మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-5 లో భాగంగా కోస్తా మహారాష్ట్ర మత్స్యకారులతో సంభాషించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల

Posted On: 18 MAY 2023 4:47PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై ) , కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) వంటి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య కార్మికుల సంక్షేమ పథకాలు,  కార్యక్రమాల ద్వారా మత్స్యకారులు, ఇతర భాగస్వాముల సమస్యలను పరిష్కరించడానికి , వారి ఆర్థిక అభ్యున్నతిని సులభతరం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ సాగర్ పరిక్రమ.

 

మహారాష్ట్ర ప్రభుత్వ , గోవా ప్రభుత్వ మత్స్యశాఖలు, , ఇండియన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారుల ప్రతినిధుల తో కలసి భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ కు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిషరీస్, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు  2023 మే 17న గేట్ వే ఆఫ్ ఇండియా, ముంబై నుంచి ప్రారంభమైన సాగర్ పరిక్రమ ఫేజ్-5ను పర్యవేక్షిస్తున్నారు.  ఇది కరంజా (రాయగఢ్ జిల్లా), మిర్కార్వాడ (రత్నగిరి జిల్లా), వాస్కో, మోర్ముగావ్, కనకోనా (దక్షిణ గోవా) దిశగా పురోగమిస్తోంది.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, ఐఏఎస్, ఒ ఎస్ డి  (ఫిషరీస్) డాక్టర్ అభిలాష్ లిఖీ, జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్) డాక్టర్ జుజ్జవరపు బాలాజీ, మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) డాక్టర్ అతుల్ పట్నే, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తో పాటు హాజరై సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-5ను ప్రారంభించారు.

 

'సాగర్ పరిక్రమ' మొదటి దశ కార్యక్రమం గుజరాత్ లో నిర్వహించబడింది, 2022 మార్చి 5 న మాండ్వి నుండి ప్రారంభమైంది .6 మార్చి 2022 న గుజరాత్ లోని పోర్ బందర్ లో ముగిసింది. ఫేజ్ -2 కార్యక్రమంగా సాగర్ పరిక్రమ ప్రయాణం 2022 సెప్టెంబర్ 22 న మంగ్రోల్ నుండి వెరావల్ వరకు ప్రారంభమై 2022 సెప్టెంబర్ 23 న ముల్ ద్వారకా వద్ద ముగిసింది. 'సాగర్ పరిక్రమ' మూడవ దశ కార్యక్రమం 2023 ఫిబ్రవరి 19 న గుజరాత్ లోని సూరత్ నుండి ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 21 న ముంబైలోని సాసన్ డాక్ వద్ద ముగిసింది. ఫేజ్-4 కార్యక్రమం 2023 మార్చి 17 న గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ నుండి ప్రారంభమై 2023 మార్చి 19 న మంగళూరులో ముగిసింది.

 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ,ఇతర ప్రముఖులకు వెల్దూర్ (జిల్లా రత్నగిరి) లో ఆయ్ నా లై నృత్యం , పూల గుచ్చాలతో మత్స్యకార స్త్రీ, పురుషులు సాదర స్వాగతం పలకడంతో రెండవ రోజు కార్యక్రమం ప్రారంభమయింది. సాగర్ పరిక్రమ ఫేజ్-5 పై మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) డాక్టర్ అతుల్ పట్నే పరిచయోపన్యాసం చేశారు, తీరప్రాంత సమాజాలు , మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేపల రైతులు , మత్స్యకారులు పోషించే కీలక పాత్రను వివరించారు.

సముద్ర వనరుల సమతుల్యతను కాపాడటానికి , చేపల పరిశ్రమలో నిమగ్నమైన వారి జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి సుస్థిర చేపల వేట పద్ధతులు, మత్స్యకారుల సంక్షేమం ముఖ్యమైన పరిగణనలు అని ఆయన నొక్కి చెప్పారు.

 

వెల్డూరు (జిల్లా రత్నగిరి)లో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల , ఇతర ప్రముఖులు లబ్ధిదారులు, చేపల పెంపకందారులు, మత్స్యకారులతో మాట్లాడారు.వివిధ లబ్ధిదారులు 1) శ్రీ విఠల్ భలేకర్, 2) పి.ఎన్.చౌగాలే, 3) మక్బూల్ హుస్సేన్ జంబర్ఖర్. విఠల్ భలేకర్ తదితరులు తమ క్షేత్రస్థాయి అనుభవాలను, మత్స్యకారుల స్థానిక సమస్యలను వివరించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ, చేపలు పట్టడానికి సంబంధించిన నియమనిబంధనల ప్రామాణికత  సహా మత్స్యకారులు, చేపల పెంపకందారులు తమ క్షేత్రస్థాయి వాస్తవాలు, అనుభవాలను పంచుకోవడానికి  ఇంటరాక్టివ్ సెషన్ సహాయపడిందని అన్నారు. ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా చేపల పెంపకం విధానం, ఆదాయం గురించి చేపల రైతులకు వివరించారు. మత్స్యరంగ అభివృద్ధికి కృషి చేస్తామని, లబ్ధిదారులు, మత్స్య రైతులు, మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై), కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) వంటి పథకాల అమలు ద్వారా మత్స్య సంపద విలువ గొలుసులో కీలకమైన అంతరాలను తొలగించడం గురించి ఆయన వివరంగా మాట్లాడారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల మత్స్యరంగంలో విశేష కృషి చేసినందుకు మనోరి గ్రామస్తులకు రూ.54,00,000/- చెక్కును అందజేశారు.

మత్స్యకారులు ముందుకు వచ్చి మత్స్యకారులు, చేపల పెంపకందారుల జీవనోపాధి కోసం మెరుగైన సుస్థిర చేపల పెంపకం, జీవనోపాధి కోసం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలకు తమ దరఖాస్తును అందజేశారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల మీర్కార్వాడ (జిల్లా రత్నగిరి) ప్రయాణాన్ని కొనసాగించారు.  లబ్ధిదారులు అంటే మత్స్యకారులు , చేపల రైతులు , మహారాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పూలదండలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ఆయన మిర్కార్వాడ, మిర్యా గ్రామాలను సందర్శించి, చేపల రైతులు, మత్స్యకారులతో మాట్లాడి, ఈ రంగంలో సవాళ్లు, అవకాశాలపై చర్చించారు. మిర్కార్వాడ (జిల్లా రత్నగిరి)లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 8000 మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

స్వాతంత్ర యోధుడు సావర్కర్ నాట్యగృహ, మారుతీ మందిర్ (జిల్లా రత్నగిరి)లో సీనియర్ అధికారులు, లబ్ధిదారులు అంటే మత్స్యకారులు, చేపల రైతులు, ఇతర భాగస్వాముల సమక్షంలో రంగస్థల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులలో –1) కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల, 2) మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఉదయ్ సామంత్, 3) భారత ప్రభుత్వ ఒ ఎస్ డి (ఫిషరీస్) డాక్టర్ అభిలాష్ లిఖితి, 4)  భారత ప్రభుత్వ ఒ ఎస్ డి ఏఎన్ తివారీ, 5) మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) డాక్టర్ అతుల్ పట్నే, ఐఏఎస్, 6) డాక్టర్ జె.బాలాజీ, ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్), 7) రామ్సింగ్ 8) డాక్టర్ ఎల్ఎన్ మూర్తి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, 9) డాక్టర్ సంజయ్ పాండే, డిప్యూటీ కమిషనర్, 10) శ్రీ పంకజ్ కుమార్, ఎండి, ఎంఎఫ్ డిసి ఎండి, 11) డాక్టర్ నియాతి జోషి, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, భారత ప్రభుత్వం,12) శ్రీ దేవేందర్ సింగ్, కలెక్టర్ రత్నగిరి, 13) శ్రీ ధనుంజయ్ కులకర్ణి, ఎస్పీ, రత్నగిరి, 14) భక్తి పేజే, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్, 15) శ్రీ మహేష్ డియోర్, మెరైన్ జాయింట్ కమిషనర్, 16) శ్రీ యువరాజ్ చౌగులే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, సాంగ్లీ, 17) శ్రీ అభయ్ దేశ్ పాండే, రీజినల్ డిప్యూటీ కమిషనర్, పుణె, 18) శ్రీ ఎన్.వి.భదులే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, ఇంకా భారత ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డుకు చెందిన సీనియర్ అధికారులు , మత్స్యకారుల ప్రతినిధులు.

ఉన్నారు.

 

కార్యక్రమానికి హాజరైన అతిథికి మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) ఐఏఎస్ డాక్టర్ అతుల్ పట్నే స్వాగతోపన్యాసం చేశారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా మత్స్యకారుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసే స్థిరమైన మత్స్య నిర్వహణకు దోహదపడే మెరుగైన కమ్యూనికేషన్ అవగాహనతో  మత్స్యకారులు , చేపల పెంపకందారులకు మద్దతు ఇవ్వడానికి అవసరాలు, సవాళ్లను అర్థం చేసుకోవడం కోసం పలువురు మత్స్యకారులతో 1) అంజాద్ బోర్కర్, 2) ఇమ్రాన్ ముకదమ్, 3) మహేష్ నటేకర్, 4) విజయ్ ఖేడేకర్, 5) తనయ్ శివాల్కర్) 6) యోగిని భట్కర్ లతో సంభాషించారు.

 

కెసిసి ప్రమోషన్ గురించి ఆయన చర్చించారు.  మహారాష్ట్రలోని కోస్తా జిల్లాల్లో శిబిరాలను నిర్వహించారు, అక్కడ మత్స్యకారులు , చేపల రైతులకు కెసిసి రిజిస్ట్రేషన్ ,దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. కిసాన్ క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డు/ ఈ-శ్రమ కార్డుతో మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాములను సన్మానించారు. వివిధ లబ్ధిదారుల జాబితా ఈ క్రింది విధంగా ఉంది i) పిఎమ్ఎమ్ఎస్ వై కింద లబ్ధిదారులు (శ్రీమతి రుతుజా సావంత్, శ్రీమతి పూనమ్ షెట్యే, శ్రీమతి నస్రీన్ భట్కర్), ii) కెసిసి కార్డు- ( శ్రీ రమేష్ సహదేవ్ పాటిల్, శ్రీ మన్సూర్ హతోడ్కర్, శ్రీ. సమీనా వజూద్ బెబాజీ), iii) క్యూఆర్ కోడ్డ్ ఆధార్ కార్డు (శ్రీ గజానన్ హెడావ్కర్, శ్రీ విలాస్ ఖర్వాట్కర్, శ్రీ తేజస్ శివాల్కర్, శ్రీ ఇమ్రాన్ ముకదమ్, శ్రీ సుహేల్ ఎ. కదిర్ నఖ్వా, శ్రీ జమీల్ ఆదిల్ వాడ్కర్).

 

మత్స్యకారులు, చేపల పెంపకందారులతో నేరుగా సంప్రదింపులు జరిపి తీరప్రాంత సమస్యలు, మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడానికి దారితీసే ప్రభుత్వ దీర్ఘకాలిక విధాన వ్యూహాన్ని ప్రతిబింబించే కార్యక్రమం సాగర్ పరిక్రమ. ఒకటి, రెండు, మూడు, నాలుగు దశలు మత్స్యకారుల అభివృద్ధి వ్యూహంలో భారీ మార్పులు తీసుకొచ్చాయి.  సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని మత్స్యకారులు, చేపల పెంపకందారులు విశాల హృదయంతో స్వాగతిస్తున్నారని, ఇది తమ అభివృద్ధికి ఒక సాధనంగా వారు భావిస్తున్నారని తెలిపారు. అందువల్ల, వాతావరణ మార్పులు , సుస్థిర అభివృద్ధితో సహా మత్స్యకారులు ,మత్స్యకారుల జీవనోపాధి, సమగ్ర అభివృద్ధిపై ఈ సాగర్ పరిక్రమ ప్రభావం విస్తృతంగా ఉంటుంది.

 

తదుపరి దశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఇతర ప్రముఖులతో కలిసి వాస్కో, మోర్ముగావ్, కానకోనా (దక్షిణ గోవా) తీర ప్రాంతంలోని ఇతర ప్రదేశాలను సందర్శిస్తారు.

 

***

 


(Release ID: 1925323) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi