రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ సాంస్కృతతిక పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికిందిః సోమ్‌నాథ్‌లో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
17 APR 2023 2:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ సాంస్కృతతిక పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికింది. రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 17 ఏప్రిల్, 2023న గుజరాత్‌లోని సోమనాథ్‌లో జరుగుతున్న సౌరాష్ట్ర- తమిళ సంగమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొన్నారు. దేశంలోని శతాబ్ధాల పురాతనమైన సంప్రదాయాలను, సంస్కృతులను ప్రజలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. భారతదేశపు పాతుకుపోయిన సంప్రదాయాలు శక్తిని & ఐక్యతను, ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే దక్షతను & సామర్ధ్యాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దుల భద్రత, ఆహారం, ఇంధనం, పర్యావరణం, సైబర్, అంతరిక్షం వంటి అంశాల భద్రతతో సమానంగా సాంస్కృతిక భద్రతను కలిగి ఉండాల్సిన అవసరాన్ని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వం సాంస్కృతిక భద్రతకు ప్రాధాన్యమిస్తోందని, అదే సమయంలో సాంస్కృతిక ఐక్యతను కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టిని పెడుతోందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సౌరాష్ట్ర, తమిళనాడుల సంగమంగా- భారతదేశ సాంస్కృతిక ఐక్యత వేడుకగా, ఏక్‌భారత్, శ్రేష్ఠ భారత్‌కు ప్రదీప్తమైన ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
****
(Release ID: 1917378)
Visitor Counter : 183