శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ను కలిసి, కృత్రిమ మేథ, క్వాంటమ్‌ తదితర రంగాలలో లోతైన ద్వైపాక్షిక సంబంధాలను కోరిన, అమెరికా సెనేటర్‌ టాడ్‌ యంగ్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధి బృందం.


క్వాంటమ్‌ టెక్నాలజీ, సముద్ర విజ్ఞాన శాస్త్రం, అణు ఇంధనం, సెమికండక్టర్లు, సూపర్‌ కంప్యూటింగ్‌, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో భాగస్వామ్య అవకాశాలను అన్వేషించాలని, ఇరుదేశాలూ పరస్పర సహకారాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లాలని సెనేటర్‌ టాడ్‌ యంగ్‌ కోరారు.

Posted On: 14 APR 2023 1:44PM by PIB Hyderabad

అమెరికా సెనేటర్‌ టాడ్‌ యంగ్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధివర్గం , కేంద్ర శాస్త్ర , సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞానం, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్‌, అణుఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ను కలిసి ,కృత్రిమ మేధ(ఎఐ), క్వాంటమ్‌, సైబర్‌ సెక్యూరిటీ, సెమికండక్టర్‌, క్లీన్‌ ఎనర్జీ, అధునాతన వైర్‌లెస్‌, బయో టెక్నాలజీ, జియో సైన్స్‌, ఆస్ట్రోఫిజిక్స్‌, రక్షణ, తదితర రంగాలలో ఉభయదేశాల మధ్య లోతైన ద్వైపాక్షి సంబంధాలను కోరుకుంటున్నట్టు తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గత 9 సంవత్సరాలలో, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ,సామాజిక రంగాలకు సంబంధంచిన పలు పథకాలను ,శాస్త్ర విజ్ఞాన ఆధారిత పరిష్కారాల ద్వారా సానుకూలంగా అమలు చేసేందుకు , సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేససేందుకు    ప్రయత్నించినట్టు అమెరికా ప్రతినిధి వర్గానికి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ తెలిపారు.
 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ అందించిన సహాయంతో శాస్త్ర  విజ్ఞాన రంగంలో నూతన అవకాశాలకు తలుపులు తెరిచినట్టయిందని చెప్పారు.  ప్రత్యేకించి అంతరిక్షం, బయోటెక్నాలజీ, జియోస్పాటియల్‌, సుస్థిర అంకురాలు వంటి వాటి గురించి ఆయన ప్రస్తావించారు. 2014 నుంచి ప్రతి స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి, కీలక శాస్త్ర విజ్ఞానసవాళ్లు, ప్రాజెక్టులను ఆవిష్కరిస్తూ వచ్చారని అందులో పరిశుభ్రత, హైడ్రోజన్‌ మిషన్‌, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థ, డీప్‌ ఓషన్‌ మిషన్‌, క్లీన్‌ ఎనర్జీ, స్టార్టప్‌లు ఉన్నాయి.

ఇరుదేశాలమధ్య సహకారాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని, క్వాంటమ్‌ టెక్నాలజీ, సముద్ర విజ్ఞానం, అణుఇంధనం, సెమీకండక్టర్లు, సూపర్‌ కంప్యూటింగ్‌, ఇతర ఆధునిక సాంకేతికతల విషయంలో భాగస్వామ్య అవకాశాలను అన్వేషించాలని సెనేటర్‌ టాడ్‌ యంగ్‌ కోరారు. ఇండియా అమెరికాల మధ్య సంయుక్త ప్రాజెక్టుల కింద 35 జాయింట్‌ ప్రాజెక్టులను గుర్తించడం జరిగిందని, వీటిని టెక్నాలజీ ఇన్నొవేషన్‌ హబ్‌లు ( టిఐహెచ్‌) అమెరికాలోని పరిశోధన సంస్థల ద్వారా అమలు చేయడం జరుగుతుందని  డిపార్టమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ఒక ఉన్నతాధికారి కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ మద్దతు కలిగిన సంస్థలతో కలసి , పరిశోధన, అభివృద్ధి సమన్వయం కోసం ఎన్‌.ఎం. `ఐసిపిఎస్‌ కింద ఆరు టిఐహెచ్‌లను గుర్తించడం జరిగింద. ఈ హబ్‌లు ఐదేళ్ల కాలావధిగల , సుమారు 340 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డిఎస్‌టి, చేపట్టే నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌ డిసిప్లినరీ, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్‌లో భాగం. ఇందులో అకడమిక్‌ పరిశోధకులు, పరిశ్రమ వర్గాల భాగస్వామ్యం ఉంటుంది. దీనికితోడు, ఇండో` అమెరికన్‌ సంయుక్త పరిశుద్ధ ఇంధన పరిశోధన అభివృద్ధి కార్యక్రమం భారత ప్రభుత్వ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ అలాగే, అమెరికా వారి ఇంధన విభాగం చేపట్టే సంయుక్త కార్యక్రమం.

డిపార్టమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రారంభించిన టెక్నాలజీ ఇన్నొవేషన్‌ హబ్‌లు, ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ల మధ్య మరింత సమన్వయానికి అమెరికా ఎదురుచూస్తున్నట్టు సెనేటర్‌ టాడ్‌యంగ్‌ తెలిపారు. ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ కు అకడమిక్‌ నైపుణ్యాలు, వాణిజ్యపరమైన కీలక సామర్ధ్యాలు ఉన్నాయన్నారు.

మరో కొలాబరేషన్‌ గురించి ప్రస్తావిస్తూ, డాక్టర్‌ జితేంద్రసింగ్‌, కేంద్ర కేబినెట్‌ ఎల్‌.ఐ.జి.ఒ`ఇండియా ప్రాజెక్టును కేంద్ర కేబినెట్‌ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అధునాతన గ్రావిటేషనల్‌ వేవ్‌ డిటెక్టర్‌ను మహరాష్ట్రలో 2,600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడానికి ఉద్దేశించినదని చెప్పారు.దీని నిర్మాణం 2030 నాటికి పూర్తికాగలదని చెప్పారు. ఈ తరహా అబ్జర్వేటరీలలో ఇది మూడవదని ఆయన తెలిపారు. దీనిని అమెరికాలోని లూసియానా, వాషింగ్టన్‌లో గల ఇంటర్‌పెరోమీటర్‌ గ్రావిటేషపనల్‌ వేవ్‌ అబ్జర్వేటరీలు ( ఎల్‌.ఐ.జి.ఒ)ల కచ్చితమైన స్పెసిఫికేషన్లకు అనుగుణం

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా,యునైటడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వేలు ఐదు కీలక రంగాలలో ఎం.ఒ.యులు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు మంత్రి తెలిపారు. బయోటెక్నాలజీ, డైరీ, అగ్రిటెక్‌ రంగాలలో ఆశావహ స్టార్టప్‌ల నిర్మాణంలో ఇండియా `అమెరికా కొలాబరేషన్‌ విషయంలో భారత శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వశాఖ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రపంచనాయకత్వానికి సానుకూల , పటిష్ట బంధాన్ని ఏర్పరచుకునేందుకు ఇండియా, అమెరికాలకు ఇది అత్యుత్తమ సమయమని ఆయన అన్నారు. ఇరుదేశాలూ ఆశించిన లక్ష్యాలు సాధించేందుకు పరస్పర సంబంధాలలో సానుకూలత, ఆశావహ దృక్పథం వంటివి పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద, ప్రాచీన ప్రజాస్వామిక దేశంగా  సహజ మిత్రదేశమైన ఇండియాకు మద్దతుగా ఉండగలదన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ (పిఎస్‌ఎ) ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌, శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వశాఖలోని ఇతర సీనియర్‌ అధికారుల, అణు ఇంధన విభాగంలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.గా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఎల్‌.ఐ.జి.ఒ`ఇండియాలు వీటితో కలిసి పనిచేస్తాయన్నారు. 

***



(Release ID: 1916836) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Marathi , Hindi