ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సైబర్ సురక్షిత్ భారత్ కింద 36వ సిఐఎస్‌ఓ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్‌ఇజీడీ

Posted On: 08 MAY 2023 5:27PM by PIB Hyderabad

కెపాసిటీ బిల్డింగ్ పథకం కింద  నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఇజీడీ) 36వ సిఐఎస్‌ఓ డీప్‌ డైవ్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మే 8, 2023  నుండి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో సెంట్రల్ లైన్ మినిస్ట్రీస్ మరియు రాష్ట్రాలు/యుటిల నుండి 24 మంది పాల్గొంటున్నారు.

ఈ ఐదు రోజుల ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కేంద్ర మరియు రాష్ట్ర/కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాల నుండి నియమించబడిన సిఐఎస్‌ఓల కోసం రూపొందించబడింది. వీరిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా కంపెనీలు, పోలీసు మరియు భద్రతా దళాల సాంకేతిక విభాగాలు, సిటిఓలు మరియు సాంకేతిక/పిఎంయు బృందాల సభ్యులతో పాటు సబార్డినేట్ ఏజెన్సీలు/పిఎస్‌యులు అలాగే సంబంధిత సంస్థలలో ఐటీ వ్యవస్థల భద్రతకు బాధ్యత వహించే అధికారులు ఉన్నారు.

సైబర్ సురక్షిత్ భారత్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) కార్యక్రమం. ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడం మరియు అన్ని ప్రభుత్వ విభాగాలలో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (సిఐఎస్‌ఓలు) మరియు ఫ్రంట్‌లైన్ ఐటీ అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం అనే లక్ష్యంతో రూపొందించబడింది. ఎందుకంటే పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన భద్రతా చర్యలను నిర్ధారించడం కోసం  సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించుకోవాలి మరియు భవిష్యత్తులో  సైబర్-దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

డీప్-డైవ్ శిక్షణ ప్రత్యేకంగా సిఐఎస్‌ఓలకు సైబర్ దాడులను సమగ్రంగా మరియు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, రక్షణకు సంబంధించినతాజా సాంకేతికతలు మరియు వ్యక్తిగత సంస్థలకు మరియు పౌరులకు ఒక స్థితిస్థాపక ఇ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  ప్రయోజనాలను అనువదించడం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఈ శిక్షణ చట్టపరమైన నిబంధనలకు సమగ్ర వీక్షణను అందించడం, సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో విధానాలను రూపొందించడానికి మరియు నిర్దిష్ట సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి సిఐఎస్‌ఓలను అనుమతిస్తుంది.

కార్యక్రమాన్ని ఎన్‌ఐసి బిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్  శ్రీ ఆర్‌ఎస్ మణి మరియు ఎన్‌ఇజీడి, ఎంఇఐటివై, ఐఐపిఏ సీనియర్ అధికారులు ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం పరిశ్రమ, విద్యాసంస్థ మరియు ప్రభుత్వం నుండి విషయ నిపుణులను ఒకచోట చేర్చి సైబర్ భద్రతకు సంబంధించిన కీలక డొమైన్ సమస్యలు, గవర్నెన్స్ రిస్క్, కంప్లయన్స్, భారతదేశంలోని సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల ల్యాండ్‌స్కేప్, ఎండ్ పాయింట్ & డిజిటల్ వర్క్‌ప్లేస్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ మరియు డేటా సెక్యూరిటీ, సిసిఎంపి & ఇన్సిడెంట్ రెస్పాన్స్, మొబైల్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ మరియు ఆడిట్, సైబర్ సెక్యూరిటీ సంబంధిత ప్రొవిజన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్ మరియు ఐఎస్ఎంఎస్ స్టాండర్డ్స్,ఐఎస్‌ఓ 27001, సెక్యూరిటీ లాగింగ్ మరియు ఆపరేషన్ & మానిటరింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంశాలపై చర్చిస్తుంది.

2018లో ప్రారంభించబడిన సిఐఎస్‌ఓ శిక్షణ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో ప్రభుత్వం మరియు పరిశ్రమల కన్సార్టియం మధ్య మొదటి-రకం భాగస్వామ్యం. జూన్ 2018 నుండి మే 2023 వరకు ఎన్ఇజీడి 1,419 కంటే ఎక్కువ సిఐఎస్‌ఓలు మరియు ఫ్రంట్‌లైన్ ఐటీ అధికారుల కోసం 36 బ్యాచ్‌ల సిఐఎస్‌ఓ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించింది.

***



(Release ID: 1922708) Visitor Counter : 128