వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

డబ్ల్యూటిఓ సంస్కరణలపై కలిసి పనిచేయడానికి నిబద్ధతను వ్యక్తం చేసిన భారతదేశం, ఐరోపా సంఘం (ఈయు)


అన్ని సమస్యలపై ఏకీకరణను కనుగొనడం ద్వారా భారత్-ఈయూ
ఎఫ్టిఏ చర్చలను వేగవంతం చేయాలని నొక్కిచెప్పిన శ్రీ గోయల్, శ్రీ డోంబ్రోవ్‌స్కిస్

వాణిజ్య, పెట్టుబడి పటిష్టమైన సరఫరా వ్యవస్థ వర్కింగ్ గ్రూప్ 3 కి
ఉమ్మడిగా అధ్యక్షత వహించిన శ్రీ గోయల్, శ్రీ డోంబ్రోవ్‌స్కిస్

Posted On: 16 MAY 2023 12:11PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్,  ప్రజల కోసం పనిచేసే ఆర్థిక వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న యూరోపియన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, యూరోపియన్ వాణిజ్య కమిషనర్ మిస్టర్ వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్  పలు వాణిజ్య, ఆర్థిక అంశాలపై చర్చించారు. అన్ని సమస్యలపై ఏకీకృత విధానాన్ని కనుగొనడానికి  కొనసాగుతున్న భారతదేశం-ఈయూ ఎఫ్టిఏ చర్చలను వేగవంతం చేయవలసిన అవసరం గురించి సమాలోచనలు జరిపారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) తొలి మంత్రివర్గ సమావేశం సందర్భంగా నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో దీనిపై చర్చించారు. ఈ సమావేశానికి ఇరు పక్షాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

ద్వైపాక్షిక చర్చల సందర్భంగా నాయకులు ఇరుపక్షాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం, నియమ-ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థల పట్ల తమ నిబద్ధతతో అనుబంధం మరింత లోతుగా ఉండడానికి  కలిసి పని చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇరువైపులా ఆర్థిక వ్యవస్థలు, ఉపాధికి తోడ్పడే సమతుల్య, అర్థవంతమైన ఫలితాల కోసం మార్కెట్ యాక్సెస్‌తో సహా పరస్పర సున్నితత్వాలను తగిన పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తర్వాత అన్ని సమస్యలపై కన్వర్జెన్స్‌ని కనుగొనడం ద్వారా కొనసాగుతున్న ఎఫ్టీఏ చర్చలను వేగవంతం చేయవలసిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.

వివాద పరిష్కార యంత్రాంగానికి సంబంధించిన సమస్యలు, వ్యవసాయం, చేపల పెంపకంపై రాయితీలు, ఈ కామర్స్ మారటోరియం అలాగే దేశీయ చట్టాలతో సహా డబ్ల్యూటిఓ సంస్కరణల కోసం ఉమ్మడి ప్రాధాన్యతలపై కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను ధృవీకరించాయి. భారతదేశం, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లక్షలాది మందికి జీవనోపాధి, ఆహార భద్రతకు మద్దతునిచ్చే ఏకాభిప్రాయ-ఆధారిత పరిష్కారాలను అనుసరించడానికి వారి ఉమ్మడి లక్ష్యాలను రూపొందించవలసిన అవసరాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. తమ ఉమ్మడి ప్రయత్నాలు రాబోయే డబ్ల్యుటిఓ మంత్రుల సమావేశంలో అర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశం తర్వాత వర్కింగ్ గ్రూప్ 3 వాటాదారుల సమావేశం శ్రీ పియూష్ గోయల్,  శ్రీ వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్‌ల ఉమ్మడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భారతదేశం, ఈయూ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటాదారులు ఉన్నారు. వర్కింగ్ గ్రూప్ 3 వాణిజ్యం, పెట్టుబడి, స్థితిస్థాపక సరఫరా గొలుసులపై దృష్టి పెడుతుంది. ఈయూ వైపు బిజినెస్ యూరప్, డిజిటల్ యూరప్, ఫుడ్ డ్రింక్స్ యూరప్, కోపా-కోగేకా, ఈఎఫ్పిఐఏ, ఏసిఈఏ వంటి ప్రధాన యూరోపియన్ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వ్యక్తిగతంగా సమావేశానికి హాజరైన భారతీయ వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందం రసాయనాలు, మెటల్స్, టెక్స్‌టైల్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టీల్‌తో సహా రంగాలకు ప్రాతినిధ్యం వహించగా, వ్యవసాయ-ఆహార పరిశ్రమ, సముద్ర/లాజిస్టిక్స్ వంటి ఇతర రంగాల ప్రతినిధులు వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. 

***



(Release ID: 1924688) Visitor Counter : 113


Read this release in: Urdu , Marathi , Hindi , Tamil