రక్షణ మంత్రిత్వ శాఖ
కెనడా రక్షణమంత్రితో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ మంత్రి చర్చలు.
శాంతికోసం, ఇండో పసిఫిక్ భద్రతకోసం ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసుకోవడంపై చర్చలు
ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని, భాగస్వామ్య విధానంలో ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ కెనడా రక్షణ రంగ కంపెనీలను ఆహ్వానించిన శ్రీ రాజ్ నాధ్ సింగ్.
Posted On:
19 APR 2023 7:08PM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్, కెడా రక్షణ మంత్రి శ్రీమతి అనితా ఆనంద్ మధ్య టెలిఫోన్ ద్వారా చర్చలు జరిగాయి. ఏప్రిల్ 19, 2023న ఈ చర్చలు నిర్వహించారు. సుహృద్భావంగా, ఆహ్లాదకరంగా ఇరుదేశాల మధ్యన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యన గల రక్షణ రంగ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడంపైన చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలను, శాంతి విధానాలను, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతను ప్రతిఫలించాయి.
కెనడా అనుసరిస్తున్న ఇండో పసిఫిక్ వ్యూహం గురించి కెనడా రక్షణ మంత్రి శ్రీమతి అనితా ఆనంద్ వివరించారు. ఈ విషయంలో భారతదేశంతో సంబంధాల ప్రాధాన్యతను తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కెనడా నావికాదళ కార్యకలాపాలు పెరగడంపట్ల శ్రీ రాజ్ నాధ్ సింగ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతిదళాల శిక్షణ నుంచి రక్షణ రంగ పారిశ్రామిక సహకారం వరకూ ఇరు దేశాల మధ్యన వుండాల్సిన రక్షణ సహకారం గురించి మంత్రులిద్దరూ చర్చలు చేశారు.
రక్షణ రంగంలో పరిశ్రమల స్థాపనకు భారతదేశం అత్యంత అనుకూలమని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా వివరించారు. దేశంలో సరసమైన ధరలకు స్థలాలు లభిస్తాయని, శ్రామికశక్తి సముచితంగా అందుబాటులో వుందని, రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లున్నాయని తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని, భాగస్వామ్య విధానంలో ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ కెనడా రక్షణ రంగ కంపెనీలకు శ్రీ రాజ్ నాధ్ సింగ్ ఆహ్వానం పలికారు. కెనడా తన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో భారతీయ రక్షణ కంపెనీలను కలుపుకొని పోవడంద్వారా లబ్ధి పొందవచ్చని వివరించారు.
ఇరు దేశాల మధ్యన గల రక్షణ సంబంధాలను మరంత ముందుకు తీసుకుపోవాని, ఇండియా- కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణరంగాన్ని ప్రాధాన్యతగల అంశంగా చేయాలని మంత్రులిద్దరూ అంగీకరించారు.
****
(Release ID: 1918685)
Visitor Counter : 207