాపేక్ష లేని సంస్థగా ప్రభుత్వ ఈ -మార్కెట్‌ప్లేస్ (జెమ్) పనిచేయడం ప్రారంభించింది.
భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో సమర్థవంతమైన, పారదర్శకమైన, సమ్మిళిత ప్రక్రియ ద్వారా వస్తువులు, సేవల సేకరణ జరపడానికి పటిష్టమైన ప్రజా సేకరణ వ్యవస్థ అవసరాన్ని శ్రీ బినోయ్ కుమార్ వివరించారు. ఏకీకృత ప్రజా సేకరణ వ్యవస్థ అభివృద్ధి లో జెమ్ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. తక్కువ సమయంలో వేగంగా అభివృద్ధి చెందిన జెమ్ అనేక కొత్త రికార్డులు నెలకొల్పిందని అన్నారు.
ప్రభుత్వ సంస్థల సహకారంతో అమ్మకాలు, కొనుగోళ్లు ప్రోత్సహించడానికి జెమ్ అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను జెమ్ సీఈఓ శ్రీ పి.కే.సింగ్ వివరించారు.కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర శాఖలు, పబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటీవల ప్రారంభమైన సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలు జెమ్ ద్వారా వస్తువులు, సేవలు సేకరిస్తున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యక్రమాలు నిర్ణయించుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని శ్రీ పి.కే.సింగ్ సూచించారు. త్వరలో నిర్వహించే మేధో మధనం కార్యక్రమంలో సమస్యలు గుర్తించి, సమస్యల పరిష్కారానికి వినూత్న పరిష్కార మార్గాలు రూపొందిస్తామని తెలిపారు.
ప్రజా సేకరణ వ్యవస్థలో సమూల మార్పులు తేవడంతో పాటు గతంలో జెమ్ అవుట్‌లెట్ స్టోర్‌లుగా పనిచేసిన కేంద్రాలను ఓకల్ లోకల్ పేరిట జెమ్ అవుట్‌లెట్ స్టోర్‌లను ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం జెమ్ సాధించిన విజయాలను గుర్తు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మహిళలు,షెడ్యూల్డ్ కులాలు /షెడ్యూల్డ్ తెగలు, గిరిజన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు,అంకుర సంస్థలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలు, కళాకారులు, చేనేత కార్మికులు, ఖాదీ, నేత, వెదురు ఉత్పత్తిదారులు, మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేని విక్రేత బృందాలు మొదలైన వారికి ఈ-మార్కెట్ అందుబాటులోకి వచ్చేలా చేసిన జెమ్ మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ సంతలు, ఉత్సవాలు,ప్రదర్శనలకు ప్రత్యామ్నాయంగా జెమ్ అవుట్‌లెట్ కేంద్రాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పనిచేస్తున్నాయి.
వివిధ మంత్రిత్వ శాఖల సహకారం తో జెమ్ 8 “జెమ్ అవుట్‌లెట్ స్టోర్"లను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వోకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్ భారత్, భారత్ అభియాన్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి గ్రామీణ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వివిధ ఉత్పత్తుకు ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా మార్కెట్‌ల అందుబాటులోకి తెచ్చేందుకు జెమ్ కార్యక్రమాలు అమలు చేసింది. దీనిలో భాగంగా మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో లేని ఉత్పత్తిదారులు గుర్తించిన వీరికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించడానికి జెమ్ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్, “మేక్ ఇన్ ఇండియా”లో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి తన వంతు సహకారం అందిస్తోంది. సంస్థ పురోభివృద్ధికి సహకరించిన సిబ్బందికి కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు.
2016 లో ప్రారంభమైన జెమ్ పోర్టల్ లో 68000 ప్రభుత్వ కొనుగోలుదారులు, 61.81 లక్షల మంది విక్రేతలు సేవలు అందిస్తున్న సంస్థలు నమోదు అయ్యాయి. 31.14 లక్షలకు పైగా ఉత్పత్తులు 11,567 ఉత్పత్తి తరగతులు, 2,44,787 రకాల సేవలు 293 సేవా వర్గాల్లో జెమ్ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. జెమ్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 4.15 లక్షల కోట్ల విలువైన 1.51 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల రూపాయల విలువ చేసే 50 లక్షలకు పైగా లావాదేవీలు సాగించి ప్రత్యేక మైలురాయిని సాధించింది. జెమ్ పోర్టల్ ద్వారా జరిగిన స్థూల వ్యాపార లావాదేవీలలో 2.18 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే లావాదేవీలు సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తల ద్వారా 52.54 శాతం (%) జరిగాయి.
***
(Release ID: 1925392)
Visitor Counter : 128