ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వరల్డ్ ఫుడ్ ఇండియా 2023పై మొదటి అంతర్ మంత్రిత్వ కమిటీ సమావేశం
Posted On:
18 MAY 2023 4:36PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో మంగళవారం 2023 మే 16వ తేదీన మొదటి అంతర్ మంత్రిత్వ కమిటీ సమావేశం ఆహారం తయారీ పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్) ఎఫ్ పి ఐ కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ సమావేశానికి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి వివిధ మంత్రిత్వ విభాగాలు / శాఖలు / బోర్డుల సీనియర్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
కమిటీ సమావేశంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023కు ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు జరుగుతున్న ఏర్పాట్లను గురించి అధికారులకు తెలియజేయడమే కమిటీ సమావేశం ఎజెండా. ఏయే మంత్రిత్వ విభాగం / శాఖ/ సంస్థ ఏం చేయాలో , వారి భాగస్వామ్యం ఏమిటో కూడా సమావేశంలో చర్చించారు.
భారత ఆహారం గొప్పతనాన్ని గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడమే వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ఉద్దేశం. దాంతో పాటు వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, పశు గణాభివృద్ధి రంగాలతో పాటు భారతీయ ఆహార తయారీ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలను గురించి ప్రచారం చేయడం.
గతంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల మధ్య జరిగిన పరస్పర సంభాషణలు, అభిప్రాయ మార్పిడికి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ విభాగం వరల్డ్ ఫుడ్ ఇండియా 2023కు తమ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది. సహకారానికి అవకాశం ఉన్న అంశాలను గురించి చర్చించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వాలు, శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
న్యూ ఢిల్లీలో 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే భారీ ఆహార ప్రదర్శన / సమ్మేళనం గురించి తమ తమ ప్రణాళికలను తెలియజేయవలసిందిగా ఎఫ్ పి ఐ కార్యదర్శి సమావేశంలో పాల్గొన్న అధికారులను కోరారు.
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వాలు మరియు శాఖలను సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరారు. తమ తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం ఇవ్వాలని, ఉన్నతస్థాయి విధాన నిర్ణేతలు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్వయం సహాయక బృందాల ప్రతినిధులు మరియు అన్ని భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొని వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 విజయవంతానికి తోడ్పడాలని కోరారు. అందరం కలసికట్టుగా పనిచేస్తే విజయం తధ్యమని చెప్తూ కార్యదర్శి తమ ప్రసంగాన్ని ముగించారు.
అంతేకాక సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వానికి మద్దతు తెలిపారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయబారులు , హై కమిషనర్ల సమావేశం, అమ్మకందార్లు కొనుగోలుదారుల సమావేశం, ఆయుష్ ఆహార ఉత్పత్తుల ప్రోత్సహక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఆయా బోర్డులకు సంబంధించిన ఎగుమతిదారులు కూడా ఈ సమావేశాలలో పాల్గొనేలా చూడాలని సమావేశానికి హాజరైన అధికారులు సూచించారు.
అంతర్ మంత్రిత్వ కమిటీ తదుపరి సమావేశం జూన్ నెలలో జరుగవచ్చు. ఇంకా ప్రభుత్వ సంస్థలు, బోర్డులు, ఆయా మంత్రిత్వ విభాగాలు మరియు శాఖలతో కార్యాచరణ ప్రణాళికను చర్చించి తగిన మద్దతును రాబట్టి పెట్టుబడులను ఆకర్షించేందుకు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని పెట్టుబడులను సుసాధ్యం చేసే ఇన్వెస్ట్ ఇండియా , కార్యక్రమం భాగస్వామి ఫిక్కీలను ఆదేశించడం జరిగింది.
***
(Release ID: 1925341)