రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జమ్మూ-శ్రీనగర్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానంగా ఉండే విధంగా శ్రీనగర్ - జమ్మూ లోని బనిహాల్ సెక్షన్ నుండి ఉధంపూర్-రాంబన్-బనిహాల్ నుండి శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) వరకు నిర్మిస్తున్న రహదారిని జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాతో కలిసి పరిశీలించిన - శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
11 APR 2023 12:50PM by PIB Hyderabad
జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్), కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ లతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, జమ్మూ-శ్రీనగర్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానంగా ఉండే విధంగా శ్రీనగర్ - జమ్మూ లోని బనిహాల్ సెక్షన్ నుండి ఉధంపూర్-రాంబన్-బనిహాల్ నుండి శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) వరకు నిర్మిస్తున్న రహదారిని పరిశీలించారు.
జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 35,000 కోట్ల రూపాయల వ్యయంతో మూడు కారిడార్లను నిర్మిస్తున్నారు. దీని కింద, మొదటి కారిడార్ లో భాగంగా జమ్మూ నుంచి ఉధంపూర్-రాంబన్-బనిహాల్ వరకు అక్కడ నుంచి శ్రీనగర్ వరకు నిర్మిస్తున్న రహదారిలో శ్రీనగర్ నుంచి బనిహాల్ మార్గం కూడా కలిసి ఉంది. 250 కిలోమీటర్ల పొడవున, ఈ నాలుగు వరుసల రహదారిని, 16,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇందులో 210 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణం పూర్తయింది. ఈ మార్గంలో 21.5 కిలోమీటర్ల మేర 10 సొరంగాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో తరచూ సంభవించే కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను అధిగమించే విధంగా భౌగోళిక, భౌగోళిక-సాంకేతికతల పరిశోధనల ఆధారంగా ఈ రహదారిని నాలుగు వరుసల రహదారిగా రూపకల్పన చేయడం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని సురక్షితంగా, సాఫీగా చేయడానికి ప్రమాదాలను అరికట్టే విధానాలతో పాటు, ఇతర రహదారి భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది.
ఈ మార్గం నిర్మాణంతో జమ్మూ-శ్రీనగర్ ల మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లో అనుసంధానత ఉంటుంది. శ్రీనగర్ నుండి జమ్మూ కి ప్రయాణ సమయం 9-10 గంటల నుంచి 4-5 గంటలకు తగ్గుతుంది. రాంబన్ మరియు బనిహాల్ మధ్య 40 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రవాణా రహదారి మార్గం 2024 జూన్ నాటికి పూర్తవుతుంది. ఇది శ్రీనగర్ ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.
*****
(Release ID: 1915739)
Visitor Counter : 195