వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యాపారం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు..సంబంధాలను నిర్మించడం, భాగస్వామ్యం, సహకారం, నేర్చుకోవడం, సాంకేతికత మరియు ఆవిష్కరణలకు సంబంధించినది: శ్రీ గోయల్


విలువ గొలుసులోని వాటాదారులందరినీ సంపన్నులుగా చేసేలా ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్య శ్రేయస్సుపై దృష్టి పెట్టండి: శ్రీ గోయల్

కెనడాలోని వినియోగదారులు మరియు వ్యాపారాల విశ్వాసం మరియు నమ్మకాన్ని సంపాదించడానికి భారతీయ వ్యాపారాలు నాణ్యత, స్థాయి, డిజైన్, ప్యాకేజింగ్ మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి: శ్రీ గోయల్

భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ప్రదర్శించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలతో సహకరించడానికి 'వరల్డ్ ఫుడ్ ఇండియా':శ్రీ గోయల్

ఆహార పరిశ్రమ ప్రభుత్వ ప్రధాన అంశాల్లో ఉంది. వ్యాపారాలు వ్యవసాయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి మరియు వ్యవసాయ కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందిస్తాయి:శ్రీ గోయల్

Posted On: 11 MAY 2023 2:13PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. వ్యాపారం అనేది కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాకుండా సంబంధాలు, భాగస్వామ్యం, సహకారం, అభ్యాసం, సాంకేతికత మరియు ఆవిష్కరణలను నిర్మించడం అని అన్నారు. కెనడాలోని టొరంటో సియల్-2023 సందర్భంగా భారతీయ కంపెనీలు మరియు కెనడియన్ దిగుమతిదారులతో వ్యవసాయ మరియు ఆహార ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన వాణిజ్య మరియు పెట్టుబడి ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్య శ్రేయస్సుపై దృష్టి సారించాలని మంత్రి అన్నారు.

కెనడా-భారత్ భాగస్వామ్యాన్ని జరుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని రెండు దేశాల మధ్య వ్యాపార విస్తరణ మరియు భాగస్వామ్య వృద్ధికి భారీ అవకాశం ఉందని శ్రీ గోయల్ అన్నారు. ఆహారోత్పత్తుల విలువ జోడింపు ప్రాధాన్యతా అంశం అని ఆయన అన్నారు. కెనడాలోని వినియోగదారులు మరియు వ్యాపారాల విశ్వాసం మరియు నమ్మకాన్ని సంపాదించడానికి భారతీయ వ్యాపారాలు నాణ్యత, స్కేల్, డిజైన్, ప్యాకేజింగ్ మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని శ్రీ గోయల్ నొక్కిచెప్పారు.

భారతదేశాన్ని ప్రపంచానికి ప్రదర్శించిన సియల్ 2023లో భారతీయ వ్యాపార సంస్థలు పాల్గొనడాన్ని మంత్రి అభినందించారు. భారతదేశం లేదా విదేశాలలో ఆహార పరిశ్రమలో అతిపెద్ద మరియు పెద్ద వాణిజ్య ప్రదర్శనను నిర్వహించడం, అన్ని ఖండాల్లో మనం అందించే ఉత్తమమైన వాటిని ప్రదర్శించడం ముందున్న సవాలు అని ఆయన అన్నారు. సియల్ 2023 ఆహార పరిశ్రమ  ఉత్పత్తుల నాణ్యత మరియు మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి అవకాశాన్ని అందించిందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. నవంబర్ 2023లో 'వరల్డ్ ఫుడ్ ఇండియా' అనేది భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ప్రదర్శించగల & ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలతో సహకరించగల వేదికగా ఉపయోగపడుతుందని గోయల్ చెప్పారు.జీ20 అధ్యక్ష హోదాలో అందరినీ చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం మరియు వ్యాపార సంస్థలు ఈ విషయంలో తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆహార పరిశ్రమ ఉన్నత స్థాయి, అధిక లాభాలు మరియు అధిక వృద్ధికి సూర్యోదయ రంగం అని మంత్రి అన్నారు. రైతుల ఉత్పత్తులకు విలువను జోడించడం మరియు పంటలు, పండ్లు, కూరగాయల వైవిధ్యతను ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో వ్యవసాయాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నందున ఇది ప్రభుత్వం మరియు వ్యాపారాల దృష్టి కేంద్రంగా ఉందని ఆయన అన్నారు. వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధిత జీవనోపాధిలో నిమగ్నమైన కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని తెస్తుంది కాబట్టి భారతదేశ వృద్ధి కథకు ఈ పరిశ్రమ యొక్క సహకారం అపారమైనది మరియు విలువైనది అని శ్రీ గోయల్ అన్నారు.

ఈ రంగంలో భారతదేశం-కెనడాల ద్వైపాక్షిక వాణిజ్యంలో బహుళ వృద్ధి సామర్థ్యం ఉందని మంత్రి హైలైట్ చేశారు. ఆహార పరిశ్రమ కెనడాలోకి భారతదేశంలోని ఉత్తమమైన వాటిని తీసుకురాగలిగిందని కెనడాలో తమ వ్యాపారాల విస్తరణలో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తుందని గోయల్ చెప్పారు. భారతదేశం నుండి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతున్నాయని అయితే ఈ ఉత్పత్తుల ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

భారతదేశం మరియు ప్రపంచంలోని వినియోగదారులలో మిల్లెట్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని ముఖ్యంగా అధిక శక్తి మరియు అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవాల్సిన యువతలో మిల్లెట్ యొక్క పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలను హైలైట్ చేయడం చాలా ముఖ్యం అని గోయల్ చెప్పారు. భారతీయ ఆహార పరిశ్రమను ప్రోత్సహించడంలో మిల్లెట్లు గేమ్ ఛేంజర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మినుము వడ్డనను మంత్రి కొనియాడారు.

కెనడాలోని టొరంటోలో నిన్న కెనడియన్ కంపెనీలతో జరిగిన మరో సమావేశంలో శ్రీ పియూష్ గోయల్ కెనడా నుండి ప్రజలను మరియు వ్యాపారాలను భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.వాళ్లు ఇప్పుడు సందర్శించబోయే భారతదేశం నిజంగా నవ భారతమేనని ఆయన అన్నారు. భారతదేశ జీ20 అధ్యక్షత క్రింద దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న బి20 సెషన్స్ మరియు సెక్టోరల్ ఎంగేజ్‌మెంట్‌లలో చేరాలని మంత్రి వారిని ఆహ్వానించారు. కెనడియన్ కంపెనీలను భారతదేశంలో బోర్డు సమావేశాలు నిర్వహించాలని కూడా ఆయన ప్రోత్సహించారు.

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు స్థిరంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కూడా అని గోయల్ అన్నారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశం ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, భారత వృద్ధి ప్రయాణంలో భాగం కావాలని కెనడా వ్యాపారాలను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.

 

 

***



(Release ID: 1923660) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Punjabi