వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
మేధోమధన శిబిరాల ద్వారా నూతన,వినూత్న ఆలోచనలు - శ్రీ గోయల్
ఫరీదాబాద్ లో రెండు రోజుల పాటు మేధోమధన శిబిరం నిర్వహించిన ఆహార,ప్రజాపంపిణీ శాఖ
ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి అమలు చేయాల్సిన చర్యలపై శిబిరంలో విస్తృత చర్చ
Posted On:
03 MAY 2023 9:43AM by PIB Hyderabad
మేధోమధన శిబిరాలను తరచు నిర్వహించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఫరీదాబాద్ లో రెండు రోజుల పాటు ఆహార,ప్రజాపంపిణీ శాఖ నిర్వహించిన మేధోమధన శిబిరంలో శ్రీ గోయల్ శాఖ అధికారులతో మాట్లాడారు. మేధోమధన శిబిరాల్లో జరిగే చర్చల్లో నూతన,వినూత్న ఆలోచనలు అందుతాయన్నారు. ఈ రకమైన కార్యక్రమాల వల్ల అధికార వ్యవస్థలో అంతరం తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. చర్చల్లో అందే ఆలోచనలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. సృజనాత్మక ఆలోచనలు ప్రజా సంక్షేమం తో పాటు సిబ్బంది వ్యక్తిగత ఎదుగుదలకు కూడా కల్పిస్తాయన్నారు.
ఫరీదాబాద్ లో 2023 ఏప్రిల్ 27న ప్రారంభమైన మేధోమధన శిబిరం ఏప్రిల్ 28న ముగిసింది.
ప్రారంభ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి శాఖ పనితీరు మరింత మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు, ఆలోచనలు అందించిన వారిని అభినందించారు. శిబిరంలో అందిన సలహాలు, సూచనలు, ఆలోచనలను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులకు శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఆదేశాలు జారీచేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలు చేయడానికి శిబిరంలో అందిన సలహాలు, సూచనలు, ఆలోచనలు సహకరిస్తాయన్నారు.
శిబిరంలో ఆహార,ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా తో సహా శాఖకు చెందిన దాదాపు 100 మంది అధికారులు పాల్గొన్నారు. నాలుగు అంశాలపై అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి చర్చలు జరిపారు.ప్రజాపంపిణీ రంగానికి చెందిన నిపుణులు శ్రీ ఆర్.ఎస్.సోధి, శ్రీ అశోక్ గులాటి, శ్రీ ఎస్.శివకుమార్ ఆహార,ప్రజాపంపిణీ శాఖ లక్ష్యాలు సాధించడానికి అనుసరించాల్సిన ప్రణాళికపై సూచనలు, సలహాలు అందించారు.
అమూల్ సంస్థలో పనిచేసి సాధించిన అనుభవాన్ని వివరించిన శ్రీ ఆర్.ఎస్.సోధి విలువ ఆధారిత వ్యవస్థపై మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పోషకాహార భద్రత కల్పించడానికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ అశోక్ గులాటీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగంలో అపార అనుభవం కలిగిన శ్రీ ఎస్ శివకుమార్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. వ్యక్తిగత జీవన శైలిలో సానుకూల మార్పులు అనే అంశంపై శ్రీ శివ్ ఖేరా మాట్లాడారు.
***
(Release ID: 1921586)
Visitor Counter : 219