పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాతావరణ మార్పులను తట్టుకొనేందుకు అభివృద్ధే మన మొదటి రక్షణ వ్యవస్థ
- ఇదే విషయాన్ని ఐపీసీసీ ఏఆర్ 6 నివేదిక పునరుద్ఘాటిస్తోంది: శ్రీ భూపేందర్ యాదవ్
- 2050 నాటికి ప్రపంచం నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకొనేందుకుగాను అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉంది: కేంద్ర మంత్రి
Posted On:
15 APR 2023 11:11AM by PIB Hyderabad
వాతావరణ మార్పులను తట్టుకొనే దిశగా అభివృద్ధే మన మొదటి రక్షణ వ్యవస్థ అని ఐపీసీసీ ఏఆర్ 6 నివేదిక పునరుద్ఘాటిస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మరియు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. పారిస్ ఒప్పందంలో అంగీకరించిన విధంగా ప్రపంచ ఉష్ణోగ్రత లక్ష్యాన్ని సాధించడానికి కార్బన్ డైఆక్సెడ్ ప్రాథమిక జీహెచ్జీ అని.. ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ఈ నివేదిక బలపరుస్తోందని తెలిపారు. జపాన్‌లోని సపోరోలో వాతావరణం, ఇంధన నవరులుమరియు పర్యావరణంపై జరిగిన జీ7 మంత్రుల సమావేశం ప్లీనరీ సెషన్‌లో ఆయన ప్రసంగిస్తూ, 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రపంచ లక్ష్యానికి అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాల తగ్గించుకొనే వ్యవస్థను మెరుగుపరచుకోవడం అవసరం అని అన్నారు. భారత దేశం వంటి దేశాలు తమ ప్రజలకు అవసరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది తగిన అవకాశాన్ని అందిస్తుంది, వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత మరియు కాలుష్యం యొక్క ప్రభావాలకు వ్యతిరేకంగా అవసరమైన రక్షణను అందిస్తుంది అని వివరించారు. శ్రీ యాదవ్ మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుండి ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని సాధించడానికి జీహెచ్జీలు అసమానమైన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని అన్నారు. సహజ వనరులను అధికంగా వినియోగించుకోవడం కూడా విస్తృతంగా పర్యావరణ క్షీణతకు దారితీసిందని ఆయన అన్నారు. ఇది ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోందని వివరించారు. ప్లానెట్ ఎర్త్ ఉనికికి తీవ్రమైన ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
వాతావరణ మార్పు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం వంటి సవాళ్ల నుండి మన గ్రహాన్ని కాపాడేందుకు, రియో సమావేశాల వ్యవస్థాపక సూత్రాల ప్రకారం మార్గనిర్దేశం చేసే సమిష్టి చర్య అవసరమని శ్రీ యాదవ్ అభిప్రాయపడ్డారు. యుఎన్‌ఎఫ్‌సీసీసీ, సీబీడీ, యుఎన్‌సీసీడీ ప్రక్రియ ద్వారా సమిష్టిగా కొంత పురోగతి సాధించామని ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం మరియు కాలుష్యం అనే మూడు సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా అమలు, ఆర్థిక మరియు సాంకేతిక సాధనాలు అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా తమ కట్టుబాట్లను చక్కగా అమలు చేస్తాయని మరియు పర్యావరణ క్షీణత మరియు జీవవైవిధ్య నష్టాన్ని ఎదుర్కోవటానికి అదే విధంగా తగిన తొడ్పాటు అందిస్తాయని తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈక్విటీ మరియు సీబీడీఆర్-ఆర్‌సీని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన దేశాలు తమ కట్టుబాట్లను అమలు చేసే మార్గాలను అందిస్తే తప్ప కార్బన్ న్యూట్రాలిటీ మరియు ఎదిగిన ఆశయంపై లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని శ్రీ యాదవ్ అన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి విధాన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంపై మా చర్యలు ఇప్పటివరకు దృష్టి సారించాయని శ్రీ యాదవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దీనిని వ్యక్తుల స్థాయిలో భాగస్వామ్య ప్రక్రియగా మార్చడంపై దృష్టి సారించాల్సిన సమయం ఇదేనని అన్నారు. వ్యక్తిగత చర్యలతో విప్లవాత్మక మార్పునకు దారితీసు అవకాశం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. షర్మ్ ఎల్ షేక్‌లోని సీఓపీ 27లో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి స్థిరమైన జీవనశైలి మరియు వినియోగం మరియు ఉత్పత్తి యొక్క స్థిరమైన నమూనాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత మరియు కాలుష్యానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేందుకు, మిషన్ లైఫ్ స్ఫూర్తితో వ్యక్తిగత ప్రవర్తనపై దృష్టి సారించడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని శ్రీ యాదవ్ సమావేశానికి హాజరైన అన్ని దేశాలను అభ్యర్థించారు.
***
(Release ID: 1917075)