పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పుష్కలంగా నీరు ఉండే పంచాయతీ, క్లీన్ & గ్రీన్ పంచాయతీ మరియు ఆరోగ్యకరమైన పంచాయతీపై రేపు జాతీయ సదస్సు

Posted On: 19 APR 2023 7:12PM by PIB Hyderabad

24 ఏప్రిల్ 2023న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ పంచాయతీరాజ్ అవార్డు వేడుకల వారాన్ని (17-21 ఏప్రిల్ 2023) నిర్వహిస్తోంది. దీని కింద రేపు న్యూఢిల్లీలో  'నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ థీమ్స్ 2, 4 & 5: ఆరోగ్యకరమైన పంచాయతీ,'పుష్కలంగా నీరు ఉండే పంచాయతీ' మరియు 'క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ' జాతీయ సదస్సు జరగనుంది.

 

ఆరోగ్యకరమైన పంచాయతీలు, పుష్కలంగా నీరు ఉండే పంచాయతీలు మరియు క్లీన్ & గ్రీన్ పంచాయతీలు అనే ఇతివృత్తాలపై ఈ సదస్సు జరుగుతుంది. కాన్ఫరెన్స్ సందర్భంగా పంచాయతీల నుండి ఎన్నికైన ప్రతినిధులు (ఈఆర్‌లు), జాతీయ పంచాయతీ అవార్డు విజేతలు, పిఆర్‌ శాఖ అధికారులు, ఎస్‌ఐఆర్‌డిలు, పిఆర్‌ఐటీలతో సహా అన్ని రాష్ట్రాలు/యూటీల నుండి దాదాపు 1,500 మంది పాల్గొనే అవకాశం ఉంది.

 

పిఆర్‌ఐలు చేపట్టిన ఆదర్శప్రాయమైన పని ఆధారంగా షార్ట్ వీడియో ఫిల్మ్‌లలో చిత్రీకరించే ఉత్తమ అభ్యాసాలను కాన్ఫరెన్స్ ప్రదర్శిస్తుంది. ఇది ఎక్కువ ఎక్స్‌పోజర్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మరియు అనుభవ భాగస్వామ్యంతో ఈఆర్‌ల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

 

జాతీయ పంచాయతీ అవార్డులు-2023 కింద తెలంగాణ రాష్ట్రంలోని గౌతమ్‌పూర్ గ్రామ పంచాయతీ ఆరోగ్యవంతమైన పంచాయతీగా, నెల్లుట్ల గ్రామపంచాయతీ  తగినంత నీటి వసతులగల పంచాయతీగా మరియు క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా మహారాష్ట్రలోని కుండల్ గ్రామపంచాయతీ మొదటి స్థానంలో నిలిచాయి. "ఆరోగ్యకరమైన గ్రామం" థీమ్ కింద పంచాయతీలు ఆరోగ్య పరీక్షలు, 100% రోగనిరోధకత, సంస్థాగత ప్రసవం, పౌష్టికాహారం మరియు ఐసీడిఎస్ ద్వారా ప్రారంభ శిశు సంరక్షణ మొదలైన వాటి ద్వారా అందరికీ ఆరోగ్యకరమైన జీవితాలను మరియు శ్రేయస్సును అందించాలి. ' పుష్కలంగా నీరు ఉండే పంచాయతీ గ్రామం' కింద ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యాలు, గ్రే వాటర్ ట్రీట్‌మెంట్ & శుద్దీకరణ, భూగర్భజలాల క్షీణత, ఆర్సెనిక్ కాలుష్యం, వర్షపు నీటి సంరక్షణ & భూగర్భ జలాల రీఛార్జ్ మొదలైనవి అవసరం. 'క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్' కింద పంచాయతీలు 100% ఓడీఎఫ్ గ్రామాలు, ఘన & ద్రవ వ్యర్థాలు, నిర్వహణ, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం, మెరుగుపరచబడిన గ్రీన్ కవర్, జీవవైవిధ్య పరిరక్షణ మొదలైన అంశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆరోగ్యకరమైన పంచాయతీలు, నీటి వసతులు మరియు క్లీన్ & గ్రీన్ పంచాయతీల క్రింద అవార్డు గెలుచుకున్న పంచాయతీల నుండి ప్రతినిధులు తమ ప్రయత్నాలలో ఎదుర్కొన్న విజయాలు మరియు సవాళ్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.

 

వీటికితోడు ఈ 3 థీమ్‌లలో అసాధారణ రచనలు చేసిన ప్రముఖులు కూడా సాంకేతిక సెషన్‌లలో పాల్గొంటారు. ప్రముఖులలో పద్మశ్రీ పోపాత్రరావు పవార్, మాజీ సర్పంచ్, హివారే బజార్ పంచాయతీ, మహారాష్ట్ర; శ్రీమతి ప్రియాంక తివారీ, సర్పంచ్, రాజ్‌పూర్ గ్రామ పంచాయతీ, హత్రాస్, యూపీ, మరియు శ్రీమతి అసీనా మనాఫ్, ప్రెసిడెంట్, అలయమోన్ గ్రామ పంచాయతీ, కొల్లాం, కేరళ ఉన్నారు. ఎన్‌ఐఆర్‌డిఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అంజన్ భంజా మరియు యశద డిడిజి డాక్టర్ మల్లినాథ్ కల్శెట్టి ఈ సమావేశంలో మొదటి మరియు రెండవ సెషన్‌ను మోడరేట్ చేస్తారు.

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ వేడుకకు హాజరై దేశంలోని పిఆర్‌ఐలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా లైన్ మినిస్ట్రీలు/డిపార్ట్‌మెంట్ల నుండి సీనియర్ అధికారులు; తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పాల్గొంటాయి. సెక్రటరీ శ్రీ సునీల్ కుమార్‌తో పాటు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు అలాగే శ్రీమతి మమతా వర్మ, సంయుక్త కార్యదర్శి; శ్రీ ఎ పి నగర్, సంయుక్త కార్యదర్శి మరియు శ్రీ వికాస్ ఆనంద్, సంయుక్త కార్యదర్శి పాల్గొంటారు.


*****



(Release ID: 1918127) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi