వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రెండు దేశాలకు సంబంధించి పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై శ్ ఇటలీ పరిశ్రమల శాఖ మంత్రి అడాల్ఫో ఉర్సో, ఉప ప్రధాన మంత్రి , మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ మాటియో సాల్వినితో విస్తృత చర్చలు జరిపిన శ్రీ పీయూష్ గోయల్
Posted On:
14 APR 2023 12:36PM by PIB Hyderabad
భారతదేశం, ఫ్రాన్స్ దేశాలకు సంబంధించి పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై ఇటలీ పరిశ్రమల శాఖ మంత్రి అడాల్ఫో ఉర్సో, ఉప ప్రధాన మంత్రి , మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ మాటియో సాల్వినితో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విస్తృత చర్చలు జరిపారు. రోమ్‌లో నిన్న ఇరు దేశాల మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న సమస్యల పరిధిని చర్చించారు. శ్రీ గోయల్‌తో పాటు సీనియర్ అధికారులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం శ్రో గోయల్ తో పాటు ఫ్రాన్స్ దేశ మంత్రులు, సీనియర్ అధికారులతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
ఇటలీ ప్రధానమంత్రి శ్రీమతి జార్జియా మెలోనీ ఇటీవల భారతదేశంలో పర్యటించిన సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యన్ని పెంపొందించడానికి జరిగిన ప్రయత్నాలను ఇరు దేశాల మంత్రులు ప్రస్తావించారు. యువశక్తి, డిజిటలైజేషన్, 140 బిలియన్ల ప్రజల సహకారంతో భారతదేశం సాధించిన ప్రగతిని శ్రీ గోయల్ ప్రస్తావించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భారతదేశం సాధించిన ప్రగతిని శ్రీ గోయల్ వివరించారు.2021లో పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించి 40% విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం భరతదేశం సాధించిందని శ్రీ గోయల్ ఫ్రాన్స్ బృందానికి తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని శ్రీ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కింద భారతదేశం 1.4 ట్రిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడిని పెట్టిందని శ్రీ గోయల్ ఫ్రాన్స్ మంత్రి ఉర్సోకు వివరించారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఇటలీ మేడ్ ఇన్ కార్యక్రమాల కింద రెండు దేశాలు పరస్పర ప్రయోజనం కలిగిన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను పరిశీలించాలని రెండు దేశాల మంత్రులు నిర్ణయించారు. భారతదేశం , ఇటలీకి చెందిన వ్యాపార సంఘాలు పరస్పరం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని, సాంకేతికత, ఆవిష్కరణలపై పరస్పరం మార్పిడి చేసుకోవాలని మంత్రులు పేర్కొన్నారు. అంతరిక్షం, రక్షణ, ఐటీ, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని మంత్రి ఉర్సో అన్నారు. భారతదేశం మరియు ఈయూ న్యాయమైన, సమానమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదుర్చుకోవాలని ఆయన అన్నారు. భారతదేశంలో పర్యటించాలని మంత్రి ఉర్సోకు శ్రీ గోయల్ ఆహ్వానం అందించారు.
సీఐఐ నేతృత్వంలోని వ్యాపార ప్రతినిధి బృందం మంత్రి ఉర్సో, అతని సహచరులతో చర్చలు జరిపింది. భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన రెండు దేశాలు మరింత సహకారంతో పనిచేసి అభివృద్ధి సాధించాలని రెండు దేశాలు మంత్రులు ఆకాంక్షించారు.
ఫ్రాన్స్ ఉప ప్రధాన మంత్రి, ఇటలీ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు సుస్థిర అభివృద్ధి సాధన మంత్రి, మాటియో సాల్వి తో సమావేశం అయ్యారు. సుస్థిర చలనశీలత రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలైన పీఎం గతిశక్తి, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శ్రీ గోయల్ ప్రస్తావించారు.ప్రత్యేక రవాణా మార్గాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు హై-స్పీడ్ రైల్వే లైన్‌ల రంగాలలో పెట్టుబడులు ఎక్కువ చేయాలని శ్రీ గోయల్ కోరారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలనుఅభివృద్ధి చేయడానికి $ 1.4 ట్రిలియన్ల పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు. సుస్థిర అభివృద్ధి సాధించడానికి, శూన్య కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ గోయల్ ఫ్రాన్స్ మంత్రికి వివరించారు. లక్ష్య సాధన కోసం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగ సామర్ద్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించడానికి భారత్‌ను సందర్శించాలని డిప్యూటీ పీఎం సాల్వినిశ్రీ గోయల్ ఆహ్వానించారు. సిసిలీని ప్రధాన భూభాగంతో అనుసంధానించడానికి చేపట్టిన ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్ వంతెన నిర్మాణ ప్రగతిని శ్రీ గోయల్ వివరించారు. సంస్కృతి, వంటలు, భాష, చలనచిత్రాలు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి సహకరిస్తాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో సంస్కృతి, వంటలు, భాష, చలనచిత్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శ్రీ గోయల్ అన్నారు.
రెండు రోజుల పాటు రోమ్ లో పర్యటించిన శ్రీ గోయల్ ఫ్రాన్స్ డిప్యూటీ ప్రదానమంత్రులు తజాని, సాల్విన్, క్యాబినెట్ మంత్రి ఉర్సో, సహాయ మంత్రులు సిరియెల్లి, సిల్లి,వాలెంటినితో సమావేశం అయ్యారు.
ఇండియా-ఇటలీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ప్రెసిడెంట్ సేన్ టెర్జీ, 8 మంది పార్లమెంట్ సభ్యులు, రెండు దేశాలకు చెందిన ప్రముఖ సంస్థల ఎండీ,సీఈఓ లు, వివిధ రంగాలకు చెందిన వ్యాపార వాణిజ్య సంస్థల అధిపతులు ఇటలీకి చెందిన 8 ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
***
(Release ID: 1916827)
Visitor Counter : 149