గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆర్ఇఆర్ఎ అమలులో దీర్ఘ పురోగతిని సాధించాం, ఇంకా చేయవలసింది చాలా ఉంది - శ్రీ హర్దీప్ ఎస్. పురి
ఆర్ఇఆర్ఎ కింద ఏర్పాటు చేసిన కేంద్ర సలహా మండలి 4వ సమావేశ నిర్వహణ
Posted On:
09 MAY 2023 6:32PM by PIB Hyderabad
ఆర్ఇఆర్ఎ (RERA) అమలులో సాధించిన పురోగతిని, దాని విజయ గాథలను గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు & పెట్రోలియం- సహజవాయువుల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పురి అభినందించారు. ఈ పద నిర్ణేత చట్టపు పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు చేయవలసింది ఇంకా చాలా ఉందని ఆయన అన్నారు.
గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి అధ్యక్షతన ఆర్ఇఆర్ఎ కింద ఏర్పాటైన కేంద్ర సలహా మండలి (సిఎసి) 4వ సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. గృహ కొనుగోలుదారులు& డెవలపర్ల అసోసియేషన్ల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత సంస్థలకు చెందిన అప్పిలేట్ ట్రిబ్యూనళ్ళ చైర్ పర్సన్లు & సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్ఇఆర్ఎ అమలుకు సంబంధించిన వివిధ సమస్యలు, రెగ్యులేటరీ అథారిటీలు జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోవడం, నిర్మాణ కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలు, ఆందోళనలు, వారసత్వంగా ఆగిపోయిన ప్రాజెక్టుల సమస్యలు, ఆర్ఇఆర్ఎలోని అంశాలను పలచన చేయడం, ఆర్ఇఆర్ఎ కోసం అవగాహనా ప్రచారం వంటి అంశాలను ఈ సమావేశంలో వివరణాత్మకంగా చర్చించారు.
తమ మూడవ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వారసత్వంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పరిశీలించి, సూచనలు చేయడం, సమయానుకూలంగా గృహ కొనుగోలుదారులకు ఇళ్ళను అప్పగించాలన్న లక్ష్యంతో జి-20 షెర్పా అయిన శ్రీ అమితాబ్‌కాంత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ కమిటీకి సంబంధించిన రెండు సమావేశాలను 24 ఏప్రిల్, 2023న, 8 మే 2023న నిర్వహించినట్టు కౌన్సిల్ పేర్కొంది. వారసత్వంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆచరణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టి, ఫలితంగా, గృహ కొనుగోలుదారులకు గృహ యూనిట్లను అప్పగించేందుకుశ్రీ అమితాబ్ కాంత్ క్రియాశీలక నాయకత్వంలో కమిటీ సూచించగలదని కౌన్సిల్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
అంతేకాకుండా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిఈలు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంలో, విజయవంతంగా పని చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు సంబంధించి కొన్ని రాష్ట్రాల ఉత్తమ ఆచరణలు, పద్ధతులపై కూడా కౌన్సిల్ చర్చించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్ జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధవంతంగా, వేగవంతంగా అమలు చేయవలసిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఉత్తమ పద్ధతులను సంకలనం చేసి, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు, ఇతర వాటాదారులకు పరిశీలన కోసం పంపాలని నిర్ణయించడం జరిగింది. ఇంకా, ఆర్ఇఆర్ఎకు సంబంధించిన అంశాలను పలచన చేయడం గురించి కూడా చర్చించారు. కోర్టు విచారణలో ఉందని, గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల ఆదేశాల మేరకు తదుపరి అవసర చర్యలను తీసుకుంటుందని కౌన్సిల్ పేర్కొంది. వాటాదారులందరిలో మరింత అవగాహనను పెంచేందుకు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్ఎఆర్ఇడిసిఒ) / కన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేన్లు (సిఆర్ఇడిఎఐ)/ ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్‌పిసిఇ) సహకారంతో సదస్సు/ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించవచ్చని కౌన్సిల్ సూచించింది. వర్క్‌షాపులు/ అవగాహనా ప్రచారాలను నిర్వహించడంలో ఆలిండియా ఫోరం ఆఫ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్ (ఎఐఎఫ్ఒఆర్ఇఆర్ఎ)ను కూడు కలుపుకునే అవకాశాన్ని కూడా అన్వేషించాలని కూడా నిర్ణయించారు.
రియల్ ఎస్టేట్ (నియంత్రణ & అభివృద్ధి) చట్టం, 2016 (ఆర్ఇఆర్ఎ) రియల్ ఎస్టేట్ రంగాన్ని సంస్కరించడం, మరింత పారదర్శకతను ప్రోత్సహించడం, పౌరులు కేంద్రంగా, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ, తద్వారా గృహ కొనుగోలుదారులను శక్తి వంతం చేయడం దిశగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. గృహ కొనుగోలుదారుల హక్కులను & ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 1923018)
Visitor Counter : 154