రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్ లాజిస్టిక్స్ సెమినార్ లాజిసెమ్-23
Posted On:
16 MAY 2023 5:05PM by PIB Hyderabad
'లీవరేజ్ ఎమర్జింగ్ గ్లోబల్ సప్లై చైన్ టు ఎన్‌హాన్స్ లాజిస్టిక్స్ కేపబిలిటీస్ వైల్ ఎబ్జార్బింగ్ డిస్‌రప్షన్స్' అనే అంశంపై నేషనల్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ సెమినార్ 'లాజిసెమ్-23' జరిగింది. ఈ నెల 16వ తేదీన న్యూదిల్లీలోని ఏఎఫ్ ఆడిటోరియంలో ఈ సదస్సు జరిగింది. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సదస్సును ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు.
"పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులు క్లిష్టంగా మారాయి, పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. రక్షణ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. ఐఏఎఫ్, తన పోరాట పటిమను అత్యుత్తమ స్థాయిలో కొనసాగించడానికి కీలకమైన విడిభాగాలు, పరికరాలు, సేవల కోసం ప్రపంచ సరఫరాల గొలుసులపై ఎక్కువగా ఆధారపడుతోది. కొవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ వివాదం, వాణిజ్య అడ్డంకులు, సుంకం యుద్ధాలు, పర్యావరణహిత విధానాలు వంటి చాలా విభిన్న అంతరాయాలను ఇటీవలి కాలంలో ప్రపంచం చూసింది. ఇలాంటి సందర్భాలు సరఫరా గొలుసుల్లోని లోపాలను బయటపెట్టాయి. అటువంటి అంతరాయాలను తగ్గించడానికి & లాజిస్టిక్స్ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి డిజిటలీకరణ, స్వయంచాలితం, సమాచార విశ్లేషణ వంటి కొత్త పరిజ్ఞానాలను ఐఏఎఫ్ ఉపయోగించుకోవాలి. సెమినార్‌లో జరిగిన చర్చలు, ఆలోచనలు రవాణా వ్యవస్థకు కలిగే అంతరాయాలను చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని నేను విశ్వసిస్తున్నాను" అని తన ప్రసంగంలో చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ చెప్పారు.
ఈ సదస్సు మూడు సెషన్లుగా జరిగింది. దేశీయ విమానయాన పరిశ్రమ భవిష్యత్ అవకాశాలు, సరఫరా గొలుసు & గోదాంల నిర్వహణలో ఆధునిక పద్ధతులు, జీఈఎం ద్వారా ప్రజా సేకరణలు వంటి అంశాలపై ప్రధాన వక్తలు చర్చించారు. ప్రజా, సైనిక రవాణాదార్ల మధ్య ఆలోచనల మార్పిడికి ఒక ఆదర్శవంతమైన వేదికను ఈ సదస్సు అందించింది. ఐఏఎఫ్ వ్యాప్తంగా ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం జరిగింది.
***
(Release ID: 1924685)
Visitor Counter : 151