పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని గ్రామీణ పాఠశాలల్లో మిషన్ లైఫ్ అవగాహన కార్యక్రమాలు, ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహణ
Posted On:
17 MAY 2023 8:21PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) పర్యావరణంపై అవగాహన, చర్య కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను ఒకచోట చేర్చే సందర్భం. ఈ సంవత్సరం, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మిషన్ లైఫ్‌పై దృష్టి సారించి జరుపుకోవాలని భావిస్తోంది. 2021 యుఎన్ఎఫ్సీసీసీ కాప్ 26లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ నాయకుల సదస్సులో, సుస్థిరమైన జీవనశైలిని అవలంబించడానికి, ప్రపంచవ్యాప్త సాధనను పునరుజ్జీవింపజేయడానికి ఒక స్పష్టమైన పిలుపునిచ్చినప్పుడు, లైఫ్ కాన్సెప్ట్, అంటే, లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అనే భావనను గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రవేశపెట్టారు. వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'లైఫ్'పై భారీ జనసమీకరణను చేపడుతున్నారు.
- నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (ఎన్ఎంఎన్హెచ్)
ఎన్ఎంఎన్హెచ్ ఎన్జెడ్పి సహకారంతో ఢిల్లీ నుండి 231 మంది విద్యార్థులలో మిషన్ లైఫ్ భారీ సమీకరణను నిర్వహించింది.
ఆర్ఎంఎన్హెచ్, మైసూర్ 70 మంది కళాశాల విద్యార్థులు/సాధారణ సందర్శకుల కోసం మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)లో భాగంగా "పర్యావరణ కార్యకలాపాలపై నాటకాలు, పాటలు" కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. ప్రకృతి పాటల స్క్రీనింగ్ ద్వారా పర్యావరణ అవగాహన కలిపిస్తూ, మిషన్ లైఫ్ మాస్ మొబిలైజేషన్‌లో భాగంగా ప్రొప్లానెట్ కార్యకలాపాలను అనుసరించమని ప్రోత్సహిస్తోంది.
- జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కానింగ్, సుందర్‌బన్, పశ్చిమ బెంగాల్ వారు క్యానింగ్‌లో 50 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, దీనిలో విద్యార్థులు మిషన్ లైఫ్‌పై ప్రతిజ్ఞ చేశారు.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సుందర్‌బన్ రీజినల్ సెంటర్, క్యానింగ్, పశ్చిమ బెంగాల్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు, బాలికలకు నీటి సంరక్షణ, చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి హరిత చర్చలు, అవగాహనా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక క్లబ్, భాంధుమహల్ క్లబ్ టూల్ పార్ట్ నుండి మొత్తం 40 మంది పాల్గొన్నారు.
- సుస్థిర తీరప్రాంత నిర్వహణ జాతీయ కేంద్రం (ఎన్సిఎస్ఎం)
పుదుచ్చేరి మునిసిపాలిటీ, సామాజిక సంస్థలు, వాలంటీర్స్ ఫెడరేషన్ (ఎన్జిఓ) సహకారంతో మిషన్ లైఫ్, ఎన్సిఎస్సిఎం థీమ్‌లను పరిష్కరించేందుకు, పుదుచ్చేరిలోని వారసత్వ ప్రదేశం, 1826లో ఏర్పాటు చేసిన బొటానికల్ పుదుచ్చేరి గార్డెన్ లో క్లీన్-అప్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఉద్యానవనం ఉష్ణమండల పొడి సతత హరిత అడవులు, కోరమాండల్ తీరాలలోని అంతరించిపోతున్న, హాని కలిగించే, స్థానిక జాతులకు ఆతిథ్యం ఇస్తుంది. లైఫ్ థీమ్‌పై, ఎన్‌సిఎస్‌సిఎం శాస్త్రవేత్తలు బొటానికల్ గార్డెన్ చుట్టూ ప్రకృతి నడకను నిర్వహించారు మరియు 15 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను, ఎక్కువగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను 100 కిలోల ఆర్గానిక్ చెత్తను, ఎక్కువగా మొక్కల చెత్తను సేకరించి బొటానికల్ గార్డెన్‌లోని కంపోస్ట్ పిట్‌లో పారవేసారు. అవగాహన కోసం, శాస్త్రవేత్తలు సాంప్రదాయ జ్ఞాన ప్రాముఖ్యత, చారిత్రక వృక్షజాలం, వారసత్వ చెట్లను సంరక్షించడం, పట్టణ పచ్చదనం, శక్తి నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం దీనిలో భాగం. అలాగే మిషన్‌లో భాగంగా జీవనశైలి స్థిరమైన అంశాన్ని అనుసరించడం వంటి వాటిపై 300 మంది సందర్శకులు, ఉద్యానవన అధికారులకు శిక్షణ ఇచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను తగ్గించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకం, బాధ్యతాయుతమైన పర్యాటకం, మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం మరియు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థులు బొటానికల్ గార్డెన్ సందర్శకులకు వారి పర్యావరణం, ఆవాసాలు ప్రకృతికి అనుగుణంగా జీవించాల్సిన అవసరం గురించి సమగ్రంగా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, పాల్గొనేవారు చెత్తను వేయకుండా ప్లాస్టిక్ కాలుష్యం విపత్తుకు వ్యతిరేకంగా లైఫ్ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్‌లో ప్లకార్డులు, కరపత్రాలు ప్రదర్శించారు. ఎన్‌సిఎస్‌సిఎం శాస్త్రవేత్తలు మిషన్ లైఫ్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ (ఎన్ఐహెచ్ఈ ) సిక్కిం ప్రాంతీయ కేంద్రం నిన్న సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లోని పాంగ్‌తాంగ్‌లో “మిషన్ లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (లైఫ్)” అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రచారం లక్ష్యం i) మిషన్ లైఫ్‌పై పాల్గొనేవారికి అవగాహన కల్పించడం, ii) యువ మనస్సులను లైఫ్ థీమ్‌లతో సమకాలీకరించడం, iii) పర్యావరణ అనుకూల అలవాట్లపై జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. సుస్థిర ఆహార వ్యవస్థ కోసం వర్మీ కంపోస్టింగ్, ఔషధ మొక్కల పెంపకం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మొత్తం 40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు పాల్గొని లైఫ్ ప్రతిజ్ఞ చేశారు.
******
(Release ID: 1925103)
Visitor Counter : 190