శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి(సి ఎస్ ఐ ఆర్ )కి చెందిన జాతీయ భౌతిక ప్రయోగశాల (ఎన్ పి ఎల్) ప్రజలకోసం ఒక వారం రోజుల పాటు తెరుస్తారు


సి ఎస్ ఐ ఆర్- జాతీయ భౌతిక ప్రయోగశాల 2023 ఏప్రిల్ 17-21 వరకు 'ఒక వారం ఒక ప్రయోగశాల' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పరస్పర సాహచర్యం , తూనికలు,కొలతల సమాలోచన, పరిశోధనాభివృద్ధి సమావేశం, విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితశాస్త్రాలలో మహిళలు మరియు విజ్ఞానశాస్త్ర సభ ఉంటాయి.

Posted On: 14 APR 2023 4:34PM by PIB Hyderabad

 భారత ప్రామాణిక కాలం (ఐ ఎస్ టి) సంరక్షణ బాధ్యతలను  సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ నిర్వహిస్తోందని మీకు తెలుసా ? అంతే కాదు అత్యంత ఖచ్చితమైన ఉపగ్రహ సంబంధాల ద్వారా అంతర్జాతీయ సమన్విత సార్వత్రిక సమయం (యుటిసి)తో ముడిపడిన భారతీయ ప్రామాణిక కాలాన్ని నానో సెకండ్ల వరకు లెక్క గడతారు.  సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ లో జాతి కాలం ఏ విధంగా టిక్కు ! టిక్కు! మని  ముందుకెళుతుందో చూడవచ్చు.

వాతావరణంలో కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి  వాయువు, గాలిలో ఎగిరే రేణువుల కొలతలను సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ ప్రమాణీకరిస్తుందని మీకు తెలుసా?

ఎన్నికలలో ఓటేసిన వారిని గుర్తించేందుకు వాడే ఎన్నికల సిరా లేక  మాసిపోని సిరాలను 1952లో సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ తయారు చేసిందని,  భారతీయ ప్రజాస్వామ్యానికి ఇది ఎంతో ముఖ్యమైన తోడ్పాటుగా భావిస్తారని మీకు తెలుసా?  

దేశంలో ప్రతి రోజూ ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను పునరుపయోగించడానికి అవసరమైన టెక్నాలజీని సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ అభివృద్ధి చేసిందని,  దానితో రంగురంగుల టైల్స్ తయారు చేస్తారని మీకు తెలుసా?  

విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఈ వింతలన్నింటి గురించి స్వయంగా, సరికొత్తగా సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్ లో  తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.   ఎందుకంటే శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలికి చెందిన జాతీయ భౌతిక ప్రయోగశాల 2023  ఏప్రిల్ 17-21 వరకు 'ఒక వారం ఒక ప్రయోగశాల' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఈ సందర్బంగా ప్రజల సందర్శనార్ధం ప్రయోగశాలను వారం రోజులపాటు  తెరిచి ఉంచుతారు.

     కేంద్ర  సైన్స్ & టెక్నాలజీ శాఖ  మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల అద్వితీయమైన  'ఒక వారం - ఒక ప్రయోగశాల' కార్యక్రమాన్ని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి(సి ఎస్ ఐ ఆర్ )కి  చెందిన అన్ని ప్రయోగశాలలు ఒక్కొక్కటి వారం రోజుల చొప్పున ప్రజల సందర్శనార్ధం తెరిచి ఉంచుతారు.  ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రయోగశాలల్లో  ఉన్న టెక్నాలజీలను ప్రజలకు చూపడమే కాక సరికొత్త ఆవిష్కరణలు చేసే యువతలో, విద్యార్థులలో, అంకుర సంస్థలలో, విద్యావేత్తలలో మరియు పరిశ్రమవర్గాలలో  సృజనాత్మకతను ప్రోత్సహించడం , అవకాశాల కోసం వెతుకులాటను  ప్రోదిచేయడం కూడా.   రానున్న వరుస వారాలలో 'ఒక వారం , ఒక ప్రయోగశాల'  ప్రచారోద్యమంలో భాగంగా  సి ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలలు తమ ప్రత్యేక కొత్త కల్పనలను,    టెక్నాలజీ అన్వేషణలను దేశ ప్రజలకు చూపడం జరుగుతుంది.  సి ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలలు అద్వితీయమైనవి.  విశేషమైన క్షేత్రాలలో ప్రత్యేకతను సాధించాయి.  విశ్వజన్యురాశి నుంచి భూవిజ్ఞాన శాస్త్రం వరకు, ఆహారం నుంచి ఇంధనం వరకు, లోహాల నుంచి పదార్ధాల వరకు ఉన్నాయి.  

      సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్  డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట శుక్రవారం పత్రికాగోష్టిలో మాట్లాడుతూ జాతీయ భౌతిక ప్రయోగశాల  2023 ఏప్రిల్ 17-22 మధ్య ఒక వారం - ఒక ప్రయోగశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.   ఎన్ పి ఎల్ లో లభ్యమవుతోన్న టెక్నాలజీలు మరియు సేవల గురించి సంభావ్య భాగస్వామ్య పక్షాలకు జాగృతి కలుగజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.  అంతేకాక "సామాజిక సమస్యలకు పరిష్కారం సూచించడం,  సున్నితత్వ  కొలతల ప్రాముఖ్యతను గురించి జనబాహుళ్యానికి
 శీఘ్రగ్రాహకముచేయడం,   జనబాహుళ్యంలో ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తయిన విద్యార్థులలో శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేయడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం" అని ఆయన తెలిపారు.    
           సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్  'ఒక వారం - ఒక ప్రయోగశాల' కార్యక్రమంలో వివిధ ఉత్సాహకార్యాలు నిర్వహిస్తారు.   వారంరోజుల కార్యాలు శుక్రవారం ఏప్రిల్ 14వ తేదీన న్యూఢిల్లీ లోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పత్రికాగోష్ఠితో మొదలవుతాయి.  ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 17వ తేదీన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ , సి ఎస్ ఐ ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలై సెల్వి సమక్షంలో  ప్రారంభిస్తారు.   " ప్రారంభోత్సవం రోజు ప్రధానంగా  స్కూల్ / కాలేజీ విద్యార్థులతో  పరస్పర చర్యపై కేంద్రీకరిస్తారు.  ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని వివిధ పాఠశాలలు,  కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ఆ రోజు జరిగే అనేక  ఉత్సాహకార్యాలలో  ప్రధానంగా రెండింటిని పేర్కొనవచ్చు.  అవి క్విజ్ పోటీ , ప్రయోగశాల సందర్శన.   ఆ రోజు విద్యార్థులు ఎన్ పి ఎల్ శాస్త్రజ్ఞులను కలుసుకొని ముచ్చటించవచ్చు" అని కూడా  ప్రొఫెసర్ ఆచంట తెలిపారు.

      సి ఎస్ ఐ ఆర్-ఎన్ పి ఎల్   'ఒక వారం - ఒక ప్రయోగశాల' కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్ పి ఎల్  వెబ్ సైట్ https://www.nplindia.org/ సందర్శించవచ్చు.   ఆసక్తి ఉన్నవారు కార్యక్రమంలో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు. ఎన్ పి ఎల్ -ఇండియా పార్లమెంట్ చట్టం ద్వారా 'జాతీయ ప్రమాణాల'  సంరక్షణకు 'జాతీయ తూనికలు, కొలతల సంస్థ' (ఎన్ ఎం ఐ)గా నియమితమైంది.  దేశ అవసరాల కోసం కొలతలను వ్యాప్తి చేయడం దాని బాధ్యత.  అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన రీతిలో  భారతీయ కొలతల్లో ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో ఎన్ పి ఎల్  నిమగ్నమై ఉంది.  

 

***



(Release ID: 1916833) Visitor Counter : 140


Read this release in: English , Urdu , Hindi