రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 12000 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న 212 కిమీల 6-లేన్ ఢిల్లీ- డెహ్రీడూన్ గ్రీన్‌ఫీల్డ్ ఆక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ను త‌నికీ చేసిన శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 06 APR 2023 8:40PM by PIB Hyderabad

కేంద్ర స‌హాయ మంత్రి శ్రీ జ‌న‌ర‌ల్ వికె సింగ్‌, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో క‌లిసి రూ. 12,000 కోట్ల‌తో నిర్మిస్తున్న 212 కిమీల 6 లేన్ ఢిల్లీ- డెహ్రాడూన్ గ్రీన్‌ఫీల్డ్ ఆక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను కేంద్ర ర‌హ‌దారి ర‌వాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ త‌నిఖీ చేశారు. 


నాలుగు భాగాలుగా విభ‌జిత‌మైన ఈ ఎక్స్‌ప్రెస్ వేను  ఢిల్లీలోని అక్ష‌ర్‌ధామ్ స‌మీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ వే (డిఎంఇ) నుంచి శాస్త్రీ పార్క్‌, ఖ‌జూరీ ఖాస్‌, మండోలాలోని ఖేక్రా వ‌ద్ద ఇపిఇ మార్పుతో, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని భాగ్‌ప‌ట్‌, షామ్లీ, స‌హ్రాన్‌పూర్ నుంచి ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ వ‌ర‌కూ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. దీనితో పాటుగా, రూ. 1995 కోట్ల ఖ‌ర్చుతో డెహ్రాడూన్‌లోని డ‌ట్‌క‌లీ వ‌ద్ద 340 మీట‌ర్ల పొడ‌వైన 3 లేన్ సొరంగాన్ని నిర్మిస్తోంది. 
మొత్తం కారిడార్ నిర్మాణంలో అనేక ప్ర‌త్యేక కేటాయింపులు చేయ‌డం జ‌రిగింది. ఇందులో, గ‌ణేశ్‌పూర్ నుంచి డెహ్రాడూన్ వెళ్ళే మార్గాన్ని వ‌న్య‌ప్రాణుల‌కు సుర‌క్షితంగా ఉంచ‌డం జ‌రిగింది.  ఇందులో 12 కిమీల ఎత్తైన రోడ్డు, 6 వ‌న్య‌ప్రాణ దిగువ మార్గాలు, 2 ఏనుగుల‌కు దిగువ మార్గాలు, 2 పెద్ద‌ వంతెన‌లు, 13 చిన్న‌వంతెన‌లు, 113 వియుపి (దిగువ నుంచి వాహ‌నాలు వెళ్ళేందుకు మార్గాలు), ఎల్‌వియుపి (తేలిక‌పాటి వాహ‌నాల కోసం దిగువ లేదా సొరంగ మార్గాలు) ఎస్‌వియుపి( చిన్న‌వాహ‌నాల‌కు దిగువ‌/ సొరంగ మార్గాలు), 5 ఆర్ఒబిలు, 4 పెద్ద వంతెన‌లు, 62 బ‌స్ షెల్ట‌ర్ల‌ను ఈ మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటుగా, 76 కిమీల స‌ర్వీస్ రోడ్డును, 29 కిమీల ఎత్తైన రోడ్డును, 16 ప్ర‌వేశ - నిష్క్ర‌మ‌ణ పాయింట్ల‌ను కూడా నిర్మిస్తున్నారు. 
ప్ర‌యాణీకుల సౌక‌ర్యం కోసం, ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో 12  ర‌హ‌దారి ప‌క్క‌న సౌక‌ర్యాల స‌దుపాయంఉంది. ఈ హైవేతో హ‌రిద్వార్‌ను అనుసంధానం చేసేందుకు, 51 కిమీల 6 లేన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రూ 2095 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తున్నారు. 

 

***
 


(Release ID: 1914645) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi