రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

తన వారసత్వం, సాంకేతిక పురోగతిని ప్రదర్శించే భారత వైమానిక దళ వారసత్వ కేంద్రాన్ని చండీగఢ్‌లో ప్రారంభించిన రక్షణ మంత్రి


దేశ సేవలో ఐఏఎఫ్ సిబ్బంది త్యాగాలకు, అమూల్యమైన సహకారానికి
ఇది నివాళి అని పేర్కొన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ఈ కేంద్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది: ఆర్‌ఎం

Posted On: 08 MAY 2023 5:08PM by PIB Hyderabad

రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2023 మే 8న చండీగఢ్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెరిటేజ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఐఏఎఫ్ గొప్ప చరిత్ర, వారసత్వానికి ప్రతిరూపమైన ఈ కేంద్రం, కళాఖండాలు, కుడ్యచిత్రాలు ఉండడంతో పాటు వైమానిక దళాలు ఆవిర్భావం నుండి పరిణామ క్రమాన్ని వివరించే ప్రదర్శన ఉంది. ఇది ఐఏఎఫ్ వీరోచిత పనులను, విమానం/పరికరాలలో దేశం సాంకేతిక పురోగతిని ప్రదర్శిస్తుంది.

సెంటర్‌లోని ముఖ్యాంశాలలో ఒకటి సిమ్యులేటర్‌ల శ్రేణి. ఇది సందర్శకులను ఐఏఎఫ్ లో ఎగిరే ఐకానిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒక ప్రత్యేకతను ప్రతిబింబించేలా అవకాశం ఇస్తుంది. కేంద్రం ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది,  ఐఏఎఫ్   పాల్గొన్న యుద్ధ ప్రచారాలకు అంకితమైన ఎన్‌క్లోజర్‌లను కూడా కలిగి ఉంది. దేశాన్ని రక్షించడంలో  ఐఏఎఫ్   పోషించిన కీలక పాత్ర గురించి తెలుసుకోవడానికి సందర్శకులకు ఇవి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి.

ప్రారంభోత్సవం తర్వాత తన ప్రసంగంలో, రక్షణ శాఖ మంత్రి హెరిటేజ్ సెంటర్‌ను ఐఏఎఫ్ లో పనిచేసిన వారందరి ధైర్యం, అంకితభావానికి నిదర్శనంగా పేర్కొన్నారు; వారి త్యాగానికి నివాళి, దేశాన్ని రక్షించడంలో వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తుచేస్తుంది. 1948 యుద్ధం, 1961, 1962, 1965, 1971 గోవా విముక్తి యుద్ధం, కార్గిల్ యుద్ధాలలో ఐఏఎఫ్ సహకారాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. శక్తి  , నిబద్ధత, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు. 

1971 యుద్ధంపై శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ యుద్ధ సమయంలో మూడు సర్వీసులు ప్రదర్శించిన జాయింట్‌మెన్‌షిప్, ఏకీకరణ నిబద్ధత అపూర్వమైనవనిఅసాధారణమైనవి అని  పేర్కొన్నారు. యుద్ధం ఏ భూమి కోసమో, అధికారం కోసమో జరగలేదని, మానవత్వం, ప్రజాస్వామ్యం కోసమని ఆయన అన్నారు. మన వ్యూహాల బలంతో యుద్ధంలో విజయం సాధించడం,  అక్కడ ఎలాంటి రాజకీయ నియంత్రణను విధించకపోవడం భారతదేశ బలాలతో పాటు దాని విలువలు, సాంస్కృతిక దాతృత్వాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు, కేంద్రం ఈ శౌర్యం,నిబద్ధతకు ప్రతిబింబం అని అన్నారు.

కేంద్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రక్షా మంత్రి పేర్కొన్నారు. ఐఏఎఫ్ గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందని, దానిని సంరక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ కేంద్రం ఐఏఎఫ్ రక్షణకు  సాయుధ బలగాల స్ఫూర్తి యువతను ప్రేరేపించడానికి ఒక ముఖ్యమైన సాధనంగా మారుతుందని ఆయన అన్నారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ బన్వరీలాల్ పురోహిత్,  ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌదరి తదితరులున్నారు.

***(Release ID: 1922714) Visitor Counter : 89