రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి దాదాపు 10,000 కిమీల డిజిటల్ హైవేలను సృష్టించనున్న ఎన్‌హెచ్ఎఐ
Posted On:
19 APR 2023 3:49PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆర్థిక సంవత్సరం 2024-25నాటికి దాదాపు 10,000 కిమీల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఒఎఫ్‌సి) మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఎన్‌హెచ్ఎఐ పని చేస్తోంది.
ఒఎఫ్‌సి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల వెంట సమగ్ర యుటిలిటీ కారిడార్‌లను అభివృద్ధి చేయడం ద్వారా డిజిటల్ హైవేల నెట్‌వర్క్‌లను నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్), ఎన్‌హెచ్ఎఐ పూర్తి యాజమాన్యంలోని ఎస్‌పివి అమలు చేయనుంది. డిజిటల్ హైవే అభివృద్ధి కోసం పైలెట్ మార్గాలుగా సుమారు 1,367 కిమీల ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను, 512 కిమీల హైదరాబాద్ - బెంగళూరు కారిడార్‌ను గుర్తించడం జరిగింది.
దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సంధానతను అందించడం ద్వారా 5జి&6జి వంటి అత్యాధునిక టెలికాం సాంకేతికలను ప్రారంభించడాన్ని వేగవంతం చేసేందుకు ఒఎఫ్‌సి నెట్‌వర్క్ తోడ్పడుతుంది.
ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగమైన, ఇటీవలే ప్రారంభించిన 246 కిమీల పొడవైన ఢిల్లీ- దౌసా- లాల్‌సాట్ సెక్షన్‌లో ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ళను వేసేందుకు ఉపయోగించిన మూడు మీటర్ల వెడల్పుగల ప్రత్యేక యుటిలీ కారిడార్ ఆ ప్రాంతంలో 5జి నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు వెన్నుముకగా ఉండనుంది. జాతీయ రహదారుల వెంట ఒఎఫ్‌సి ని వేసే పని ప్రారంభమై, ఏడాది కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతోంది. టెలికాం/ ఇంటర్నెట్ సేవలకు ఒఎఫ్‌సి నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్లగ్ అండ్ ప్లే లేదా ఫైబర్ ఆన్ డిమాండ్ నమూనాను అనుమతిస్తుంది. అర్హత కలిగిన వినియోగదారులకు వెబ్‌పోర్టల్ ద్వారా ఓపెన్ ఫర్ ఆల్ ( అందరికీ అందుబాటులో) అన్న పద్ధతి ప్రాతిపదికన స్థిర ధర కేటాయింపు విధానంపై నెట్‌వర్క్‌ను లీజుకు ఇస్తారు. ఒఎఫ్‌సి కేటాయింపు విధానాన్ని డిఒటి, ట్రాయ్ (టిఆర్ఎఐ)తో సంప్రదింపుల ద్వారా ఖరారు చేయనున్నారు.
డిజిటల్ హైవేల సృష్టి కేవలం పెరుగుదల, అభివృద్ధిపై ఉత్రేరక ప్రభావాన్ని చూపడమే కాక దేశ డిజిటల్ పరివర్తనకు దోహదం చేస్తుంది.
***
(Release ID: 1918133)
Visitor Counter : 165