పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

మిషన్ లైఫ్ ( పర్యావరణహిత జీవన విధానం) లో భాగంగా 'మ్యూజియంలు, సుస్థిరత, శ్రేయస్సు' అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం-2023 ప్రారంభం

Posted On: 18 MAY 2023 6:33PM by PIB Hyderabad

మిషన్ లైఫ్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర  పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రతి ఏడాది జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పర్యావరణంపై అవగాహన కల్పించడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మిషన్ లైఫ్ పై దృష్టి సారించి నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.  గ్లాస్గో లో జరిగిన పర్యావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వేదిక  2021 సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ లైఫ్ విధానాన్ని ప్రతిపాదించారు. పర్యావరణహిత జీవం విధానం, జీవన శైలిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు అమలు జరగాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రజల సహకారం, భాగస్వామ్యంతో  లైఫ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

1. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (NCSCM):

గల్ఫ్  ఆఫ్ మన్నార్‌లోని రామేశ్వరం ద్వీపంలోని అరిచల్ మునై , ధనుష్కోడి బీచ్‌లలో మిషన్ లైఫ్ పై నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. రామేశ్వరం ద్వీపం కోన భాగంలో ఉన్న ధనుష్కోడి బీచ్ చారిత్రక, మతపరమైన, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. జలవనరులు ఎక్కువగా ఉన్న ధనుష్కోడిలోని అరిచమునై పక్షుల అభయారణ్యం  స్థానిక, వలస పక్షులకు ఆశ్రయం కల్పిస్తోంది. అనేక నీటి రిజర్వాయర్‌ల కారణంగా ఆహారం,సంతానోత్పత్తి కోసం పక్షులు  అరిచమునై పక్షుల అభయారణ్యానికి వస్తుంటాయి. ప్రజలు, పర్యాటకులకు లైఫ్ కార్యక్రమంపై అవగాహన కల్పించి సముద్ర తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి, కాలుష్య నివారణకు  ప్రాధాన్యత ఇస్తూ రామేశ్వరం ద్వీపంలో అరిచాల్ మునైలో తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ప్రజలు, పర్యాటకుల సహకారంతో  నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. లైఫ్ కార్యక్రమం, పర్యవవరణహిత జీవన విధానంపై పర్యాటకులకు అవగాహన కల్పించారు. ధనుష్కోడి బీచ్ సమీపంలోని "ఇసుక దిబ్బలు"లో జరిగిన కార్యక్రమంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో కలిసి  సందర్శకులు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. ఇసుక మేట ద్వారా తీరం కోతకు గురి కాకుండా చూడడం, పక్షులకు ఆవాసం కల్పించడం, జీవ వైవిధ్య పరిరక్షణ, సందర్శకులకు వినోదం అందించడం, జలవనరుల శుద్ధి,  రక్షణ అంశాలలో ధనుష్కోడి పర్యావరణ వ్యవస్థ కీలకంగా ఉంది. ప్రజలు నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో భాగంగా తీరంలో పేరుకు పోయిన ప్లాస్టిక్, థర్మాకోల్, సీసాలు, పారేసిన చేపల వలలు, తాళ్లు, ఇసుక మేటలపై చిక్కుకున్న రబ్బరు వంటి చెత్తను సేకరించి సమీపంలోని మెటీరియల్ రికవరీ కేంద్రానికి తరలించారు. ప్రాంతాన్ని సందర్శించడానికి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 250 మంది సందర్శకులకు మిషన్ లైఫ్ కార్యక్రమంపై  నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది అవగాహన కల్పించారు. ఒకసారి వినియోగించి పారవేసి  ప్లాస్టిక్‌లకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు, బాధ్యతాయుతమైన పర్యాటకం, మూలం వద్ద వ్యర్థాల విభజన, నీరు, జీవవైవిధ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు పర్యావరణహిత జీవన విధానం ప్రాధాన్యత వివరించారు.  ఈ కార్యక్రమం ద్వారా  పర్యాటకులకు తీరప్రాంత ఇసుక దిబ్బ పర్యావరణం, దిబ్బలను సంరక్షించాల్సిన అవసరం, దిబ్బలను సందర్శించినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన పొందారు. కార్యక్రమంలో  భాగంగా తీరా ప్రాంతాలను కలుషిత చేయమని, పర్యావరణహిత హరిత జీవన విధానాన్ని పాటిస్తామని  ప్రతిజ్ఞ (హిందీ, ఇంగ్లీష్ లో) తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్‌లో పోస్టర్లు,కరపత్రాలు పంపిణీ చేశారు. 

2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ (NIHE)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ (NIHE)కి ఈశాన్య ప్రాంతీయ కేంద్రం (NERC) అరుణాచల్ ప్రదేశ్‌లోని జుల్లాంగ్‌లోని హిమాలయన్ విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.  'ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి '  'సే నో టు సింగిల్ యూజ్' నినాదంతో మిషన్ లైఫ్ కింద 2023 మే 18న  శుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. హిమాలయన్ యూనివర్సిటీ,నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ కి చెందిన  రీసెర్చ్ స్కాలర్‌లు, విద్యార్థులు, సిబ్బందితో సహా మొత్తం 81 మంది  మిషన్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం జీవవైవిధ్య పరిరక్షణ  ప్రాముఖ్యత, హిమాలయ ప్రాంతంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల  వినాశకరమైన పరిణామాల గురించి ప్రజలకు  అవగాహన పెంపొందించడం లక్ష్యంగా అమలు జరిగింది. 

3. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దిఘా, పశ్చిమ బెంగాల్ మిషన్ లైఫ్  లక్ష్యాలను ప్రజలకు తెలియజేయడానికి దిఘా సైన్స్ సెంటర్‌లో మిషన్ లైఫ్ సామూహిక సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది.  మొత్తం 90 మంది పర్యాటకులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

4. నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా
నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ భువనేశ్వర్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది, కార్యక్రమంలో భాగంగా  సందర్శకులకు  మ్యూజియం ఆవశ్యకత, ప్రాధాన్యత వివరించారు. మిషన్ లైఫ్ (పర్యావరణ హిత జీవన శైలి )లో భాగంగా బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌తో తయారు చేసిన జంతువుల నమూనాలను  పరిచయం చేశారు. 18.05.2023న జరిగిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. 

వాతావరణ మార్పులు, పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీ, మైసూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం-2023 జరిగింది.  'మ్యూజియంలు, సుస్థిరత మరియు శ్రేయస్సు,' అనే ఇతివృత్తంతో 18.05.2023న మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో  సుమారు 80 మంది పాల్గొన్నారు. విద్యా కార్యక్రమాలు, ప్రదర్శనలు, కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా స్థిరమైన భవిష్యత్తును రూపొందించడంలో  చరిత్ర మ్యూజియంల పాత్ర ను వివరించారు. 

 

***

 



(Release ID: 1925350) Visitor Counter : 239


Read this release in: Hindi , English , Urdu