రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
17 ఏప్రిల్ 2023న న్యూఢిల్లీలో జరుగనున్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో సమావేశానికి అధ్యక్షత వహించనున్న కేంద్ర రోడ్డు రవాణా& హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
17 APR 2023 10:30AM by PIB Hyderabad
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో న్యూఢిల్లీలో సోమవారం జరుగనున్న సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా& హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి (రోడ్డు రవాణా& హైవేలు), రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ప్రధాన కార్యదర్శి / కార్యదర్శి (రవాణా) & రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా కమిషనర్లు కూడా పాల్గొననున్నారు.
సరుకు & ప్రజల కదలికలు సాఫీగా సాగేందుకు తోడ్పడడం, ఆర్ధిక కార్యకలాపాలు సమర్ధవంతంగా కొనసాగడం, ప్రజల మధ్య ఐక్యత, సమన్వయం, దేశాన్ని సమగ్రాభివృద్ధి దిశగా మళ్లించడం ద్వారా రోడ్డు రవాణా మన దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రోడ్డు రవాణా రంగం నమ్మశక్యం కాని పురోగతిని సాధించినప్పటికీ, మరింత అర్థవంతమైన, భారీ ప్రభావాన్ని చూపేందుకు అత్యంత సంభావ్యత ఉంది.
సాంకేతిక పురోగతికి అనుగుణంగా, రోడ్డు రవాణా& హైవేల (ఎంఒఆర్‌టిహెచ్) మంత్రిత్వ శాఖ భారతదేశంలో భవిష్యత్ సంసిద్ధత కలిగిన రోడ్డు రవాణాను అభివృద్ధి చేసే ఉద్దశంతో పలు చర్యలు తీసుకుంది. భద్రత& సుస్థిరత అనేవి ఈ చర్యలకు చోదకంగా ఉంది.
తుక్కు అయిన వాహనాల నుంచి విలువైన ముడిపదార్ధాలను సంగ్రహించడం ద్వారా వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాలెంటరీ వెహికల్- ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ (వి-విఎంపి)ను ప్రారంభించి, తద్వారా వర్తుల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం.
ఎలక్ట్రిక్ (విద్యుత్) వాహనాలకు ప్రోత్సాహకాలు, ఉదజని, ఎతెనాల్ మిశ్రమాలు, బయో సిఎన్‌జి తదితరాలు, హరిత హైవేల అభివృద్ధి తదితరాల చొరవల ద్వారా పునరుత్పాదక ఇంధనం, డీకార్బొనైజేషన్ (కర్బనరహితం) ప్రోత్సహించేందుకు విస్త్రత చర్యలను చేపడుతున్నారు.
రోడ్డు భద్రత కోసం రోడ్డు భద్రత ఆడిట్, నివారణ/ దిద్దుబాటు చర్యలు, వాహనాలలో భద్రతా లక్షణాలకు అవకాశం, ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ & అమలు, డ్రైవర్ శిక్షణా సంస్థల ఏర్పాటు, నిబంధనలు పాటించే వారి భద్రత కోసం నియమాలు తదితరాలు వంటి అనేక చొరవలను చేపట్టడం జరిగింది.
పైన పేర్కొన్న సమావేశం రవాణా సంబంధిత అనేక సమస్యలను చర్చించేందుకు, పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా నవీన & వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ తరహా సమావేశం ఫెడరలిజం పునాదులను బలోపేతం చేసేందుకు మాత్రమే కాక, అందరి ప్రయోజనం కోసం కేంద్ర, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల మధ్య మరింత లోతైన సమన్వయ, సహకాలను పెంపొందించేందుకు అవకాశాన్ని ఇస్తుంది.
***
(Release ID: 1917346)
Visitor Counter : 195