పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బీ సీ ఏ ఎస్ తన 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది

జనరల్ డాక్టర్ వి.కె. సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ భద్రత బాధ్యత అందరిపైనా ఉంటుంది

కొత్త సాంకేతికతల వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి లబ్దిదారులు కఠినమైన విధి విధానాలను అవలంబించాలి

వివిధ విభాగాల్లో ఉత్తమ స్క్రీనర్లుగా ఎంపికైన స్క్రీనర్లకు మంత్రి అవార్డులను అందజేస్తారు

Posted On: 27 APR 2023 4:13PM by PIB Hyderabad

పౌర విమానయాన భద్రత కోసం జాతీయ నియంత్రణ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీ సీ ఏ ఎస్) ఈరోజు న్యూఢిల్లీలో తన 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. రెండు రోజుల కార్యక్రమం ప్రారంభ సమావేశంలో, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, జనరల్ డాక్టర్ వి.కె. సింగ్ (రిటైర్డ్) వివిధ విభాగాల్లో ఉత్తమ స్క్రీనర్‌లుగా ఎంపికైన స్క్రీనర్‌లకు అవార్డులను అందజేశారు. 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకం, 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచినందుకు పోలీస్ మెడల్‌ను అందుకున్న బీసీఏఎస్ అధికారులకు మంత్రి అవార్డులను పంపిణీ చేశారు.

 

ప్రారంభోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. విమానయాన రంగంలో అత్యంత కీలకమైన అంశాలలో భద్రత ఒకటని, విమాన కార్యకలాపాలను సురక్షితంగా మరియు భద్రంగా  ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు.

 

"విమానయాన ప్రయాణీకులందరికీ బీ సీ ఏ ఎస్ ఒక పెద్ద హామీ భద్రత భరోసాని ఇస్తుంది, కొత్త సాంకేతికతలవల్ల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి లబ్దిదారులు కఠినమైన ప్రామాణిక విధి విధానాలను అవలంబించాలి" అని ఆయన అన్నారు.

 

కార్యక్రమంలో ఎం ఓ సీ ఏ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్ కూడా ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన పరిశ్రమ అని, ప్రపంచం విమానయాన రంగంలో అభివృద్ధి చెందాలంటే, అది భారతదేశం ఆధారపడి ఉంటుంది అని ఆయన అన్నారు.

 

రానున్న కాలంలో ప్రయాణికులకు మేలు చేకూర్చేందుకు విమానాశ్రయాల్లో మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.

 

శ్రీ జుల్ఫికర్ హసన్, డీ జీ, బీ సీ ఏ ఎస్ కూడా ప్రారంభ సభ లో ప్రసంగించారు. విమాన యానం ప్రమాద రహితం చేయడానికి బీ సీ ఏ ఎస్ పుట్టింది. సంస్థ ఇప్పుడు 20 ప్రాంతీయ కార్యాలయాలతో దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉంది.

 

1976 సెప్టెంబరు 10న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన నేపథ్యంలో ఏర్పాటైన పాండే కమిటీ సిఫార్సుపై 1978 జనవరిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)లో ఒక విభాగంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీని మొదట ఏర్పాటు చేశారు.

 

సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విషయాలలో సిబ్బందిని సమన్వయం చేయడం, పర్యవేక్షించడం, తనిఖీ చేయడం మరియు శిక్షణ ఇవ్వడం ఈ విభాగం పాత్ర. జూన్ 1985లో జరిగిన కనిష్క విషాదానంతర పర్యవసానంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1987 ఏప్రిల్ 1న బీ సీ ఏ ఎస్ స్వతంత్ర విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది.

 

చట్టవిరుద్ధమైన చొరబాట్లు జోక్యానికి వ్యతిరేకంగా పౌర విమానయాన కార్యకలాపాలను రక్షించడం బీ సీ ఏ ఎస్ యొక్క లక్ష్యం. బ్యూరో భారతదేశం నుండి / భారతదేశం బయటకు నడిచే పౌర విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను నిర్దేశించడానికి మరియు సాధారణ తనిఖీలు మరియు భద్రతా ఆడిట్‌ల ద్వారా వాటి అమలును నిర్ధారించడానికి బాధ్యత వహిస్తుంది.

***



(Release ID: 1920333) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi , Marathi