అణుశక్తి విభాగం

యుకెలోని అత్య‌త్త‌మ సంస్ధ రూథ‌ర్‌ఫోర్డ్ ఆపిల్‌ట‌న్ ప్ర‌యోగ‌శాల స‌దుపాయాన్ని వృద్ధిలో స‌హ‌క‌రించ‌నున్న భార‌త్‌

Posted On: 28 APR 2023 2:19PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్డ‌మ్‌లో అత్యుత్త‌మ సంస్థ అయిన రూత్‌ఫోర్డ్ ఆపిల్‌ట‌న్ లాబొరేట‌రీని సంద‌ర్శించి, ప‌రిశోధ‌కులు స‌హా యుకె- ఇండియా ఐఎస్ఐఎస్ ప్రాజెక్టులో ప‌ని చేస్తున్నవారిని కేంద్ర పిఎంఒ, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పింఛ‌న్లు శాఖ స‌హాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి), శాస్త్ర & సాంకేతిక శాఖ మంత్రి, ఎర్త్ సైన్సెస్ మంత్రి, అణు ఇంధ‌నం, అంత‌రిక్ష శాఖ‌ల స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ శుక్ర‌వారం క‌లుసుకున్నారు. 
యుకెలోని జాతీయ శాస్త్రీయ ప‌రిశోధ‌నా ప్ర‌యోగ‌శాల‌లో రూథ‌ర్‌ఫోర్డ్ ఆపిల్‌ట‌న్ ప్ర‌యోగ‌శాల ఒక‌టి, దీనిని సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఫెసిలిటీస్ కౌన్సిల్ (ఎస్‌టిఎఫ్‌సి - శాస్త్ర‌, సాంకేతిక స‌దుపాయాల మండ‌లి) నిర్వ‌హిస్తుంది.  
యుకెకు సౌక‌ర్యాల‌ను నిర్వ‌హించ‌డ‌మే కాక అద‌నంగా, ఆర్ఎఎల్ ప్ర‌ధాన అంత‌ర్జాతీయ స‌దుపాయాల‌లో పాలుపంచుకునేందుకు యుకె కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యప‌రిచేందుకు విభాగాల‌ను నిర్వ‌హిస్తుంది. ఇందులో పార్టిక‌ల్ ఫిజిక్స్ (క‌ణ‌భౌతిక శాస్త్రం), అంత‌రిక్ష విజ్క్షానం ప్ర‌ధాన అంశాలు. ఈ సైట్ ఐఎస్ ఐస్ న్యూట్రాన్ అండ్ మౌన్స్ సోర్స్ (1984),   స్పెల్లాటియ‌న్ (విక‌ర‌ణ‌) న్యూట్రాన్ సోర్స్, సెంట్ర‌ల్ లేజ‌ర్ ఫెసిలిటీ, ది డైమండ్ లైట్ సోర్స్ సింక్రొటాన్  స‌హా యుకె ప్ర‌ధాన శాస్త్రీయ స‌దుపాయాలను నిర్వ‌హిస్తుంది. 
జి-20కి భార‌త్ ఈ ఏడాది అధ్య‌క్ష‌త వ‌హిస్తున్న‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి వ‌సుధైక కుటుంబ‌కం, అంటే ప్ర‌పంచ‌మంతా ఒక‌టే కుటుంబ‌మ‌న్న ఇతివృత్తాన్ని ఇచ్చిన‌ప్పుడు, మాన‌వాళి విస్త్ర‌త ప్ర‌యోజ‌నాల కోసం ఇత‌ర దేశాల‌తో శాస్త్రీయ‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌లో త‌మ అనుభ‌వాల‌ను పంచుకునేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డ‌మ్ సంప్ర‌దాయ భాగ‌స్వామి అయిన నేప‌థ్యంలో శాస్త్రీయ‌, ఆవిష్క‌ర‌ణ‌ల క్షేత్రంలో దీర్ఘ‌కాలంలో స‌హ‌క‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. 
ప్ర‌ధాన అంత‌ర్జాతీయ స‌దుపాయాల‌లో యుకె భాగ‌స్వామ్య కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యం చేసినందుకు రూథ‌ర్‌ఫోర్డ్ యాపిల్‌ట‌న్ లాబొరేట‌రీని (ఆర్ఎఎల్‌)ని మంత్రి అభినందించారు. ప్రాథ‌మిక ప‌రిశోధ‌న కోసం మెగా స‌దుపాయాల కింద‌, భార‌త ప‌రిశోధ‌కులు సిఎఆర్ఎన్ (సెర్న్‌- జెనీవా0, ఎఫ్ఎఐఆర్ (ఫెయిర్‌- జ‌ర్మ‌నీ), టిఎంటి (యుఎస్ఎ), ఫెర్మిలాబ్ (యుఎస్ఎ), ఎల్ఐజిఒ (లిగో - యుఎస్ఎ) వంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో భార‌తీయ ప‌రిశోధ‌కులు భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉన్నారు. ఈ అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్య‌ల నుంచి సాధించిన ప్ర‌ధాన విజ‌యాల‌లో 500+ భాగ‌స్వామ్య ప‌రిశోధ‌న ప్ర‌చుర‌ణ‌లు, 150 పిహెచ్‌డిలు, దేశంలో ఆర్‌&డి మౌలికస‌దుపాయాల సృష్టి, 150+ సంస్థ‌లు, 75 భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ల సంల‌గ్న‌త‌, అభివృద్ధి, ఈ మెగా ప్రాజెక్టుల కోసం ఇచ్చిపుచ్చుకునే వ‌స్తువుల న‌మూనాలు, సాంకేతిక బ‌దిలీలు ఉన్నాయి. 
భార‌త ప్ర‌భుత్వానికి చెందిన శాస్త్ర & సాంకేతిక విభాగం (డిఎస్‌టి) నానో మిష‌న్ కింద ప్ర‌ధాన స‌హ‌కార ప్రాజెక్టును క‌లిగి ఉంద‌ని, దీనివ‌ల్ల భార‌తీయ ప‌రిశోధ‌కులు ఐఎస్ఐఎస్ న్యూట్రాన్‌, మ్యూయాన్ సోర్స్‌తో స‌మ‌న్వ‌య ప‌రిశోధ‌న‌ల‌ను కొన‌సాగించేందుకు యుకెకు చెందిన రూథ‌ర్‌ఫోర్డ్ ఆపిల్‌ట‌న్ లాబొరేట‌రీలో అన్ని  న్యూట్రాన్‌, మ్యుయాన్ బీమ‌లైన్స్‌కు ప్రాప్య‌త‌ను క‌లిగి ఉండేందుకు ఇది తోడ్ప‌డింద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప‌దార్ధాల ప‌రిశోధ‌న‌లో న్యూట్రాన్ స్కాట‌రింగ్ అధ్య‌య‌నాల‌ను నిర్వ‌హించే కొన్ని ప్ర‌ముఖ ప‌రిశోధ‌నా కేంద్రాల‌లో ఆర్ఎఎల్‌లోని ఐఎస్ఐఎస్ యాక్సిల‌రేట‌ర్ (వేగ‌వ‌ర్ధ‌క ప‌రిక‌రం) ఒక‌టి. ఐఎస్ఐఎస్ స‌దుపాయంలో టిఎస్‌2 లో స్మాల్ యాంగిల్ స్కాట‌రింగ్‌కు అంకితం చేసిన నూత‌న బీమ్‌లైన్ జూమ్ (ZOOM) నిర్మాణ వ్య‌యానికి డిఎస్‌టి తోడ్ప‌డ‌డాన్ని మంత్రి ప్ర‌శంసించారు. మొత్తం 2.5మిలియ‌న్‌ల ప్రాజెక్టు వ్య‌యం క‌లిగిన‌ ఈ ప్రాజెక్టు కాల‌వ్య‌వ‌ధి 30 సెప్టెంబ‌ర్ 2023. వివిధ శాస్త్ర స్ర‌వంతుల‌ను ఆవ‌రిస్తూ దాదాపు 25 ప‌రిశోధ‌నా ప‌త్రాలు ఇప్ప‌టికే ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఫేజ్ II (2023-28) కింద చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌లో ప‌రిగ‌ణ‌న‌లో ఉన్న ఐదు అంశాలు - ఎ)  ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌తి ప్ర‌యోగం సంద‌ర్భంగా సంద‌ర్శించేందుకు ఏర్పాటు బి) భార‌త ప్రేరిత జూమ్ బీమ్‌లైన్ స‌హా ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం క‌లిగిన సాధ‌న నిర్మాణాన్ని ఆధునీక‌రించేందుకు 3 మిలియ‌న్ పౌండ్ల న‌గ‌దు స‌హ‌కారాన్ని అందించ‌డం సి) ఒక పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలోకు ఫెలోషిప్‌ల‌కు అవ‌కాశం డి) ప్ర‌త్య‌క్ష అందుబాటుకోసం బీమ్ టైమ్‌ను పొందిన ఇద్ద‌రు ప‌రిశోధ‌కులు సంద‌ర్శించేందుకు ఏర్పాటు ఇ)  ప్ర‌తి సంవ‌త్స‌రం స్టీరింగ్ క‌మిటీ స‌మావేశాల‌ను భార‌త‌దేశం, యుకెల‌లోప్ర‌త్యామ్నాయంగా నిర్వ‌హించ‌డానికి,  ప్రాజెక్టు మొద‌లైన తొలి సంవ‌త్స‌రం నుంచి ఇండియా, యుకె న్యూట్రాన్ వ‌ర్క్‌షాప్‌ను  ప్ర‌త్యామ్నాయ సంవ‌త్స‌రాల‌లో నిర్వ‌హించ‌డానికి నిధులను స‌మ‌కూర్చ‌డం. 
శాస్త్ర‌, ఆవిష్క‌ర‌ణ రంగంలో మ‌రో పురోగ‌తి గురించి వెల్ల‌డిస్తూ, మ‌హారాష్ట్ర‌లో రూ. 2,600 కోట్ల అంచ‌నా వ్య‌యంతో   అడ్వాన్స్ డ్ గ్రావిటేష‌న‌ల్ - వేవ్ డిటెక్ట‌ర్ ( అధునాత‌న గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగ శోధ‌ని)ని నిర్మించే లిగో- ఇండియా ప్రాజెక్టుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలియ‌చేయ‌డం హ‌ర్ష‌దాయ‌క‌మ‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు.  ఈ స‌దుపాయ నిర్మాణం 2030కి పూర్త‌వుతుంద‌ని అంచ‌నా. ఈ అబ్జ‌ర్వేట‌రీ ప్ర‌త్యేక‌త‌ల‌లో మూడ‌వ‌ది. దీనిని యుఎస్‌లోని లూసియానా, వాషింగ్ట‌న్‌ల‌లో ఉన్న జంట లేజ‌ర్ ఇంట‌ర్‌ఫెరోమీట‌ర్ గ్రావిటేష‌న‌ల్- వేవ్ అబ్జ‌ర్వేట‌రీస్ (ఎల్ఐజిఒ- లిగో) క‌చ్ఛిత‌మైన ల‌క్ష‌ణాల‌తో నిర్మిస్తున్నారు. లిగో -ఇండియా స‌మిష్టిగా వాటితో క‌లిసి ప‌ని చేస్తుంది. 
కొంచెం నుంచి ఎక్కువ పొందేందుకు ఆర్‌&డి మౌలిక స‌దుపాయాల‌ను పంచుకోవ‌డానికి భార‌త్‌-యుకె స‌హ‌కారానికి మ‌రిన్ని అవ‌కాశాల కోసం తాను ఎదురు చూస్తున్నాన‌ని మంత్రి త‌న ముగింపు వ్యాఖ్య‌ల‌లో పేర్కొన్నారు. 
త‌న ఆరురోజుల యునైటెడ్ కింగ్డ‌మ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఉన్న‌త స్థాయి అధికారుల భార‌తీయ ప్ర‌తినిధి బృందానికి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

***



(Release ID: 1920918) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi , Tamil