కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రపంచ టెలికాం దినోత్సవం జరిపిన టెలికమ్యూనికేషన్ల విభాగం అంతర్జాతీయ టెలికాం శక్తిగా ఎదిగిన భారత్

Posted On: 17 MAY 2023 7:38PM by PIB Hyderabad

ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా 2023 మే 17 న న్యూ ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ప్రపంచ టెలికాం దినోత్సవ వేడుకలను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవాన్షు చౌహాన్ ప్రారంభించారు. టెలికాం రంగంలో అంకుర సంస్థల ఆవిష్కరణలను ప్రదర్శించే ప్రత్యేక ప్రదర్శనను కూడా మంత్రి  ఈ సందర్భంగా  ప్రారంభించారు. యు ఎస్ ఒ ఎఫ్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక తపాలా బిళ్ళను, భారతదేశంలో యు ఎస్ ఒ ఎఫ్ మీద పుస్తకాన్ని ఆవిష్కరించారు.

భారత ఉద్యమి లను ఈ సందర్భంగా సత్కరించారు. చిట్టచివరి లబ్ధిదారులను చేరుకోవటంలో అత్యుత్తమ సేవలందించిన  నలుగురు ఉద్యమి లను సత్కరించి తొలి అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ సదస్సు నివేదికను విడుదల చేశారు.  టెలికమ్యూనికేషన్ విభాగం ఉద్యోగులను, క్షేత్రస్థాయి విభాగాలలో పనిచేసే టెలికాం ఉద్యోగులను వారి సేవలకు, అతిట్టమ ప్రతిభకు పురస్కారాలందించారు .క్షేత్ర స్థాయి పనితీరుకు గాని ఎల్ ఎస్ ఏ ఆంధ్రప్రదేశ్ కు, సీసీ ఎన్ ఈ -2, డబ్ల్యూ ఎంవో ఐఎంఎస్ చెన్నై కు  ఈ పురస్కారాలు దక్కాయి. అద్భుతమైన ప్రతిభ కనబరచిన అధికారులకు కూడా పురస్కారాలు అందజేశారు.  

మంత్రి శ్రీ దేవాన్షు చౌహాన్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా ఐటీయూ తోబాటు యావత్ ప్రపంచం దీన్ని వేడుకగా జరుపుకుంటున్నదన్నారు. ఇదే రోజు స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పే సారధ్యంలో తెలికమ్యూనికేషన్ల విభాగంలో 20 ఏళ్ల కిందట యు ఎస్ ఒ ఎఫ్ ఏర్పడటం  ఎంతో ప్రాధాన్యం తెచ్చిపెట్టిందన్నారు.  

భారతదేశం అమృత కాలంలో ప్రవేశించిందని గుర్తు చేస్తూ ఇందులో భాగంగా ఐటీయూ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించటం, భారతదేశంలో 5 జి సేవల ప్రారంభాన్ని కీలక ఘట్టాలుగా అభివర్ణించారు. భారతదేశంలో టెలికాం నెట్ వర్క్ అత్యంత వేగంగా ఎదుగుతున్నాడాని చెబుతూ 680 జిల్లాల్లో 5 జి నెట్ వర్క్ ప్రారంభం కావటాన్ని ప్రస్తావించారు. రికార్డు సమయంలో అత్యంత పారదర్శకంగా స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందని చెప్పారు. అవే కాకుండా స్వదేశీ 4 జి, 5 జి అభివృద్ధి పరచటం ద్వారా భారతదేశం టెలికాం రంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగిందన్నారు.

డిజిటల్ అంతరాన్ని తగ్గించటంలోనూ, చిట్టచివరి ప్రాంతం దాకా కనెక్టివిటీ కల్పించటంలోనూ యు ఎస్ ఒ ఎఫ్, భారత్ నెట్ కీలకమైన పాత్ర పోషించాయని  మంత్రి చెప్పారు. 6 లక్షలకు పైగా గ్రామాలు 4 జి తో అనుసంధానం కాగా 2 లక్షల గ్రామ పంచాయితీలకు ఆప్టిక్ ఫైబర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆవిధంగా డిజిటల్ సమ్మిళితి సాధించామన్నారు. టెలికాం రంగంలో చేపట్టిన అనేక సంస్కరణల కారణంగా మౌలిక సదుపాయాలలో  సమ్మిళిత అభివృద్ధి సాధ్యమై సుఖమయ జీవితం, సులభతర వ్యాపారం అందుబాటులోకి వచ్చాయని, పౌరులే కేంద్రంగా అందే సేవలు మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రధాని మోదీ ప్రస్తావించిన పంచ్ ప్రాణ్ ను కూడా మంత్రి గుర్తు చేశారు. అందరూ కలసికట్టుగా ఈ దిశలో కృషి చేస్తే నవభారత దేశ సాంకేతిక విప్లవానికి దోహదం చేసినట్టవుతుందన్నారు.

సంచార సారథి పోర్టల్ అను అభివృద్ధి పరచిన అధికారులను టెలికాం కార్యదర్శి శ్రీ కె రాజారామం సత్కరించారు. పురులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పోర్టల్ సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. ఈ పోర్టల్ లింక్: https://sancharsaathi.gov.in   విశ్వసనీయమైన అత్యాధునికమైన, సురక్షితమైన టెలికాం మౌలిక వసతులతో  ముందడుగు వేయాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.. చిట్టచివరి ప్రాంతాలకు కూడా చేరుకోవటానికి చేస్తున్న కృషిని వివరిస్తూ, ఇందులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం,  నవకల్పనలు పోషిస్తున్న పాత్రను వివరించారు.  

నేపథ్యం

ఐటీయూ ఏర్పడిన సందర్భాన్ని, 1865 లో జరిగిన మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ సదస్సును పురస్కరించుకొని 1969 నుంచి ఏటా మే 17 న  ప్రపంచ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం జరుపుకుంటారు. ఇంటర్నెట్, తదితర సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ సాయంతో ఇంటర్నెట్ వినియోగం మీద అవగాహన పెంచటం, ఫలితంగా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలలో మార్పు తీసుకురావటం, డిజిటల్ అంతరాన్ని తగ్గించటం దీని లక్ష్యం. రెండు ఘట్టాలనూ మే 17 న  ప్రపంచ టెలికమ్యూనికేషన్లు, సమాచార సమాజ దినోత్సవం పేరుతో కలిపి జరపాలని టారకీయ నిర్ణయించుకుంది.

2002 ఏప్రిల్ 1 న భారతదేశంలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ ఒఎఫ్) అమలులోకి వచ్చింది.  ఇది ఐసీటీని సార్వత్రికంగా అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రదేశాల్లోనూ అందేలా చేసింది. ఈ సంవత్సరం యుఎస్ ఒఎఫ్ 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్లలో గ్రామ పంచాయితీ టెలిఫోన్ మొదలుకొని గ్రామీణ బ్రాడ్ బాండ్ దాకా,  మొబైల్ టవర్ మొదలుకొని ఒఎఫ్ సి ప్రాజెక్టుల దాకా చివరికి ఆర్ అండ్ డి ప్రాజెక్టుల దాకా అమలు జరిగాయి.

 

***



(Release ID: 1925116) Visitor Counter : 173


Read this release in: English , Urdu , Hindi , Marathi