పర్యటక మంత్రిత్వ శాఖ

ముంబయిలో ఎస్.సి.ఒ, మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 13 APR 2023 3:53PM by PIB Hyderabad

కేంద్ర  పర్యాటక మంత్రిత్వ శాఖ నాలుగోది మరియు చివరి ఎస్.సి.ఒ. మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ను ఈ నెల 13 నుండి 19 ఏప్రిల్ 2023 వరకు ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో నిర్వహిస్తోంది, ఈ కార్యక్రమానికి ఎస్.సి.ఒ. సభ్య దేశాల (కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు రష్యా) నుండి చెఫ్‌లు హాజరవుతారు. కార్యక్రమంలో 9 రోజుల పాటు వీరు హాజరవుతారు. ఈవెంటులో భాగంగా హోటల్‌కు వచ్చే అతిథులకు వీరు వివిధ వంటకాలను మరియు పలు ఆఫర్‌లను ప్రదర్శించి అందించనున్నారు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం (ఐవైఎం 2023) జ్ఞాపకార్థం  తాజ్ మహల్ ప్యాలెస్ ఎస్.సి.ఒ.  మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్‌లో ఎస్.సి.ఒ. మెంబర్ చెఫ్‌లు చేతితో ఎంపిక చేసిన మిల్లెట్‌లతో తయానే చేసిన ఆర్గానిక్ మీల్స్ ఎంపిక చేయబడతాయి. ఏప్రిల్ 14 నుండి 19 వరకు ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లోని షామియానా రెస్టారెంట్‌లో లంచ్ మరియు డిన్నర్ కోసం ఈ ఉత్సవం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ.) అనేది ఎనిమిది సభ్య దేశాలైన చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, నాలుగు పరిశీలక దేశాలు మరియు పద్నాలుగు "చర్చల భాగస్వామ్యం"తో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎస్.సి.ఒ.  యొక్క సభ్య దేశాల నిపుణులు ఎస్.సి.ఒ. టూరిజం బ్రాండ్‌ను ప్రోత్సహించడం, పర్యాటకంలో ఎస్.సి.ఒ. సభ్యదేశాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, పర్యాటకంలో సమాచారం మరియు డిజిటల్ టెక్నాలజీని పంచుకోవడం మరియు మార్పిడి చేయడం వంటి సహకార రంగాలలో వివిధ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వైద్య మరియు ఆరోగ్య పర్యాటక రంగంలో పరస్పర సహకారం, సేవల నాణ్యతను మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టారు. ఎస్.సి.ఒ.  దేశాలు విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి, ఇది వారి వంటకాలను సముచితంగా ప్రతిబింబిస్తుంది. ఎస్.సి.ఒ. దేశాల వంటకాలు ఆహార ప్రియులకు ప్రత్యేకమైన ఆనందాన్ని అందిస్తాయి. అవగాహన కల్పించడంతోపాటు మిల్లెట్ల ఉత్పత్తి & వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మిల్లెట్‌లు వాతావరణాన్ని తట్టుకోగలవు మరియు వాటిని వినియోగించడం వల్ల ప్రపంచం కనీసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ఆరు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. ప్రధాన మంత్రి నేతృత్వంలో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జీఏ) ఆమోదించిన అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఎం) 2023 ప్రతిపాదనను భారత ప్రభుత్వం ప్రాయోజితం చేసింది.  ఐవైఎంని జరుపుకోవడంలో భారత ప్రభుత్వం ముందంజలో ఉండేందుకు ఈ ప్రకటన కీలకంగా మారింది. భారత ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ కూడా భారతదేశాన్ని ‘గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్’గా నిలబెట్టడంతో పాటు ఐవైఎం 2023ని ‘పీపుల్స్ మూవ్‌మెంట్’గా మార్చాలనే తన దృష్టి కోణాన్ని పంచుకున్నారు.

***



(Release ID: 1916376) Visitor Counter : 158