ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐఎంఎఫ్/డబ్ల్యూబీ సమావేశాల్లో శ్రీలంక రుణ సమస్యలపై ఉన్నత స్థాయి చర్చ
प्रविष्टि तिथि:
14 APR 2023 9:18AM by PIB Hyderabad
ఈ రోజు వాషింగ్టన్ డి.సి.లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)-ప్రపంచ బ్యాంకు (డబ్ల్యూబీ) వసంత కాల సమావేశాల సందర్భంగా, శ్రీలంక రుణ సమస్యలపై ఉన్నత స్థాయి చర్చ జరిగింది. భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జపాన్ ఆర్థిక మంత్రి సుజుకి షునిచి, ఫ్రాన్స్ ట్రెజరీ డైరెక్టర్ జనరల్ ఇమ్మాన్యుయేల్ మౌలిన్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి షెహన్ సేమసింఘే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి రణిల్ విక్రమసింఘే వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు.
శ్రీలంకతో కలిసి, రుణ పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించి బహుపాక్షిక సహకారంపై చర్చించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. భారత్, జపాన్, ఫ్రాన్స్ సహ నాయకత్వంలో, శ్రీలంక రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై చర్చలు ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరైన తోడ్పాటును శ్రీలంకకు అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ చెప్పారు. రుణ పునర్వ్యవస్థీకరణ చర్చల్లో పారదర్శకత, సమానత్వం ఉండేలా చూసేందుకు రుణదాతల మధ్య సహకారం ముఖ్యమని స్పష్టం చేశారు.
****
(रिलीज़ आईडी: 1916457)
आगंतुक पटल : 207