విద్యుత్తు మంత్రిత్వ శాఖ
5000 ప్యాసింజర్ విద్యుత్ వాహనాలు, 1000 సరుకు రవాణా ఇవిల కోసం రూ. 633 కోట్ల రుణాన్ని ఆమోదించిన పిఎఫ్‌సి
ఢిల్లీలో మోహరించనున్న 5000 ప్యాసింజర్ విద్యుత్ వాహనాల ఫలితంగా 1 లక్ష టన్నుల సిఒ2 ఈక్వివలెంట్ ఆదా
Posted On:
21 APR 2023 1:30PM by PIB Hyderabad
భారత్ విద్యుత్ రంగంలో ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన మహారాష్ట్ర కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎఫ్‌సి) జెన్సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (జిఎల్) 5000 ప్యాసింజర్ విద్యుత్ వాహనాలను (ఇవిలు) 1000 సరుకు రవాణా ఇవిలను కొనుగోలు చేసేందుకు రూ. 633 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. తమ అద్దెకు క్యాబ్‌ల సమూహాన్ని విస్తరించుకునేందుకు ప్యాసింజర్ ఇవిలను బ్లూస్మార్ట్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎంపిఎల్)కు లీజ్‌కు ఇవ్వనున్నారు. తొలి విడత రుణాన్ని మంజూరు చేయడం జరిగింది; తొలి బ్యాచ్ ఇవి క్యాబ్‌లు ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చాయి.
విద్యుత్ మంత్రిత్వ శాఖ శ్రీ అజయ్ తివారీ, పిఎఫ్‌సి సిఎండి శ్రీ రవీందర్ సింగ్ ధిల్లాన్ గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ క్యాబ్‌లకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ రాజీవ్ రంజన్ ఝా, డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ మనోజ్ శర్మ, సివిఒ శ్రీమతి సిమ్మి ఆర్. నక్రా, శ్రీ అన్మోల్ సింగ్ జగ్గీ (బ్లూస్మార్ట్ మొబిలిటీ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు), ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తొలి విడత ఇవీలను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మట్లాడుతూ, దేశంలో ఇ-మొబిలిటీని శరవేగంగా స్వీకరించడం జరుగుతోందని, ఈ క్షేత్రంలో భారీ సంభావ్యత ఉందని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ రుణం ద్వారా భారత జాతీయంగా నిర్ణయించిన విరాళాల (ఎన్‌డిసి) లక్ష్యాలకు సహకరించేందుకు పిఎఫ్‌సి ప్రయత్నించిందని, ఇది ఆరోగ్యకరమైన, సుస్థిరమైన రవాణా విధానం వైపు మళ్ళేందుకు అత్యంత సహాయకారిగా ఉంటుందని పిఎఫ్‌సి సిఎండి శ్రీ రవీందర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.
పిఎఫ్‌సి నిధులు సమకూర్చిన 5000 ప్యాసింజర్ ఇ-4 డబ్ల్యులు (ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్లు) ఢిల్లీలో మోహరిస్తున్నారని, దీని ఫలితంగా 1,00,000 టన్నుల సిఒ2 ఈక్వివలెంట్ (వివిధ హరిత ఉద్గారాలను కొలిచేందుకు కొలమానం) ఆదా చేయవచ్చన్నారు. ఏడాదిలో పూర్తిగా పెరిగిన 5 మిలియన్ వృక్షాలు పీల్చుకునే కర్బన వాయువులతో ఇది సమానం. నికర సున్నా లక్ష్యాన్ని సాధించాలన్న భారత్ దార్శనికతను వేగవంతం చేస్తూ, పునరావృతాలకు భారీగా నిధులను సమకూర్చడమే కాక పిఎఫ్‌సి ఇవిలకు (ఒఇఎంలు & సముదాయంగా కొనుగోలు చేసేందుకు), బ్యాటరీ ఒఇఎంలు, ఇవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో రుణ నిధులను సమకూర్చేందుకు అవకాశాలను అన్వేషిస్తోంది.
***
(Release ID: 1918549)
Visitor Counter : 183