శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాజ స్థితిస్థాపక వనరుల కేంద్రాల ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాల కార్యాచరణ ప్రణాళిక పై చర్చించిన - సైడ్ ఈవెంట్

Posted On: 05 MAY 2023 6:26PM by PIB Hyderabad

సమాజ స్థితిస్థాపకత వనరుల కేంద్రాల (సి.ఆర్.ఆర్.సి.లు) పై ఐక్యరాజ్యసమితి గ్లోబల్ ఎస్.టి.ఐ. ఫోరం-2023 సైడ్ ఈవెంట్‌ లో, కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ((డి.ఎస్.టి) కార్యదర్శి మాట్లాడుతూ, భారతదేశంలో కోవిడ్ అనంతర సామాజిక-ఆర్థిక పునరుద్ధరణ కోసం దేశాల మధ్య విజ్ఞాన, శాస్త్ర, సాంకేతికతలను పంచుకునే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 

 

 

హైడ్రోజన్ ఆధారిత శక్తి, కొత్త స్థిరమైన ఇంధన వ్యవస్థలతోపాటు ఆహార భద్రతా సమస్యలను పరిష్కరించే మార్గాలపై జ్ఞానాన్ని పంచుకోవడం కోసం ఒక సమగ్ర విధానం అవసరమని డాక్టర్ చంద్రశేఖర్  నొక్కి చెప్పారు.  డి.ఎస్.టి. తో పాటు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) సంయుక్తంగా నిర్వహించిన సైడ్ ఈవెంట్‌ లో మారుతున్న వాతావరణం, జి.హెచ్.జి.లు, మహమ్మారితో పాటు, తెలియని ఇతర వ్యాధుల వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఏ.ఐ., ఇతర కొత్త సాంకేతికతలను ఒక స్థితిస్థాపక గ్రహాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చునని కూడా ఆయన తెలియజేశారు. 

 

 

మనమందరం అనిశ్చితి ప్రపంచంలో జీవిస్తున్నాము.  వ్యాధులుయుద్ధాలువాతావరణ మార్పుల సంఘటనలువంటి ఎన్నో విపత్తులను మానవ జాతి ఎదుర్కొంది.  కోవిడ్-19 మహమ్మారి దాదాపు ప్రతి దేశంలో ఆర్థికమానవ అభివృద్ధి కి విఘాతం కలిగించడంతో పాటునిరంతరం అనేక రకాల అవరోధాలను సృష్టిస్తూనే ఉంది.  పెరుగుతున్న పేదరికంఆహార భద్రతబలవంతపు స్థానభ్రంశంభౌగోళిక రాజకీయాలుఅసమానతల పెరుగుదల వంటి వివిధ అంశాలతో మొదటిసారిగా గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వరుసగా రెండు సంవత్సరాలు పడిపోయింది.  ఇది సుస్థిర అభివృద్ధి మరియు పారిస్ ఒప్పందం కోసం 2030 ఎజెండాను ఆమోదించిన తర్వాత ప్రపంచాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురాగలిగింది." అని డి.ఎస్.టి. కార్యదర్శి వివరించారు. 

 

 

అనిశ్చితులు మానవాళికి కొత్త కాదనీ, అనేక సమాజాలు ఈ అస్థిరమైన వాస్తవాలను స్వీకరించి, అవలంబించడానికి, అభివృద్ధి చెందడానికి తెలివైన మార్గాలు కనుగొన్నాయనీ, డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు.  "స్థితిస్థాపకత అనేది కఠినమైన అవస్థాపనబిల్డింగ్ కోడ్ గురించి మాత్రమే కాదు - ఇది బలమైన సామాజికకమ్యూనిటీ భాగాన్ని కూడా కలిగి ఉంది.  స్థితిస్థాపక సంఘాలు తమ సభ్యులు అనిశ్చితులను గ్రహించడానికిస్వీకరించడానికి తగిన శక్తినిస్తాయి." అని, ఆయన నొక్కి చెప్పారు.

 

 

"అటువంటి సమాజ స్థితిస్థాపకతను నిర్మించడంలో శాస్త్రసాంకేతికతఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి.  విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విభిన్న రంగాలు కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయి.  ఇది సమాజ స్థితిస్థాపకతను తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియలపై అవగాహనను మెరుగుపరుస్తుందిఆర్థికసామాజికపర్యావరణ స్థితిస్థాపకతఆవిష్కరణలను పెంపొందించడానికిసాంప్రదాయేతర వ్యక్తులను వారి ప్రయత్నాలను ఏకం చేయడానికివారి వనరులను సమాజ స్థితిస్థాపకత వైపు సమీకరించడానికిమార్కెట్ లో సిద్ధంగా ఉన్న నూతన సాంకేతికతలు వినూత్న అవకాశాలను సృష్టిస్తాయి. అని డి.ఎస్.టి. కార్యదర్శి వివరించారు.

 

 

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలోనూ, మహమ్మారి అనంతర సమాజ ఆర్థిక పునరుద్ధరణ సమయంలోనూ, మెరుగైన స్థితిస్థాపకత కోసం కమ్యూనిటీల శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల (ఎస్‌.టి.ఐ) సామర్థ్యాలను పెంపొందించడానికి వీలుగా కమ్యూనిటీ రెసిలెన్స్ రిసోర్స్ సెంటర్లను (సి.ఆర్‌.ఆర్‌.సి.లు) ఏర్పాటు చేయడానికి డి.ఎస్‌.టి. చొరవ ప్రారంభించిందని ఆయన నొక్కిచెప్పారు.  "కమ్యూనిటీ స్థితిస్థాపకతను స్థిరమైన జీవనోపాధితో అనుసంధానించడంపై దృష్టి కేంద్రీకరించబడింది" అని కూడా డాక్టర్ చంద్రశేఖర్ సైడ్ ఈవెంట్‌ లో వివరించారు.

 

 

“ఎస్. & టి. జోక్యాలు, తగిన నైపుణ్యాలతో జీవనోపాధిపై దృష్టి సారించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో కమ్యూనిటీ రెసిలెన్స్ రిసోర్స్ సెంటర్లు సహాయపడతాయి.  తద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం సంఘాలు తగిన నిర్ణయాలు తీసుకుని, అనిశ్చితిని అధిగమించగలుగుతాయి.   ద్వైపాక్షిక, బహుపాక్షిక భాగస్వామ్యాలను ఇవి సులభతరం చేస్తాయి.  వివిధ రకాల ప్రభావవంతమైన, సమగ్రమైన శాస్త్రం, సాంకేతికత, స్థితిస్థాపక సంఘాల కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇవి సహాయపడతాయి.  ఆచరణాత్మక, అధునాతన శాస్త్ర, సాంకేతికతో పాటు, ఆవిష్కరణ-ఆధారిత సమాజ స్థితిస్థాపక నమూనాలు, అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలు, విజయవంతమైన  కేస్ స్టడీస్‌ను వివిధ రకాల అంతర్జాతీయ సహకారం, మార్పిడి కార్యకలాపాల ద్వారా పంచుకోవాలి." అని డి.ఎస్.టి.తో పాటు, యు.ఎన్.డి.పి. సంయుక్తంగా నిర్వహించిన సైడ్ ఈవెంట్‌లో యు.ఎన్.డి.పి. భారత రెసిడెంట్ ప్రతినిధి శ్రీమతి షోకో నోడా తెలియజేశారు. 

 

 

భవిష్యత్తులో సి.ఆర్.ఆర్.సి. పై డి.ఎస్.టి. యు.ఎన్.డి.పి. పని చేసే మార్గాలపై, డి.ఎస్.టి. కి చెందిన ఎస్.ఈ.ఈ.డి. డివిజన్ అధిపతి, డాక్టర్ దేవ ప్రియ దత్తా వివరంగా చర్చించగా,  కమ్యూనిటీ రెసిలెన్స్ రిసోర్స్ సెంటర్స్ (సి.ఆర్‌.ఆర్‌.సి) భావనపై డి.ఎస్‌.టి.  శాస్త్రవేత్త డాక్టర్ కొంగ గోపీకృష్ణ వివరించారు.  భారతదేశంలోని అమృత విద్యా పీఠానికి చెందిన డాక్టర్ మనీషా సుధీర్, భారతదేశంలోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యు.పి.ఈ.ఎస్) కు చెందిన డాక్టర్ నీలు అహుజా,  వైల్డ్‌ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన డాక్టర్ రుచి బడోలా,  సి.ఆర్.ఆర్.సి.ఎస్. గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.

 

 

భారతదేశం-ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య భవిష్యత్ సహకారం కోసం, కమ్యూనిటీ-ఆధారిత సాంకేతిక పరిష్కారాలతో పాటు, స్థానిక స్థితిస్థాపకత నిర్మాణానికి, ఆధునిక సహకార ప్రపంచ స్థాయి పరిశోధనల వేదికల అభివృద్ధికి దోహదపడే అటువంటి స్థితిస్థాపకత శాస్త్రీయ సాధనాల అభివృద్ధికి పొదుపు ఆవిష్కరణల కోసం, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశ్యంతో సన్నాహాలను రోజంతా జరిగిన - సైడ్ ఈవెంట్ లో చర్చించడం జరిగింది.

 

 

<><>


(Release ID: 1922262) Visitor Counter : 226


Read this release in: English , Urdu , Hindi , Tamil