నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 8, 2023న 200లకు పైగా జిల్లాల్లో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా ప్రధాన మంత్రి

Posted On: 05 MAY 2023 6:57PM by PIB Hyderabad

స్కిల్ ఇండియా మిషన్ కింద భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనా తీరులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) మే 8, 2023న \; ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా’ను (పీఎంఎన్ఏఎం) నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జిల్లాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. స్థానిక యువతకు సంబంధిత అప్రెంటిస్‌షిప్ శిక్షణ అవకాశాలను అందించడానికి గాను అనేక స్థానిక వ్యాపారాలు, సంస్థలను  ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో భాగం కావాలని ఆహ్వానించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు కంపెనీలు పాల్గొననున్నాయి. ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల్గొనే సంస్థలు సంభావ్య అప్రెంటిస్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. వారి అర్హతలను అక్కడికక్కడే ఎంచుకోవచ్చు. అదే సమయంలో యువత జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆసక్తికలిగిన వారు https://www.apprenticeshipindia.gov.in/ని సందర్శించడం ద్వారా మరియు తమ సమీపంలోని మేళా వివరాలను తెలుసుకోవడం మేళా కోసం నమోదు చేసుకోవచ్చు. 5వ తరగతి నుండి 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారు లేదా ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్లు లేదా డిప్లొమా హోల్డర్లు లేదా గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రెజ్యూమేల మూడు కాపీలు, అన్ని మార్క్‌షీట్లు మరియు సర్టిఫికేట్‌ల యొక్క మూడు కాపీలు, ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) మరియు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లను సంబంధిత వేదికలకు తీసుకెళ్లాలి. ఈ మేళాకు సంబంధించి వివరాలు అప్రెంటిస్‌షిప్ మేళా పోర్టల్ (http://dgt.gov.in/appmela2022/)లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అన్ని సంబంధిత పత్రాలతో వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేళా ద్వారా, అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవీఈటీ) గుర్తింపు పొందిన ధృవపత్రాలను కూడా పొందుతారు, శిక్షణా సెషన్‌ల తర్వాత వారి ఉపాధి రేటును మెరుగుపరుస్తారు.

 

 

 

ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ దేశ అభివృద్ధి మరియు వృద్ధిని నడపడానికి, పని ఆధారిత అభ్యాసానికి అవకాశం కల్పించడంలో సహాయపడటానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేర్చుకునేటప్పుడు దాని సంపాదన మోడల్ కింద యువతకు స్టైఫండ్‌తో పాటు ఎక్స్‌పోజర్ అందించబడుతుంది. ఇది అప్రెంటిస్‌ల కోసం పరిశ్రమకు గవాక్షంగా పని చేస్తుంది, ఇక్కడ వారు పరిశ్రమ-ఆధారిత శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌ను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళా అనేది భారతదేశ యువత పరిశ్రమతో అనుసంధానతను అందిచడాడానికి మరియు సంబంధిత అప్రెంటిస్‌షిప్ శిక్షణ అవకాశాలను పొందేందుకు ఒక సువర్ణావకాశం. దీనికి తోడు ఈ వ్యవస్థ నైపుణ్యం/ అప్‌స్కిల్‌ను కోరుకునే వారికి మరియు వారి కెరీర్‌లో పురోగతిని సాధించేందుకు రూపొందించబడింది.

ప్రతి నెల రెండవ సోమవారం దేశ వ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో, ఎంపిక చేయబడిన వ్యక్తులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందించబడతాయి, ఈ సమయంలో వారు కొత్త నైపుణ్యాలను పొందేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అప్రెంటీస్‌షిప్ అత్యంత స్థిరమైన మోడల్‌గా పరిగణించబడుతుంది. స్కిల్ ఇండియా మిషన్నకు  ఇది పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  అప్రెంటిస్‌షిప్ శిక్షణ ద్వారా సంవత్సరానికి 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మరియు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, పీఎంనామ్ అనేది సంస్థలు మరియు యువత భాగస్వామ్యాన్ని పెంచే ఒక చొరవ. భాగస్వామ్య సంస్థల్లో ఉన్న వివిధ అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తోంది.

*****


(Release ID: 1922266) Visitor Counter : 182