రక్షణ మంత్రిత్వ శాఖ
35వ నావికాదళ హయ్యర్ కమాండ్ కోర్స్ ముగింపు కార్యక్రమం
Posted On:
03 MAY 2023 3:15PM by PIB Hyderabad
35వ నావికాదళ హయ్యర్ కమాండ్ కోర్స్ (ఎన్ హెచ్ సి సి) ముగింపు కార్యక్రమం మే 3 న గోవాలోని నావికాయుద్ధ కళాశాల ( ఎన్ డబ్ల్యు సి) లో జరిగింది. భారత నావికాదళానికి చెందిన 25 మంది ఆఫీసర్లు, సైనిక, వైమానిక దళాలకు చెందిన ఆఫీసర్లు నలుగురేసి చొప్పున, ఒక కోస్ట్ గార్డ్ ఆఫీసర్ కలిసి మొత్తం 35 మంది 2022 ఆగస్టు 1 న్ ఆమోదలైన ఈ శిక్షణలో పాల్గొన్నారు.భారత నావికాదళం, వైమానిక దళం, సైన్యం, తీరప్రాంత రక్షక దళంలో కెప్టెన్ రాంకులో ఉండే అధికారులకు ఈ ఎన్ హెచ్ సి సి కోర్సు ఉంటుంది. జాతీయ భద్రత, సముద్రతీర భద్రత, ఉమ్మడి కార్యకలాపాల నిర్వహణ లాంటి విషయాలలో ప్రధానంగా దృష్టి సారించేలా వ్యూహాత్మక కార్యకలాపాలకు సిద్ధం చేయటం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ఈ కోర్సుకు హాజరయ్యే ఆఫీసర్లుదేశానికి అవసరమైన అనేక వ్యూహాత్మక, నిర్వహణా పరమైన అంశాల మీద, మరీ ముఖ్యంగా సాయుధ దళాలకు అవసరమైన విషయాల మీద పరిశోధన జరిపారు.
గోవా గవర్నర్ శ్రీ శ్రీధరన్ పిళ్లై, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైస్ అడ్మిరల్ ఎంఎ హంపిహోలి, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సాదారణ నావల్ కమాండ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్సులో పాల్గొన్నవారందరికీ ‘రక్షణ, వ్యూహాత్మక అధ్యయనాలు’ అనే అంశం మీద డిగ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. ఉత్తమ పరిశోధన పత్రం సమర్పించినందుకు కెప్టెన్ రాజీవ్ తివారీకి నావికాదళాధిపతి బంగారు పతకం బహుకరించారు. రెండో ఉత్తమ పరిశోధనాపత్రానికి కెప్టెన్ విక్రమ్ ఆహుజాకు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్-చీఫ్ ( పశ్చిమ) రజత పతకం అందించారు. ఉత్తమ నిర్వహణ పరిశోధనా పత్రానికి కెప్టెన్ కునాల్ భరద్వాజకు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్-చీఫ్ ( దక్షిణ) రజత పతకం ఇచ్చారు. ద్వితీయ ఉత్తమ పరిశోధనా పత్రాలు సమర్పించిన కెప్టెన్ వరుణ్ పణిక్కర్, కర్నల్ ఆర్ ఆర్ లద్దా లకు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (తూర్పు) రజత పతకం అందించారు. తొలి రక్షణ దళాల అధిపతి స్మారకార్థం కొత్తగా ఏర్పాటు చేసిన జనరల్ బిపిన్ రావత్ ట్రోఫీని ఈ కార్యక్రమం సందర్భంగా కెప్టెన్ సూరజ్ జేమ్స్ రబీరియాకు బహుకరించారు. నావికాదళ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీమరి కళా హరికుమార్. సంఘం దక్షిణ ప్రాంత అధ్యక్షురాలు శ్రీమతి మధుమతి హంపిహోలి, స్వర్గీయ జనరల్ బిపిన్ రావత్ కుమార్తెలు కూడా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు.
పతకాలు సాధించినవారిని ముఖ్య అతిథి అభినందించారు. వారి ఓర్పును, వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రశంసించారు. కోర్సు పూర్తి చేసుకున్న ఆఫీసర్లు సాయుధ దళాలలో కీలక కార్యకలాపాలలో పాల్గొంటారు. విధాన నిర్ణయాలలోనూ, నిర్ణయాలలోనూ కీలకపాత్ర పోషిస్తారు.
***
(Release ID: 1921714)
Visitor Counter : 181