రక్షణ మంత్రిత్వ శాఖ
నావికాదళ వేదిక నుంచి బిఎండి ఇంటర్‌సెప్టర్ ను విజయవంతంగా పరీక్షించిన డిఆర్‌డిఒ & భారత నావికాదళం
Posted On:
22 APR 2023 6:21PM by PIB Hyderabad
సముద్ర ఆధారిత ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ (అంతర్ వాతావరణ అడ్డగించే క్షిపణి)ని (21 ఏప్రిల్ 2023న ఒడిషా తీరంలో, బంగాళాఖాతంలో తొలి విమాన పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), భారత నావికాదళం విజయవంతంగా నిర్వహించాయి. శత్రు గతిశీల క్షిపణి (బాలిస్టిక్ మిస్సైల్) ముప్పును ఎదుర్కొని, తటస్థీకరించడం, తద్వారా నౌకాదళ బిఎండి సామర్ధ్యం గల దేశంగా అభివృద్ధి చెందిన దేశాల బృందం స్థాయికి భారతదేశ హోదాను పెంచడం ఈ పరీక్ష ప్రధాన లక్ష్యం.
దీనికి ముందు, ప్రత్యర్ధుల నుంచి ఉద్భవించే గతిశీల క్షిపణి ముప్పును తటస్థీకరించే సామర్ధ్యం కలిగిన భూ- ఆధారిత బిఎండి వ్యవస్థను డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రదర్శించింది.
నౌక ఆధారిత గతిశీల క్షిపణి రక్షణ సామర్ధ్యాల విజయవంత ప్రదర్శనలో నిమగ్నమైన డిఆర్‌డిఒ, భారతీయ నావికాదళం, పరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
క్షిపణి రూపకల్పన, అభివృద్ధిలో నిమగ్నమైన బృందాలను డిడిఆర్&డి కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రశంసించారు. అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్ కేంద్రిత యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దేశం స్వావలంబన సాధించిందని ఆయన అన్నారు.
***
(Release ID: 1918848)
Visitor Counter : 251