సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
తిరిగి రాబట్టిన దొంగతనానికి గురైన చోళుల కాలం నాటి హనుమంతుడి విగ్రహం; తమిళనాడు విగ్రహాల విభాగానికి అందచేత
Posted On:
25 APR 2023 10:27AM by PIB Hyderabad
దొంగతనానికి గురైన చోళుల కాలం నాటి హనుమంతుడి విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని, తమిళనాడు ఐడల్ వింగ్ (విగ్రహాలను నిర్వహించే విభాగం)కు అందచేశారు.
ఈ హనుమంతుని విగ్రహాన్ని అరియలూర్ జిల్లాలోని పొట్టవేలి వెల్లూర్‌లో శ్రీవరదరాజ పెరుమాళ్‌కు చెందిన వైష్ణవ ఆలయం నుంచి దొంగలించారు. ఇది చోళుల కాలానికి (14-15వ శతాబ్దం)కు చెందింది.
దీనిని 1961లో ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరీ తమ వివరణ పట్టికలో నమోదు చేసింది. ఈ విగ్రహాన్ని కాన్‌బెర్రాలోని భారత్ హై కమిషనర్‌కు అందించారు. ఈ విగ్రహాన్ని 2023 ఫిబ్రవరి చివరి వారంలో భారత్‌కు తీసుకువచ్చి, దానిని కేస్ ప్రాపర్టీ (కోర్టు ఆధీనంలో ఉన్న ఆస్తి)గా తమిళనాడు ఐడల్ వింగ్‌కు 18.04.2023న అప్పగించారు.
భారత ప్రభుత్వం దేశ పురాతన వారసత్వ సంపదను దేశంలో పరిరక్షించేందుకు కృషి చేస్తూ, గతంలో చట్టవిరుద్ధంగా తీసుకువెళ్ళిన పురాతన వస్తువులను వెనక్కి తీసుకువచ్చేందుకు కీలకంగా పాత్ర పోషిస్తోంది. నేటివరకూ 251 పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకురాగా, ఇందులో 238 వస్తువలను 2014 నుంచి తిరిగి తీసుకువచ్చింది.
(Release ID: 1919476)
Visitor Counter : 200