ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రివెంటివ్ విజిలెన్స్‌పై ప్ర‌భావ‌శీల సెష‌న్‌ను నిర్వ‌హించిన ఎన్ఎండిసి

Posted On: 18 MAY 2023 2:15PM by PIB Hyderabad

 ప్రివెంటివ్ విజిలెన్స్ ( నివార‌క/ ముంద‌స్తు నిఘా) అన్న అంశంపై భార‌త్‌లోని అతిపెద్ద ఇనుప‌ఖ‌నిజ ఉత్ప‌త్తిదారు అయిన ఎన్ఎండిసి బుధ‌వారంనాడు హైద్రాబాద్‌లోని కేంద్ర కార్యాల‌యంలో సెష‌న్‌ను నిర్వ‌హించింది. 
కేంద్ర విజిలెన్స్ క‌మిషన్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమారి సింగ్ కీల‌కోప‌న్యాసం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ (ఉత్ప‌త్తి) శ్రీ దిలీప్ కుమార్ మొహంతి. సివిఒ శ్రీ బి. విశ్వ‌నాథ్, ఎన్ఎండిసి సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బందితో క‌లిసి పాల్గొన్నారు. 
ముంద‌స్తు నిఘా ప్రాముఖ్య‌త‌ను ప‌ట్టి చూపుతూ,  బాధ్య‌త‌, పార‌ద‌ర్శ‌క‌త అన్న‌వి ఒక సంస్థకు మూల నిబంధ‌న‌లు, సూత్రాల‌ని డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమారి సింగ్ అన్నారు. అంత‌ర్గ‌త సామ‌ర్ధ్యాన్ని పెంపొందించుకోవ‌డానికి, సంభాష‌ణ‌ల ద్వారా అవ‌గాహ‌న‌ను పెంచుకోవ‌డం ద్వారా సాధించ‌గ‌లిగే నిజ‌మైన ముంద‌స్తు నిఘా అన్న‌ది వ్యక్తులు వారి చ‌ర్య‌లు, ప్ర‌క్రియ‌ల‌కు జ‌వాబుదారీగా ఉంచుతుంది. సంస్థాగ‌త ల‌క్ష్యాల‌ను అర్థం చేసుకునేందుకు, నైతిక‌త‌, స‌మ‌గ్ర‌త‌కు చెందిన అంశాల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌మ స‌హ‌చ‌రులు, స‌హాయ‌క ఉద్యోగుల‌తో కంపెనీ సీనియ‌ర్ ఉద్యోగులు సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ, సంభాషించాలి. స‌మ‌గ్ర‌త‌ను ఒక జీవ‌న విధానంగా చేసే సంస్కృతిని సుప‌రిపాల‌న డిమాండ్ చేస్తుంద‌ని డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమారి సింగ్ పేర్కొన్నారు. 

 

***


(Release ID: 1925231) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi , Punjabi