సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన "మిషన్ కర్మయోగి", ప్రత్యేకించి సివిల్ సర్వెంట్ల ప్రయోజనాల కోసం, సామర్థ్య నిర్మాణ ప్రక్రియను సంస్థాగతీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

Posted On: 02 MAY 2023 5:54PM by PIB Hyderabad

2047 నాటికి భారతదేశపు శతాబ్దం గా తీర్చిదిద్దే లక్ష్యంతోప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన "మిషన్ కర్మయోగి", ప్రత్యేకించి సివిల్ సర్వెంట్ల ప్రయోజనాల కోసం, సామర్థ్య నిర్మాణ ప్రక్రియను సంస్థాగతీకరించిందని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్;పీఎంవో, పర్సనల్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

ఐగోట్ కర్మశాల 2023 – సంప్రదింపుల వర్క్‌షాప్‌ను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరియు దాని ఆకాంక్షలకు అనుగుణంగా జీవించడానికి పాలనలో "పాలన" నుండి "పాత్ర"కి మారడం తప్పనిసరి అని అన్నారు. మొత్తం భావన పాలనకు కొత్త సంస్కృతిని అందించాలని కోరిందని ఆయన అన్నారు.

 

విక్షిత్ భారత్‌కు మార్గం సుగమం చేసే సంస్కరించబడిన పౌర సేవల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు మిషన్ కర్మయోగి కట్టుబడి ఉందని, చురుకైన, ప్రతిస్పందించే,ప్రజల అవసరాలను తీర్చడానికి మెరుగైన సన్నద్ధతో, ప్రభావవంతమైన పరిపాలనను రూపొందించడంలో మిషన్ కర్మయోగి పరివర్తనాత్మక పాత్ర పోషిస్తోందని మంత్రి అన్నారు.  వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అధిక నాణ్యతతో కూడిన ప్రజాసేవను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం మరియు సామర్థ్యాలను పొందేందుకు పౌర సేవకులకు వీలు కల్పించే సమగ్ర కార్యక్రమంగా రూపొందించబడిన మిషన్ కర్మయోగి, గత కొన్ని సంవత్సరాలుగా,కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ యొక్క సారథ్యంలో నిపుణుల ఆధ్వర్యంలో పెద్ద పురోగతి సాధించింది అని ఆయన వివరించారు.

 

మిషన్ కర్మయోగి ప్రవేశపెట్టినప్పటి నుండి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం పట్ల ఆలోచనా విధానం మారిందని డీ ఓ పీ టీ  కార్యదర్శి శ్రీమతి రాధా చౌహాన్ అన్నారు. రాజకీయ నాయకత్వం ద్వారా మాకు స్పష్టమైన దృక్పథం ఏర్పడిన క్షణంలో, పౌర సేవకులలో ఉత్తమమైన పౌర సేవలు అందించాలనే కోరికకు సాధికారత లభించిందన్నారు.

 

సిబిసి చైర్మన్ ఆదిల్ జైనుల్భాయ్ మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి కింద రెండు సంస్థలు ఉన్నాయని, అవి మిషన్ కర్మయోగి యొక్క లక్ష్యం అమలు చేసే బాధ్యతను కలిగి ఉన్నాయని, అవి కర్మయోగి భారత్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్లు అవి సివిల్ సర్వెంట్లందరికీ అభ్యాసాన్ని వేగవంతం చేయడానికి కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చేసిన కృషిని ఆయన మరింత వివరించారు.

 

కర్మయోగి భారత్ ఛైర్మన్ ఎస్ రామదొరై మాట్లాడుతూ, డిఓపిటి ఆధ్వర్యంలో స్థాపించబడిన కర్మయోగి భారత్- ఎస్‌పివి ద్వారా నిర్వహించబడుతున్న ఐ గాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్ వివిధ రకాల కంటెంట్ ప్రొవైడర్ల 400+ కోర్సుల ద్వారా పౌర సేవకులకు అత్యాధునిక డిజిటల్ శిక్షణ అనుభవాన్ని అందజేస్తోందని చెప్పారు. అన్ని స్థాయిలలోని ప్రభుత్వ అధికారుల అభ్యాస అవసరాలకు మద్దతుగా, వివిధ హబ్‌లు, డిస్కషన్ హబ్, ఈవెంట్స్ హబ్ మరియు నెట్‌వర్క్ హబ్ వంటివి కూడా నిజమైన ఇంటరాక్టివ్ అనుభవం కోసం అందుబాటులో ఉంచారు, తద్వారా సంపూర్ణ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత అభివృద్ధిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

 

అభ్యాసకులందరికీ వారి నైపుణ్యాలు, జ్ఞానం మరియు సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశ్యంతో ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఏదైనా పరికరంలో అధిక-నాణ్యత గల అభ్యాస వనరులను అందించడమే కాకుండా, ఐ గాట్ పోర్టల్ స్వీయ,వేగవంతమైన, ప్రభుత్వ అధికారులలో జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా సామాజిక చైతన్యాన్ని, నిరంతర అభ్యాస సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. 

 

వినియోగదారులందరికీ మొబైల్ అభ్యాసాన్ని విస్తరించడం కోసం, ఐ గాట్ కర్మయోగి ఆండ్రాయిడ్  యాప్  (డిసెంబర్, 2022లో), మరియు ఐ ఓ ఎస్ (జనవరి, 2023లో) ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రారంభించబడింది. యాప్ గత కొన్ని నెలలుగా అభ్యాసకులలో ప్రోత్సాహకరమైన ప్రగతి ని నమోదు చేసింది.

 

ఐ గాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో సర్వే టూల్, ఎండ్-ఆఫ్-కోర్సు అసెస్‌మెంట్ మరియు డ్యాష్‌బోర్డ్ వంటి కొత్త ఫీచర్లను మంత్రి ప్రారంభించారు, ఇవి ఐ గాట్ని అత్యుత్తమ వేదికగా రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. కొత్త ఫీచర్లు మెరుగైన అభ్యాసకుల స్థాయి పర్యవేక్షణ మరియు మూల్యాంకనానికి కూడా అనుమతిస్తాయి.

 

ఐ గాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌లో చురుగ్గా పాల్గొన్న టాప్ లెర్నర్‌లు మరియు టాప్ మినిస్ట్రీలు/డిపార్ట్‌మెంట్‌లను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ సత్కరించారు.

 

అమృత్ కాల్ లో 1.4 బిలియన్ల మంది ప్రజలు మెరుగైన జీవనం మరియు సులభతరమైన వ్యాపారం పరంగా పెద్ద పురోగతి సాధించాలనే లక్ష్యంతో, సమర్థత, కౌసల్యత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మరియు పౌరులకు అనుకూలమైన బలమైనపునాది'పై ఆధారపడతారని మంత్రి తెలిపారు.  'విక్షిత్ భారత్' యొక్క వాస్తుశిల్పులుగా, మన దేశవ్యాప్తంగా సుపరిపాలన అందించడంలో మిషన్ కర్మయోగి ద్వారా మరియు ఐ గాట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సాధికారత పొందిన కొత్త తరం సివిల్ సర్వెంట్లపై మా విశ్వాసాన్ని నిలుపుతున్నాం అని ఆయన ముగించారు.

 

అభిషేక్ సింగ్, సిఇఒ, కర్మయోగి భారత్, టెలికమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి, పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్, శ్రీ హేమంగ్ జానీ, సెక్రటరీ సిబిసి, ప్రొఫెసర్ ఆర్.బాలసుబ్రమణ్యం, సభ్యుడు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, శ్రీ పంకజ్ బన్సాల్, ఎస్ పీ వీ సభ్యుడు, శ్రీ ఎస్ డీ శర్మ, జాయింట్ సెక్రటరీ, డీ ఓ పీ టీ మరియు ఇతర సీనియర్ అధికారులు, విశిష్ట ప్యానెలిస్ట్‌లు, నోడల్ అధికారులు మరియు భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల నుండి నామినీలు,  భారత ప్రభుత్వ విభాగాలు, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల అధిపతులు మరియు ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు.

***



(Release ID: 1921583) Visitor Counter : 168