కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సంచార్ సాథీ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్

Posted On: 16 MAY 2023 5:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ లో వినియోగదారుల భద్రత, రక్షణ అంతర్భాగం.  ఈ దార్శనికతను నెరవేర్చే దిశగా

కమ్యూనికేషన్లు, రైల్వేలు ఎలక్ట్రానిక్స్ ,  ఐటి మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ రోజు సంచార్ సాథీ పోర్టల్ ను

ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి విజన్ ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ రోజు మూడు సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

 

1.సి ఇ ఐ ఆర్  (సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) – దొంగిలించబడిన/పోయిన మొబైల్ లను బ్లాక్ చేయడం కోసం.

 

2.మీ మొబైల్ కనెక్షన్లను తెలుసుకోండి - మీ పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ కనెక్షన్లను తెలుసుకోవడానికి.

 

3.ఏఎస్ టి ఆర్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్ స్క్రైబర్ వెరిఫికేషన్) - మోసపూరిత చందాదారులను గుర్తించడానికి.

 

మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేయడం ద్వారా గుర్తింపు ను దొంగిలించడం, ఫోర్జరీ కేవైసీ, బ్యాంకింగ్ మోసాలు వంటి వివిధ మోసాలు జరుగుతాయని మంత్రి చెప్పారు. ఇలాంటి మోసాలను నిరోధించడానికి ఈ పోర్టల్ ను రూపొందించారు. ముసాయిదా టెలికాం బిల్లులో వినియోగదారుల భద్రత కూడా ఒక ముఖ్యమైన భాగమని ఆయన అన్నారు.

 

సంచార్ సాథీ పోర్టల్ ద్వారా 40 లక్షలకు పైగా మోసపూరిత కనెక్షన్లను గుర్తించామని, ఇప్పటివరకు 36 లక్షలకు పైగా కనెక్షన్లను డిస్ కనెక్ట్ చేశామని తెలిపారు.

 

వినియోగదారులు పోర్టల్ ను సందర్శించి సేవలను పొందాలని శ్రీ అశ్విని వైష్ణవ్ కోరారు. పోర్టల్ లింక్ (https://sancharsaathi.gov.in).

 

సంచార్ సాథీ పోర్టల్ గురించి క్లుప్తంగా జతచేయబడింది.

 

సంచార్ సాథీ కార్యక్రమం గురించి సంక్షిప్తంగా…

 

117 కోట్ల చందాదారులతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఎకోసిస్టమ్ గా అవతరించింది. కమ్యూనికేషన్ తో పాటు బ్యాంకింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఈ-లెర్నింగ్, హెల్త్ కేర్, ప్రభుత్వ సేవలను పొందడం వంటి వాటి కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

 

అందువల్ల గుర్తింపు ను దొంగిలించడం ఫోర్జరీ కేవైసీ, మొబైల్ పరికరాల దొంగతనం, బ్యాంకింగ్ మోసాలు వంటి వివిధ మోసాల నుండి వినియోగదారులను రక్షించడం చాలా ముఖ్యం.

 

వినియోగదారులను రక్షించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ‘సంచార్ సాథీ’ పౌర  కేంద్రీకృత ( సిటిజన్ సెంట్రిక్ ) పోర్టల్ ను అభివృద్ధి చేసింది. ఇది పౌరులను కింది విధంగా అనుమతిస్తుంది:

 

*తమ పేర్లపై నమోదైన కనెక్షన్లను తనిఖీ చేయడం

*మోసపూరిత లేదా అవసరం లేని కనెక్షన్ లను నివేదించడం

*దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను బ్లాక్ చేయడం

*మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఐఎంఇఐ వాస్తవికతను తనిఖీ చేయడం

 

మొత్తం వ్యవస్థను టెలికాం డిపార్ట్ మెంట్ అంతర్గతంగా రూపొందించింది.  ఇందులో ఈ క్రింది మాడ్యూల్స్ ఉన్నాయి.

 

సెంట్రలైజ్డ్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్):

 

*ఏదైనా మొబైల్ పరికరం దొంగిలించబడినా లేదా పోయినా, వినియోగదారుడు ఐఎమ్ఇఐ నంబర్లను పోర్టల్ లో సమర్పించవచ్చు.

 

*పోలీస్ కంప్లైంట్ కాపీతో పాటు యూజర్ సమర్పించిన సమాచారం వెరిఫై చేయబడుతుంది.

 

*ఈ వ్యవస్థ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ , లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో అనుసంధానించబడి ఉంటుంది.

 

*సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను భారతీయ నెట్ వర్క్ లలో ఉపయోగించకుండా సిస్టం నిరోధిస్తుంది.

 

*ఎవరైనా దొంగిలించిన పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే, ఈ వ్యవస్థ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలను పరికరాన్ని గుర్తించడానికి అనుమతిస్తుంది.

 

*దొంగిలించిన పరికరాన్ని రికవరీ చేసినప్పుడు, వినియోగదారుడు పోర్టల్ లో పరికరాన్ని అన్ లాక్ చేయవచ్చు.

 

*దొంగిలించబడిన/ పోగొట్టుకున్న మొబైల్స్ వాడకాన్ని సిస్టమ్ నిరోధిస్తుంది.

 

*ఇది భారతీయ నెట్ వర్క్ లలో ఉపయోగించే సరికాని లేదా నకిలీ ఐఎమ్ ఇఐ లు ఉన్న మొబైల్ పరికరాలను నిరోధిస్తుంది.

 

మీ మొబైల్ గురించి తెలుసుకోండి

 

*పౌరులు తమ మొబైల్ పరికరం ఐఎమ్ఇఐ వాస్తవికతను తనిఖీ చేయడానికి ఇది సహాయపడుతుంది.

 

టెలికం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్

(టీ ఎ ఎఫ్ సి ఒ పి)

 

*కాగితం ఆధారిత డాక్యుమెంట్లను ఉపయోగించి వినియోగదారుడు అతడు/ ఆమె పేరిట తీసుకున్న మొబైల్ కనెక్షన్ల సంఖ్యను తనిఖీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

*యూజర్ తన మొబైల్ నెంబర్ ను పోర్టల్ లో ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధ్రువీకరిస్తాడు.

 

*కాగితం ఆధారిత పత్రాలను (పేపర్ ఆధారిత ఆధార్, పాస్ పోర్ట్ మొదలైనవి) ఉపయోగించి ఆమె పేరిట తీసుకున్న మొత్తం కనెక్షన్లను సిస్టమ్ చూపిస్తుంది.

 

*మోసపూరిత కనెక్షన్లను నివేదించడానికి ఈ వ్యవస్థ వినియోగదారులను అనుమతిస్తుంది.

 

*అవసరం లేని కనెక్షన్లను బ్లాక్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.

 

*వినియోగదారులు నివేదించిన తర్వాత, సిస్టమ్ రీ-వెరిఫికేషన్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. కనెక్షన్లు రద్దు చేయబడతాయి.

 

ఎ ఎస్ టి ఆర్  (టెలికాం సిమ్ సబ్

స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్)

 

*నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సంపాదించిన మొబైల్ కనెక్షన్లను సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారు.

 

*ఈ బెడదను అరికట్టడానికి, మోసపూరిత / ఫోర్జరీ పత్రాలతో జారీ చేసిన సిమ్ లను గుర్తించడానికి టెలికాం డిపార్ట్ మెంట్ ఏఐ ఆధారిత టూల్ - ఎఎస్ టిఆర్ ను అభివృద్ధి చేసింది.

 

*ఎ ఎస్ టి ఆర్ ముఖ గుర్తింపు ,డేటా విశ్లేషణ వంటి వివిధ పద్ధతులను ఉపయోగించింది.

 

*మొదటి దశలో పేపర్ ఆధారిత కె వై సి తో ఉన్న కనెక్షన్ లను విశ్లేషించారు.

 

ఎ ఎస్ టి ఆర్ తో విజయం

 

*తొలి దశలో 87 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లపై విశ్లేషణ చేశారు.

 

*ఇంత పెద్ద డేటా ప్రాసెసింగ్ కోసం పరమ్-సిద్ధి సూపర్ కంప్యూటర్ ను ఉపయోగించారు.

 

*వందలాది కనెక్షన్లు పొందడానికి ఓకే ఫోటోను ఉపయోగించిన అనేక కేసులు కనుగొన్నారు.

 

*మొత్తం 40.87 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లను గుర్తించారు.

 

*వెరిఫికేషన్ అనంతరం ఇప్పటికే 36.61 లక్షల కనెక్షన్లను డిస్ కనెక్ట్ చేశారు. మిగిలినవి ప్రాసెస్ లో ఉన్నాయి.

 

*ఇలాంటి మొబైల్ కనెక్షన్లను విక్రయించిన 40,123 పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్)లను సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు.  భారతదేశం అంతటా 150 కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

 

*డిస్‌కనెక్ట్ చేయబడిన నంబర్‌ల వివరాలు బ్యాంకులు, పేమెంట్ వాలెట్‌లు ,సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో వారి ఖాతాలతో ఈ నంబర్‌లను నిలిపివేయడం కోసం భాగస్వామ్యం చేయబడ్డాయి.

******



(Release ID: 1924617) Visitor Counter : 301